ఆగస్టు - 27,2015
దేశీయ క్రయోజెనిక్ ఇంజిన్‌తో కూడిన జియోసింక్రొనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (జీఎస్ఎల్‌వీ) - డి 6 వాహక నౌకను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. దీని ద్వారా అధునాతన సమాచార ఉపగ్రహం జీశాట్ -6ను భూ బదిలీ కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఇందుకు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) వేదికగా నిలిచింది.
» ఈ ప్రయోగం విజయవంతంతో సంక్లిష్టమైన క్రయోజెనిక్ పరిజ్ఞానంపై భారత్ మరింత పట్టు సాధించినట్లయింది. ఈ తరహా ఇంజిన్‌ను సొంతంగా రూపొందించిన అమెరికా, రష్యా, ఫ్రాన్స్, జపాన్, చైనా సరసన తన స్థానాన్ని భారత్ సుస్థిరం చేసుకున్నట్లయింది. అంతరిక్ష రవాణా రంగంలో పూర్తి స్వయంప్రతిపత్తి సాధించినట్లయింది.
» క్రయోజెనిక్ ఇంజిన్ సహా రాకెట్‌లోని మూడు దశలు అద్భుతంగా పనిచేశాయి. 17.4 నిమిషాల ప్రయాణం అనంతరం మధ్యంతర భూస్థిర కక్ష్యలోని జీశాట్ - 6 ఉపగ్రహాన్ని విడిచిపెట్టింది. భూమికి 180 కి.మీ. ల పెరిజీ (కక్ష్యలో భూమికి దగ్గరగా ఉన్న బిందువు), 35,975 కి.మీ. అపోజీ (భూమికి దూరంగా ఉన్న బిందువు)లో ఉపగ్రహం చేరింది.
» ఇస్రో నిర్మించిన జీశాట్ - 6 భూస్థిర సమాచార ఉపగ్రహాల్లో 25 వది. జీశాట్ శ్రేణిలో 12వది. ఇందులో ఎస్-బ్యాండ్‌కు చెందిన యాంటెన్నా చాలా ప్రత్యేకం. దీని వ్యాసం 6 మీటర్లు. ఇస్రో రూపొందించిన యాంటెన్నాలు అన్నింటిలోకి ఇదే పెద్దది.
» దేశీయ క్రయోజెనిక్ ఇంజిన్‌ను వినియోగించడం ఇది మూడోసారి. 2010 ఏప్రిల్ 15న జీఎస్ఎల్‌వీ - డి3 వాహక నౌకకు స్వదేశీ క్రయోజెనిక్ ఇంజిన్‌ను వినియోగించారు. కానీ ఆ రాకెట్ విఫలమైంది. గతేడాది జనవరి 5న స్వదేశీ క్రయోజెనిక్ ఇంజిన్‌తో చేపట్టిన జీఎస్ఎల్‌వీ-డి5 ప్రయోగం విజయవంతమైంది.
» జీఎస్ఎల్‌వీ - డి6 బరువు 414.75 టన్నులు, ఎత్తు 49.13 మీటర్లు, వ్యాసం 3.4 మీటర్లు, దశలు 3. మొదటి దశలో ఘన ఇంధనం, రెండో దశలో ద్రవ ఇంధనం, మూడోది అయిన క్రయోజెనిక్ దశలో ద్రవ హైడ్రోజన్, ద్రవ ఆక్సిజన్ ఉపయోగించారు.
» జీశాట్ - 6 ఉపగ్రహం జీవిత కాలం 9 ఏళ్లు. ఇందులో 5 ఎస్ బ్యాండ్ ట్రాన్స్‌పాండర్లు, 5 సీ బ్యాండ్ ట్రాన్స్‌పాండర్లు ఉన్నాయి. వీటి సాయంతో విస్తృత స్థాయిలో కమ్యూనికేషన్ సేవలు అందుతాయి.
» అందులోని ఆరు మీటర్ల యాంటెన్నా భారత్‌కు చెందిన మరింత విస్తృత భూభాగంలోకి సంకేతాన్ని పంపి అందుకోగలదు. ఐదు పుంజాలతో సేవలు అందిస్తుంది. దీని వల్ల చిన్నపాటి సాధనాన్ని (మొబైల్ లేదా ట్యాబ్) ఉపయోగించేవారు మారుమూల ప్రాంతాల్లో ఉన్నప్పటికీ ఇంటర్నెట్ సేవలు పొందవచ్చు.
» జీశాట్ - 6 మొత్తం బరువు 2117 కిలోలు. ఇంధనం బరువు 1132 కిలోలు.

No comments:
Post a Comment