జులై - 10, 2015
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన పీఎస్ఎల్‌వీ-సి28 ప్రయోగం విజయవంతమైంది. భారత్ మొదటిసారిగా అధిక బరువైన విదేశీ ఉపగ్రహాలను ఈ ప్రయోగం ద్వారా అంతరిక్షంలోకి పంపించింది.
» ఈ వాహక నౌక ద్వారా బ్రిటన్‌కు చెందిర అయిదు ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టారు. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఈ ప్రయోగం జరిగింది. అయిదు ఉపగ్రహాలను 647 కి.మీ. ఎత్తులో సూర్యానువర్తన కక్ష్యలో ప్రవేశపెట్టింది.
» పీఎస్ఎల్‌వీ శ్రేణిలో ఇది 30వ ప్రయోగం. ఈ ప్రయోగం పూర్తిగా వాణిజ్యపరమైంది. 30 ప్రయోగాల్లో తొలి ప్రయోగం మినహా మిగిలినవన్నీ విజయవంతమయ్యాయి. పీఎస్ఎల్‌వీ ప్రయోగాల్లో ఇప్పటి వరకు 19 దేశాలకు చెందిన 40 ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించగా, తాజా ప్రయోగంతో ఆ సంఖ్య 45కు చేరింది.
» పీఎస్ఎల్‌వీ - సి28 వాహక నౌక పొడవు 44.4 మీటర్లు, బరువు 320 టన్నులు. రాకెట్ తన వెంట 1440 కిలోల బరువును, అయిదు ఉపగ్రహాలను నింగిలోకి తీసుకెళ్లింది.
బ్రిటన్ ఉపగ్రహాలు, వాటి ప్రత్యేకతలు: డీఎంసీ 3-1, డీఎంసీ 3-2, డీఎంసీ 3-3, సీబీఎన్‌టీ-1, డీ-ఆర్బిట్ సెయిల్‌ను కక్ష్యలో ప్రవేశపెట్టింది. వీటిలో డీఎంసీ 3 ఉపగ్రహాలు ఒక్కోటి 447 కిలోల బరువు ఉన్నాయి. సీబీఎన్‌టీ-1 శాటిలైట్ 91 కిలోల బరువు డీ-ఆర్బిట్ సెయిల్ 7 కిలోల బరువు ఉంది. మొత్తం 5 ఉపగ్రహాల బరువు 1440 కిలోలు. ఈ ఉపగ్రహాలు ఏడేళ్లపాటు సేవలందించనున్నాయి.
» భూమిపై ఉన్న వనరుల సర్వేకు, వాతావరణ పరిస్థితుల అధ్యయనానికి, పట్టణాభివృద్ధి పర్యవేక్షణకు, విపత్తుల సమయంలో విలువైన సమాచారం ఇచ్చేందుకు ఇవి ఉపయోగపడతాయి.
» ఈ ఉపగ్రహాలను తన వాణిజ్య విభాగం యాంత్రిక్స్ సంస్థ ఒప్పందం మేరకు ఇస్రో నింగిలోకి పంపింది. వీటికి సంబంధించి పూర్తి హక్కులు మాత్రం (ఈ ఉపగ్రహాలు తీసే ఛాయా చిత్రాలు) చైనాకు చెందిన 21వ శతాబ్దపు ఏరోస్పేస్ టెక్నాలజీ లిమిటెడ్ (21 ఏటీ) అనే సంస్థ కొనుగోలు చేసింది. ఈ ప్రయోగం ద్వారా యాంత్రిక్స్‌కు రూ.180 కోట్ల ఆదాయం లభించింది.
» ఇస్రో ఛైర్మన్ ఏఎస్ కిరణ్ కుమార్.
» షార్ డైరెక్టర్‌గా ఇటీవల బాధ్యతులు చేపట్టిన పి.కున్హికృష్ణన్‌కు ఇదే తొలి ప్రయోగం.

No comments:
Post a Comment