Saturday, July 26, 2014

98 పులిట్జర్ పురస్కారము (98 Pulitzer Prize)

ఏప్రిల్ - 15,2014

భారత్‌లో జన్మించి, అమెరికాలో స్థిరపడిన కవి విజయ్ శేషాద్రి ప్రతిష్ఠాత్మక పులిట్జర్ పురస్కారానికి ఎంపికయ్యారు. 
  »    'త్రీ సెక్షన్స్' పేరుతో ఆయన రాసిన కవితా సంపుటికి ఈ ఏడాది పురస్కారం దక్కింది. మానవ చైతన్యాన్ని అత్యంత ప్రతిభావంతంగా విశ్లేషించిన కవితా సంపుటిగా 'త్రీ సెక్షన్స్‌'ని పులిట్జర్ ఎంపిక కమిటీ అభివర్ణించింది.   
»    ఈ 98వ పులిట్జర్ పురస్కారాలను అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయం ప్రకటించింది.   
»    పులిట్జర్ పురస్కారానికి ఎంపికైన భారతీయ మూలాలున్న వారిలో విజయ్ శేషాద్రి అయిదోవ్యక్తి. 1937లో గోవింద్ బిహారీలాల్ (సైన్స్ రచనలకు), 2000లో ఝంపా లాహిరి (కథారచనకు), 2003లో గీతా ఆనంద్ (వాల్‌స్ట్రీట్ జర్నల్‌లో పరిశోధనాత్మక కథనాలకు), 2011లో సిద్ధార్థ ముఖర్జీ (కేన్సర్‌పై రాసిన పుస్తకానికి) పులిట్జర్ ప్రైజ్‌ను అందుకున్నారు.  
 »    పులిట్జర్ పురస్కారం కింద 10 వేల అమెరికన్ డాలర్లను అందిస్తారు. 

98వ పులిట్జర్ పురస్కారాల్లో ఇతర రంగాల్లో విజేతలు:
 కాల్పనిక సాహిత్యం విభాగంలో అమెరికా రచయిత డోనాటార్ట్ రచించిన 'ద గోల్డ్ ఫించ్' ఈ ఏడాది పులిట్జర్‌కు ఎంపికైంది
 నాటకం విభాగంలో అనీబేకర్ రాసిన 'ద ఫ్లిక్' ఎంపికైంది.
 'పోటీల ద్వారా తాజా వార్తలు విభాగంలో న్యూయార్క్ టైమ్స్‌కు పురస్కారం లభించింది. కెన్యాలోని వెస్ట్‌గేట్ మాల్‌పై జరిగిన ఉగ్రవాద దాడిని కళ్లకు కట్టినట్లుగా ఉన్న ఫొటోలను ఈ పత్రిక ప్రచురించింది.   
»    పులిట్జర్ ప్రజాసేవ పతకానికి వాషింగ్టన్ పోస్ట్, గార్డియన్ అమెరికా ఎడిషన్ ఎంపికయ్యాయి. అమెరికా జాతీయ భద్రతా సంస్థ జరిపిన రహస్య నిఘా గురించి ఈ రెండు పత్రికలు విస్తృత స్థాయిలో కథనాలు అందించాయి.  
 »    తాజా వార్తల విభాగంలో బోస్టన్ గ్లోబ్ పులిట్జర్ పురస్కారానికి ఎంపికైంది.

Image result for vijay seshadri

No comments:

Post a Comment