Friday, August 29, 2014

ఏపీ రాష్ట్ర బడ్జెట్‌ 2014-15 ముఖ్యాంశాలు



హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర 2014-15 బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఈ ఉదయం 11 గంటలకు శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా యనమల మాట్లాడుతూ... 2014-15 బడ్జెట్‌ మొత్తం రూ.1,11,884 కోట్లు, ప్రణాళిక వ్యయం రూ.26,673 కోట్లుగా వెల్లడించారు. ద్రవ్యలోటు రూ.19,028 కోట్లు, రెవెన్యూ లోటు 6,064 కోట్లు, ప్రణాళికేతర వ్యయం రూ.85,151 కోట్లు ఉంటుందని వివరించారు.
వివిధ శాఖలకు బడ్జెట్‌ కేటాయింపులు... 
* హోంశాఖకు రూ.3,734కోట్లు 
* విపత్తు నిర్వహణకు రూ.403 కోట్లు 
* ఐటీ శాఖకు రూ.111 కోట్లు 
* పరిశ్రమల శాఖకు రూ.615 కోట్లు 
* నీటిపారుదల శాఖకు రూ.8,465 కోట్లు 
* ఇంధన శాఖకు రూ.7,164 కోట్లు కేటాయించారు. 
* యువజన సర్వీసులశాఖ రూ.126కోట్లు 
* వికలాంగ సంక్షేమ, వృద్ధులకు రూ.65కోట్లు 
* మహిళా శిశుసంక్షేమశాఖకు రూ.1049కోట్లు 
* మైనార్టీ సంక్షేమ శాఖకు రూ.371కోట్లు 
* వెనుకబడిన తరగతులు సంక్షేమానికి రూ.3,130కోట్లు 
* గిరిజన సంక్షేమ శాఖకు రూ.1,150కోట్లు కేటాయించారు. 
* రోడ్లు, భవనలశాఖ రూ.2,612కోట్లు 
* మౌలిక వసతులకు రూ.73కోట్లు 
* అటవీ పర్యావరణ, శాస్త్రసాంకేతికశాఖ రూ. 418కోట్లు
* ఉన్నత విద్యశాఖకు రూ.2,275 కోట్లు 
* ఇంటర్‌ విద్యకు రూ.812 కోట్లు 
* పాఠశాల విద్యాశాఖకు రూ.12,595 కోట్లు 
* వైద్య ఆరోగ్యశాఖకు రూ.4,388 కోట్లు 
* కార్మిక, ఉపాధి కల్పనకు రూ.276 కోట్లు 
* పట్టణాభివృద్ధిశాఖకు రూ.3,134 కోట్లు 
* గ్రామీణ నీటి సరఫరాకు రూ1,115 కోట్లు 
* పంచాయతీ రాజ్‌శాఖకు రూ.4,260 కోట్లు కేటాయించినట్లు చెప్పారు.

No comments:

Post a Comment