Monday, August 4, 2014

చర్మంపై రాసుకునే ఫెయిర్‌నెస్ క్రీముల్లో విషపూరిత భార లోహాలు, లిప్‌స్టిక్‌లలో క్యాన్సర్ కారక క్రోమియం గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం

జనవరి - 15,2014

చర్మంపై రాసుకునే ఫెయిర్‌నెస్ క్రీముల్లో విషపూరిత భార లోహాలు, లిప్‌స్టిక్‌లలో క్యాన్సర్ కారక క్రోమియం ఉన్నట్లు సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సీఎస్ఈ) సంస్థ నివేదికలో వెల్లడైంది.
      
»
   32 ఫెయిర్‌నెస్ క్రీములను పరీక్షించగా 44% క్రీముల్లో పాదరసం ఉందనీ, 30 లిప్‌స్టిక్ నమూనాలను పరీక్షంచగా 43% లిప్‌స్టిక్‌లలో నికెల్ ఉందనీ వెల్లడైంది.
14 ఫెయిర్‌నెస్ క్రీముల్లో పాదరసం మోతాదు 0.10 పీపీఎం నుంచి 1.97 పీపీఎం వరకు ఉంటోందని సీఎస్ఈ నివేదిక పేర్కొంది.
      
»
   ఔషధ, సౌందర్య సాధనాల చట్టాలు, నిబంధనల మేరకు సౌందర్య సాధనాల్లో పాదరసాన్ని వినియోగించడం నిషిద్ధం. పాదరసం కిడ్నీలను దెబ్బతీసే అవకాశముంది. చర్మంపై దద్దుర్లు, మచ్చలు ఏర్పడొచ్చు. చర్మం రంగు కూడా మారవచ్చు. ఇవి ఆందోళన, కుంగుబాటు వంటి సమస్యలకూ దారి తీయవచ్చు.
      
»
   30 లిప్‌స్టిక్‌లను పరీక్షించగా 15 లిప్‌స్టిక్‌ల్లో క్రోమియం మోతాదు 0.45 పీపీఎం నుంచి 17.83 పీపీఎం వరకు ఉన్నట్లు బయటపడింది. అలాగే 13 లిప్‌స్టిక్‌లలో నికెల్ మోతాదు 0.57 పీపీఎం నుంచి 9.18 పీపీఎం వరకు ఉన్నట్లు వెల్లడైంది.
      
»
   అయితే చర్మం ముడతలు తగ్గించే క్రీములు, లిప్ బామ్‌ల్లో మాత్రం భార లోహాలేవీ కనపడలేదు. అలాగే లిప్‌స్టిక్‌లలో సీసం, కాడ్మియం ఆనవాళ్లు కూడా బయట పడలేదు.
     
 »
   ప్రముఖ పర్యావరణవేత్త సునీతా నారాయణ్ సీఎస్ఈ డైరెక్టర్ జనరల్‌గా ఉన్నారు.

No comments:

Post a Comment