Monday, July 21, 2014

చిన్న బ్యాంకులు, పేమెంట్ బ్యాంకు

జులై - 17,2014
¤  సమాజంలోని అన్ని వర్గాలకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తెచ్చి, పూర్తిస్థాయిలో ఫైనాన్షియల్ ఇంక్లూజన్ సాధించాలనే ఆశయంతో చిన్న బ్యాంకులు, పేమెంట్ బ్యాంకుల లైసెన్సుల జారీకి రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాలు ప్రకటించింది.  
 »    భారీ వాణిజ్య బ్యాంకుల సేవలు పొందలేని వర్గాలకు, మారుమూల ప్రాంతాలకు సేవలు విస్తరించడమే వీటి లక్ష్యం.   
»    సాధారణ వాణిజ్య బ్యాంకుల స్థాపనకు రూ.500 కోట్ల మూలధన పెట్టుబడి అవసరం కాగా చిన్న, చెల్లింపు బ్యాంకులకు ఈ మొత్తాన్ని రూ.100 కోట్లకు పరిమితం చేశారు.   
»    ఎన్‌బీఎఫ్‌సీలు, మైక్రో ఫైనాన్స్ సంస్థలు, స్థానిక బ్యాంకులు చిన్న స్థాయి బ్యాంకులుగా మారేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు.   
»    చిన్న బ్యాంకులు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని పొరుగు జిల్లాల్లో మాత్రమే కార్యకలాపాలు నిర్వహించాలి. స్థానికత, అక్కడ సంస్కృతికి అనుగుణంగా పనిచేయాలి. భౌగోళికంగా సారూప్యత ఉంటే, ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాల్లో చిన్న బ్యాంకుల సేవలు అందించేందుకు ఆర్‌బీఐ అనుమతిస్తుంది.

No comments:

Post a Comment