Friday, August 1, 2014

ప్రపంచంలోనే ఎత్తయిన రైల్వే వంతెనను నిర్మిస్తున్న భారత్

జూలై - 12,2014

ప్రపంచంలోనే ఎత్తయిన రైల్వే వంతెనను జమ్ముకాశ్మీర్‌లోని కౌరీ ప్రాంతంలో చీనాబ్ నదిపై నిర్మిస్తున్నారు.      
 »  ఉత్తర జమ్ముకాశ్మీర్‌లో పర్వత ప్రాంతాల్లో సంధానతను పెంచడానికి ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుంది. ఇది జమ్మూను బారముల్లాతో కలుపుతుంది. ఫలితంగా రెండు ప్రాంతాల మధ్య ప్రయాణ సమయం ఆరున్నర గంటలకు తగ్గిపోతుంది.       
»  ఫ్రాన్స్‌కే తలమానికమైన ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎత్తు ఉండే ఈ బ్రిడ్జి 2016కి పూర్తవుతుంది. నిర్మాణం పూర్తయ్యేసరికి ఈ వంతెన ఎత్తు 359 మీటర్లు ఉంటుందని అంచనా.       
»  చైనాలోని గుయ్‌జో ప్రావిన్స్‌లోని బెయ్ పాంజియాంగ్ నదిపై నిర్మించిన వంతెనకు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే బ్రిడ్జిగా గుర్తింపు ఉంది. దాని ఎత్తు 275 మీటర్లు. భారత్‌లో వంతెన నిర్మాణం పూర్తయితే ఆ రికార్డు బద్దలవుతుంది. ఈ వంతెన పొడవు 1315 మీటర్లు. నిర్మాణానికి ఉపయోగించనున్న ఉక్కు 25వేల టన్నులు.       
»  ఉక్కు స్తంభాల సంఖ్య 17. స్తంభం గరిష్ఠ ఎత్తు 133.7 మీటర్లు. వంతెన ఖరీదు రూ.512 కోట్లు. మొత్తం ప్రాజెక్ట్ వ్యయం రూ.20 వేల కోట్లు.
 

No comments:

Post a Comment