Wednesday, July 30, 2014

కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం 2013 (kendraSahitya Akademi Award 2013)

డిసెంబరు - 18,2013


తెలుగు సాహిత్యంలో విశేష కృషి చేసిన కాత్యాయని విద్మహే కి ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం దక్కింది.      
»  తెలుగులో స్త్రీల కవిత్వ - కథ - అస్తిత్వ చైతన్యంపై కాత్యాయని రచించిన 'సాహిత్యాకాశంలో సగం' అనే వ్యాస సంకలనానికి ఈ పురస్కారం లభించింది.
      »  కాత్యాయని విద్మహే వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగం సీనియర్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు.      
»  మొత్తం 24 అధికార భాషలకు 22 భాషల నుంచి రచయితలను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. అస్సామీస్, గుజరాతీ భాషలకు పురస్కారాన్ని ప్రకటించలేదు.      
»  ప్రముఖ బాలీవుడ్ గేయ రచయిత, స్క్రిప్ట్ రచయిత జావేద్ అక్తర్, ప్రముఖ హిందీ నవలా రచయిత్రి మృదులాగార్గ్, ప్రముఖ బెంగాలీ కవి సుబోధ్ సర్కార్ తదితరులు ఈ పురస్కారానికి ఎంపికైన వారిలో ఉన్నారు.      
»  జావేద్ అక్తర్ కలం నుంచి జాలువారిన 55 ఉర్దూ కవితల సంకలనం 'లావా'కు, మృదులాగార్గ్ రచించిన 'మిల్ జుల్ మన్' నవలకు ఈ పురస్కారం లభించింది.      
»  కవితల విభాగంలో ఎనిమిది పుస్తకాలను, నాలుగు వ్యాసాలను, మూడు నవలలను, రెండు కథలను, రెండు ట్రావెలాగ్‌లను, ఒక స్వీయ చరిత్రను, జ్ఞాపకాల విభాగంలో ఒక పుస్తకాన్ని, ఒక నాటకాన్ని ఈ పురస్కారానికి సాహిత్య అకాడమీ ఎంపిక చేసింది. నాటకం విభాగంలో ఒడిశాకు చెందిన బిజయ్ మిశ్రా ఎంపికయ్యారు. ఆయన రచించిన 'వన ప్రస్తా' అనే నాటకానికి ఈ పురస్కారం లభించింది.      
»  వరంగల్ జిల్లాకు చెందిన సాహిత్యవేత్తలకు ఈ అవార్డు రావడం ఇది రెండోసారి. ప్రముఖ నవలా కారుడు అంపశయ్య నవీన్ తెలంగాణ సంస్కృతి, ప్రజల జీవన విధానాలపై రాసిన 'కాలరేఖలు' నవలకు 2004లో తొలిసారి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.      »  2014 మార్చి 11న ఢిల్లీలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో పురస్కార గ్రహీతలకు రూ.లక్ష నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రాలను ప్రదానం చేయనున్నారు.
Javed Akhtar
mridula garg
subodh sarkar
bijay misra

Katyayni vidhmahe



No comments:

Post a Comment