Saturday, August 2, 2014

ఇండోనేషియాలోని బాలిలో జరుగుతున్న డబ్ల్యూటీవో మంత్రుల సదస్సులో భారత్ అభివృద్ధి చెందిన దేశాలను నిలువరించి, తన మాటను ఏవిధంగా నెగ్గించుకుంది ?

డిసెంబరు - 6,2013

ఇండోనేషియాలోని బాలిలో జరుగుతున్న డబ్ల్యూటీవో మంత్రుల సదస్సులో భారత్ అభివృద్ధి చెందిన దేశాలను నిలువరించి, తన మాటను నెగ్గించుకుంది. ఆహారభద్రత విషయంలో తన వాదనను గట్టిగా వినిపించి, వాటిని దారికి తెచ్చింది.
      

» వాణిజ్య అంశాల్లో ప్రపంచ దేశాలపై గణనీయ ప్రభావం చూపే డబ్ల్యూటీవో భారత్ మాటకు తలొగ్గింది. ఆహారభద్రత చట్టాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లేవిధంగా భారత్ విజయం సాధించింది.
     

 » ప్రధాన ఆహారధాన్యాలకు రాయితీ కల్పించినా, ఎటువంటి కఠిన ఆంక్షలు విధించకుండా డబ్ల్యూటీవోను ఒప్పించింది.
      

» ఈ ఒప్పందం ఫలితంగా భారత్‌లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధర నిర్ణయించడానికి, ప్రధాన ఆహారోత్పత్తులను పేదలకు రాయితీ ధరలపై అందించడానికి, అనూహ్య అవసరాల కోసం ఆహారధాన్యాలను నిల్వ ఉంచుకోవడానికి వీలవుతుంది.


No comments:

Post a Comment