శస్త్రచికిత్స ద్వారా రోగికి అతికించగల కృత్రిమ రక్తనాళాలను రష్యాలోని ఐటీఎమ్‌వో విశ్వవిద్యాలయ పరిశోధకులు తయారుచేశారు. వీటిలోపల ఒక పలుచని ఔషధం పూసిన పొర ప్రత్యేకంగా ఉంటుంది. దీనివల్ల వీటిలో రక్తం గడ్డకట్టే అవకాశం ఉండదు. చెడ్డ కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల కరోనరి ధమనులు మూసుకుపోయి గుండెపోటు సంభవిస్తుంది. దీనికి పరిష్కారంగా ప్రస్తుతం రోగి గుండెకు కొత్త రక్తనాళాలను అమరుస్తున్నారు. ఇవి రోగి కాలి నుంచి తీసిన రక్తనాళాలు. దీని వల్ల మళ్లీ వీటిలో రక్తం గడ్డకట్టే అవకాశం ఉంది కాబట్టి వీరు జీవితాంతం రక్తపు గడ్డలను నియంత్రించే ఆస్ప్రిన్ లాంటి ఔషధాలను వాడాల్సి ఉంటుంది. ప్రస్తుతం శాస్త్రవేత్తలు రూపొందించిన కృత్రిమ రక్తనాళాల సహాయంతో ఈ సమస్యను అధిగమించవచ్చు. వీటిని గుండెపోటు వచ్చిన రోగులకు అమర్చడం ద్వారా వారి జీవితకాలం మరింత పెంచవచ్చు. వారు జీవితాంతం రక్తపు గడ్డలను కరిగించే ఔషధాలను వాడనవసరం లేదు.
No comments:
Post a Comment