Monday, August 4, 2014

ప్రపంచంలో ఏయే దేశంలో ఎంత అవినీతి ఉందో తెలుపుతూ ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ ఏటా ప్రచురించే జాబితాలో భారత్

డిసెంబరు - 3,2013

ప్రపంచంలో ఏయే దేశంలో ఎంత అవినీతి ఉందో తెలుపుతూ ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ ఏటా ప్రచురించే జాబితాలో భారత్ ఈ సంవత్సరంలో 94వ స్థానంలో నిలిచింది. గతేడాది కూడా భారత్ ఇదే స్థానంలో నిలిచింది.
          

»  177 దేశాలున్న ఈ జాబితాలో అవినీతి అత్యంత తక్కువగా ఉన్న దేశాలుగా డెన్మార్క్, న్యూజిలాండ్‌లు మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి.
          

»  అవినీతిలో కూరుకుపోయిన సోమాలియా, ఉత్తరకొరియా, అఫ్గానిస్థాన్‌లు చివరి స్థానంలో నిలిచాయి.
         

 »పెద్దన్నగా వ్యవహరించే అమెరికా 19వ స్థానంలో నిలిచింది.
          
»  పాకిస్థాన్ 127, బంగ్లాదేశ్ 136 స్థానాల్లో ఉన్నాయి.
          

»  మూడు నుంచి పది స్థానాల్లో వరుసగా ఫిన్‌లాండ్, స్వీడన్, నార్వే, సింగఫూర్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, కెనడా ఉన్నాయి.

No comments:

Post a Comment