Sunday, September 6, 2015

చెల్లింపు బ్యాంకులు ఏర్పాటు చేయడానికి ఆర్‌బీఐ ఆమోదం పొందిన 11 సంస్థలు

ఆగస్టు - 19 ,2015

చెల్లింపు బ్యాంకులను ఏర్పాటు చేయడానికి రిజర్వ్‌బ్యాంక్ 11 సంస్థలకు సూత్రప్రాయ అంగీకారాన్ని తెలిపింది. ఈ తాత్కాలిక అనుమతి 18 నెలల పాటు వర్తిస్తుంది. ఈ గడువులోగా ఆర్‌బీఐ మార్గదర్శకాలు, షరతులను అవి పాటించాల్సి ఉంటుంది.       
» చిన్న బ్యాంకుల లైసెన్సులను త్వరలోనే జారీ చేయనున్నట్లు ఆర్‌బీఐ వెల్లడించింది.       
» చెల్లింపు బ్యాంకులు భిన్నమైనవి. ఇవి కేవలం డిమాండ్ డిపాజిట్లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ తదితర ప్రత్యేక సేవలను మాత్రమే అందిస్తాయి. ప్రస్తుతానికి చెల్లింపు బ్యాంకులు ఒక్కో వినియోగదారుడి నుంచి గరిష్ఠంగా రూ.లక్ష మాత్రమే డిపాజిట్లు సేకరించడానకి అనుమతి ఉంది. అవి ఖాతాదార్లకు ఏటీఎమ్/ డెబిట్ కార్డులు, ఇతర ప్రీపెయిడ్ చెల్లింపు సాధనాలనూ జారీ చేయవచ్చు. అయితే క్రెడిట్ కార్డులు జారీ చేయలేవు. మ్యూచువల్ ఫండ్‌లు, బీమా ఉత్పత్తులను సైతం విక్రయించవచ్చు. రుణ సేవలకు అనుమతి లేదు. ప్రవాసులకు ఖాతాలు తెరచేందుకూ ఆమోదం లేదు.

చెల్లింపు బ్యాంకులు ఏర్పాటు చేయడానికి ఆర్‌బీఐ ఆమోదం పొందిన 11 సంస్థలు:1.రిలయన్స్ ఇండస్ట్రీస్2.ఆదిత్య బిర్లానువో3. వొడాఫోన్ ఎం-పెసా
4. ఎయిర్‌టెల్-కామర్స్ సర్వీసెస్
5. తపాలా విభాగం
6. చోళమండలం డిస్ట్రిబ్యూషన్ సర్వీసెస్
7. టెక్ మహీంద్రా
8. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ (ఎన్ఎస్‌డీఎల్)
9. ఫినో పేటెక్
10. దిలీప్ శాంతిలాల్ సంఘ్వి (సన్ ఫార్మా)
11. విజయ్ శేఖర్ శర్మ (పేటీఎమ్)


No comments:

Post a Comment