Friday, July 25, 2014

అంతర్జాతీయ ధీర వనిత' అవార్డు(International-Women-of-Courage-Award)

మార్చి - 4,2014

యాసిడ్ దాడికి గురై, ఆ తరహా దాడులకు వ్యతిరేకంగా ఉద్యమాలు నడిపిన భారత్‌కు చెందిన లక్ష్మికి ప్రతిష్ఠాత్మకమైన అమెరికా ప్రభుత్వ 'అంతర్జాతీయ ధీర వనిత' అవార్డును వాషింగ్టన్‌లో అమెరికా ప్రథమ మహిళ మిషెల్ ఒబామా ప్రదానం చేశారు.   »   ప్రేమను నిరాకరించిందనే కోపంతో 2005లో ఢిల్లీలో లక్ష్మిపై ఓ వ్యక్తి యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. అప్పుడు ఆమె వయసు 16 ఏళ్లు. ఆమె ముఖం పూర్తిగా దెబ్బతింది. తనలా మరో వనిత యాసిడ్ దాడులకు గురికాకూడదని లక్ష్మి భారత్‌లో ఉద్యమం చేపట్టింది.   
»   2012లో ఢిల్లీలో బస్సులో సామూహిక అత్యాచారానికి గురై, ప్రాణాలు కోల్పోయిన 'నిర్భయ'కు గతేడాది ఈ పురస్కారం దక్కింది.

No comments:

Post a Comment