Monday, September 7, 2015

'ప్రపంచ జనాభా పోకడలు : 2015 పునశ్చరణ' పేరిట ఐరాస నివేదిక

జులై - 29,2015

'ప్రపంచ జనాభా పోకడలు : 2015 పునశ్చరణ' పేరిట ఐరాస నివేదికను విడుదల చేసింది.

ముఖ్యాంశాలు
 చైనాను అధిగమించి అత్యధిక జనాభా ఉన్న దేశంగా 2022 నాటికి భారత్ ఆవిర్భవించనుంది.

 ప్రస్తుతం ప్రపంచ జనాభాలో 19 శాతం చైనాలో, 18 శాతం భారత్‌లో ఉన్నారు. ఏడేళ్లలో చైనాను భారత్ అధిగమిస్తుంది.

 2050 నాటికి భారత్, చైనా, ఇండోనేషియా, నైజీరియా, పాకిస్థాన్, అమెరికాల్లో ఒక్కో దేశంలో 30 కోట్ల కంటే ఎక్కువ జనాభా ఉంటుంది.



 ప్రస్తుతం జనాభా పరంగా అతిపెద్ద పది దేశాలు ఆసియాలో అయిదు (చైనా, భారత్, ఇండోనేషియా, బంగ్లాదేశ్, పాకిస్థాన్), ఆఫ్రికాలో ఒకటి (నైజీరియా), లాటిన్ అమెరికాలో రెండు (బ్రెజిల్, మెక్సికో), ఉత్తర అమెరికాలో ఒకటి (యూఎస్ఏ), ఐరోపాలో ఒకటి (రష్యా సమాఖ్య) ఉన్నాయి.

 ప్రపంచ మొత్తం జనాభా ప్రస్తుతం 730 కోట్లుగా ఉంది. 2030కి 850 కోట్లకు, 2050కి 970 కోట్లకు, 2100 నాటికి 1120 కోట్లకు ప్రపంచ జనాభా చేరుతుందని అంచనా.

 2015-2050 మధ్య ప్రపంచ జనాభా మొత్తం పెరుగుదలలో సగం భారత్, నైజీరియా, పాకిస్థాన్, కాంగో, ఇంథియోపియా, టాంజానియా, అమెరికా, ఇండోనేషియా, ఉగాండా (9 దేశాలు)ల్లోనే ఉండనుంది.
 ఐరోపాలో 2050 నాటికి 34 శాతం మంది 60 ఏళ్లు పైబడిన వారే ఉండనుండటం గమనార్హం. లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాలు, ఆసియాలో 2050 నాటికి ఈ సంఖ్య 25 శాతానికి, ఆఫ్రికాలో 9 శాతానికి పెరగనుంది.






No comments:

Post a Comment