Sunday, September 6, 2015

ప్రభుత్వ రంగ బ్యాంకులకోసం ఇంద్రధనుష్ ఆవిష్కరించిన కేంద్ర ప్రభుత్వం

ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్‌బీ) తోడ్పాటునిచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం 14 ఆగస్టు 2015 న ఏడు సూత్రాల ‘ఇంద్రధనుష్’ ప్రణాళికను ఆవిష్కరించింది. దీని కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 13 పీఎస్‌బీలకు 25 వేల కోట్ల రూపాయిలు అందించనున్నారు.
ఇంద్రధనుష్ ప్రణాళికలోని ఏడు సూత్రాలు:బ్యాంకుల్లో నియామకాల కోసం బోర్డు ఆఫ్ బ్యూరో ఏర్పాటు
మూలధనం సమకూర్చడం
మొండిబకాయిల తగ్గింపు చర్యలు
రాజకీయ ప్రమేయం తగ్గిస్తూ సాధికారత కల్పించడం
జవాబుదారీతనం పెంచడం
గవర్నెన్స్‌పరమైన సంస్కరణలు ప్రవేశపెట్టడం
హోల్డింగ్ సంస్థ ఏర్పాటు చేయడం
కేంద్రం అందించే నిధులు ఈ విధంగా ఉన్నాయిఎస్‌బీఐకి కి 5,531 కోట్ల రూపాయిలు
బ్యాంక్ ఆఫ్ ఇండియా కి 2,455 కోట్ల రూపాయిలు,
ఐడీబీఐ కి 2,229 కోట్ల రూపాయిలు,
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కి 2,009 కోట్ల రూపాయిలు,
బ్యాంక్ ఆఫ్ బరోడా కి 1,786 కోట్ల రూపాయిలు,
పీఎన్‌బీ కి 1,732 కోట్ల రూపాయిలు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 1,080 కోట్ల రూపాయిలు,
కెనరా బ్యాంక్ కి 947 కోట్ల రూపాయిలు,
కార్పొరేషన్ బ్యాంక్‌కు రూ. 857 కోట్ల రూపాయిలు

No comments:

Post a Comment