Friday, August 1, 2014

'అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ థొరాసిక్ సర్జరీ (ఆట్స్)'లో సభ్యత్వం లభించిన తెలుగు వ్యక్తి

మే - 2,2014
రాష్ట్రానికి చెందిన ప్రముఖ హృద్రోగ నిపుణుడు డాక్టర్ సజ్జా లోకేశ్వరరావుకు అరుదైన గౌరవం దక్కింది. ఆయనకు 'అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ థొరాసిక్ సర్జరీ (ఆట్స్)'లో సభ్యత్వం లభించింది.   
»   80 దేశాలకు చెందిన 4,800 మంది వైద్య నిపుణులు పాల్గొన్న 'ఆట్స్' 94వ వార్షిక సదస్సు కెనడాలోని టొరంటోలో జరిగింది. హైదరాబాద్‌లోని స్టార్ ఆస్పత్రిలో సేవలందిస్తున్న లోకేశ్వరరావు కూడా ఈ సదస్సుకు హాజరయ్యారు.   
»   సదస్సులో కొత్తగా 37 మంది కార్డియోథొరాసిక్ సర్జన్లకు ఆట్స్‌లో సభ్యత్వం లభించింది. వీరిలో భారత్‌కు చెందిన ఏకైక వైద్యనిపుణుడు లోకేశ్వరరావు కావడం గమనార్హం.    
»   1917లో ఏర్పాటైన ఆట్స్‌లో ఇప్పటిదాకా కేవలం ముగ్గురు భారతీయులకు మాత్రమే సభ్యత్వం లభించింది. ఇప్పుడు ఆ ఘనత సాధించిన నాలుగో భారతీయుడిగా, మొట్టమొదటి తెలుగు వ్యక్తిగా లోకేశ్వరరావు ఖ్యాతి గడించారు.

 

No comments:

Post a Comment