దేశరక్షణ, తీర ప్రాంత రక్షణ; శత్రువిమానాలు, క్షిపణులను గుర్తించడం లాంటి అవసరాల కోసం భారతదేశం ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్(ఐఏసీసీఎస్)ను ఏర్పాటు చేసింది. దీనిలో భాగంగా భారత నావికాదళం దేశంలోని అయిదు ప్రధాన ప్రాంతాల్లో ఆటోమేటెడ్ ఎయిర్ డిఫెన్స్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తోంది. బర్నాలా (పంజాబ్), వాడ్‌సాన్ (గుజరాత్), ఆయా నగర్ (దిల్లీ), జోధ్‌పూర్ (రాజస్థాన్), అంబాలా (హరియాణా) ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఇవే కాకుండా దిల్లీ, ముంబయి, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్, అహ్మదాబాద్ లాంటి నగరాల్లో ఉగ్రవాదుల దాడులను ఎదుర్కొనేందుకు జాయింట్ కమాండ్ అండ్ అనాలసిస్ సెంటర్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. శత్రుదేశాల విమానాలను కూల్చివేసేందుకు, ఉగ్రవాదులు విమానాలు హైజాక్ చేయకుండా ఉండేందుకు యాంటీ హైజాక్ పాలసీని ఏర్పాటు చేశారు.
ఐఏసీసీఎస్ రెండో దశలో దేశంలోని పది ప్రాంతాల్లో రాడార్లను ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం 7160 కోట్ల రూపాయలను కేటాయించారు. వీటిని ఐఏసీసీఎస్‌కు అనుసంధానం చేస్తారు. తీర ప్రాంత రక్షణకు ఫేజ్ - Iలో భాగంగా 36 రాడార్ స్టేషన్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఫేజ్ - II లోయర్ 38 రాడార్ స్టేషన్‌లను ఏర్పాటు చేస్తారు. గురగావ్‌లో ఉన్న నేషనల్ కమాండ్ కంట్రోల్ కమ్యూనికేషన్ ఇంటెలిజెన్స్ ప్రతిరోజు దేశంలోకి వచ్చే 30 వేల నుంచి 40 వేల ఓడలను గమనిస్తోంది. ఇందుకోసం రాడార్ల నుంచి వచ్చిన సమాచారాన్ని ఉపగ్రహాలకు పంపి వాటిని విశ్లేషిస్తారు.

No comments:
Post a Comment