ఆగస్టు - 8,2015
దేశంలో లక్షకు పైగా జనాభా ఉన్న 476 నగరాలు/పట్టణాల్లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ స్వచ్ఛభారత్ సర్వే నిర్వహించింది. సర్వే ఆధారంగా నగరాలు/పట్టణాలకు ర్యాంకులు ప్రకటిస్తూ నివేదిక విడుదల చేసింది.
ముఖ్యాంశాలు
'జాతీయ పారిశుద్ధ్య విధానం - 2008' కింద 2014-15 ఏడాదికి ఈ సర్వే చేపట్టారు. ఆరుబయట మలవిసర్జన, ప్రజా మరుగుదొడ్లు, ఇంటింటి చెత్త సేకరణ, వ్యర్థాల నిర్వహణ మురుగునీరు, విసర్జితాల నిర్వహణ, తాగునీటి నాణ్యత తదితరాలు గీటురాయిగా ర్యాంకులు ప్రకటించారు.
మైసూరు(కర్ణాటక) పరిశుభ్రతలో జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో ఉంది. కర్ణాటకకు చెందిన నాలుగు నగరాలు తొలి పదిస్థానాల్లో ఉన్నాయి. ఒడిశాకు చెందిన సంబల్‌పూర్ చివరి (476వ ర్యాంకు) స్థానంలో నిలిచింది.
తొలి వంద స్థానాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి అయిదు పట్టణాలున్నాయి. తెలంగాణ నుంచి వరంగల్ 33వ స్థానంలో, నిజామాబాద్ 82వ స్థానంలో ఉండగా; ఆంధ్రప్రదేశ్ నుంచి విజయనగరం 58వ స్థానంలో, నరసరావుపేట 59వ స్థానంలో, గుంటూరు 70వ స్థానంలో నిలిచాయి.
ఆంధ్రప్రదేశ్‌లో 30 పట్టణాలు, తెలంగాణలో 11 పట్టణాల్లో సర్వే జరిగింది. దక్షిణ భారతదేశ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌లోనే ఆరుబయట మలవిసర్జన అత్యధికంగా ఉందని సర్వేలో వెల్లడైంది.
దేశ రాజధాని దిల్లీలోని పట్టణ, స్థానిక సంస్థలైన దిల్లీ కంటోన్మెంట్ బోర్డు (15), దిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ (16) మెరుగైన స్థానాల్లో నిలిచాయి.
పశ్చిమ్‌బంగకు చెందిన 25 నగరాలు/పట్టణాలు తొలి వంద స్థానాల్లో ఉన్నాయి.
తొలి వంద స్థానాల్లో 39 నగరాలు దక్షిణ భారతదేశం నుంచే ఉన్నాయి. రాష్ట్రాల రాజధానుల్లో 7వ ర్యాంకుతో బెంగళూరు ప్రథమ స్థానంలో ఉండగా, పట్నా 429వ ర్యాంకుతో చివరి స్థానంలో ఉంది.

|
No comments:
Post a Comment