Thursday, September 17, 2015

సెప్టెంబరు - 8.అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాo

అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పాల్గొన్నారు.        
» 'సంసద్ ఆదర్శ్ గ్రామయోజన'లో భాగంగా దత్తత తీసుకున్న గ్రామాల్లో 2016 మార్చి నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తం 410 జిల్లాల్లో దత్తత తీసుకొన్న గ్రామాల్లో లక్ష్యాన్ని సాధించాలని ప్రభుత్వం నిర్ణయించింది.       
 » యునెస్కో నినాదం 'ఈచ్ వన్ టీచ్ వన్' (ప్రతి ఒక్కరు కనీసం ఒకరికి బోధించాలి)ను ఆదర్శంగా తీసుకొని వంద శాతం అక్షరాస్యత సాధనకు సమాజం కూడా భాగస్వామ్యం కావాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు.       
 » అక్షరాస్యతలో ఉత్తమ ఫలితాలు సాధించిన తమిళనాడు రాష్ట్రాన్ని రాష్ట్రపతి ప్రత్యేకంగా అభినందించారు.       
 » నూరు శాతం అక్షరాస్యత సాధించి, వయోజనులకు ఉపాధి రంగాల్లో, విద్యార్థులకు కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లిష్ విభాగాల్లో శిక్షణ ఇస్తున్న నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం లోని ఆదర్శ వయోజన విద్యాకేంద్రానికి అరుదైన గుర్తింపు దక్కింది. ఈ గ్రామానికి జాతీయస్థాయిలో పురస్కారం లభించింది. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా దిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ చేతుల మీదుగా అంకిరెడ్డిగూడెం సర్పంచి, ఆదర్శ వయోజన విద్యాకేంద్ర ఛైర్మన్ సుర్వి మల్లేష్ గౌడ్ పురస్కారం అందుకున్నారు.        
» దేశవ్యాప్తంగా సంపూర్ణ అక్షరాస్యత సాధించిన 5 సాక్షర భారత్ కేంద్రాలను ఎంపికచేయగా అందులో అంకిరెడ్డిగూడెం ఒకటి. పురస్కారానికి ఎంపికైన వాటిలో పాలమలై (తమిళనాడు), గిరేడు (ఛత్తీస్‌గడ్), పూసర్లపాడు (ఆంధ్రప్రదేశ్), కాంగాబౌ (మణిపూర్) గ్రామాలున్నాయి. 

No comments:

Post a Comment