| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Thursday, September 17, 2015
భారత రాష్ట్రాల రాజధానులు, రాష్ట్రాల అవతరణ తేదీలు, ఆయా రాష్ట్రాల్లోని మొత్తం జిల్లాలు
భారత దేశ చరిత్రలో ముఖ్య సంఘటనలు
క్రీస్తు పూర్వం | |||
» 3000-1500 | - | సింధునాగరికత కాలం |
బుద్ధుడు
|
» 576 | - | బుద్ధుడి జననం | |
» 527 | - | మహావీరుడి జననం | |
» 327-326 | - | భారత దేశంపైకి అలెగ్జాండర్ దండయాత్ర. దీని వల్ల యూరోప్ నుంచి మన దేశానికి భూమార్గం మొదటిసారి ఏర్పడింది. | |
» 313 | - | జైన గ్రంథాల ప్రకారం చంద్రగుప్త మౌర్యుడు సింహాసనం అధిష్టించిన సంవత్సరం. | |
» 305 | - | సెల్యుకస్ నికెటర్ ను చంద్రగుప్త మౌర్యుడు ఓడించాడు. | |
» 273 - 232 | - | అశోకుడి పాలన | |
» 145 - 101 | - | చోళ వంశానికి చెందిన శ్రీలంక రాజు ఎలరా పాలన కాలం. | |
» 58 | - | విక్రమ శకం ప్రారంభం | |
క్రీస్తు శకం | |||
» 78 | - | శక యుగం ప్రారంభం | |
» 120 | - | కనిష్కుడి పట్టాభిషేకం | |
» 320 | - | గుప్తుల పాల ప్రారంభం (భారత్ లో స్వర్ణయుగం) | |
» 380 | - | విక్రమాధిత్యుడి పట్టాభిషేకం | |
» 405-411 | - | ఫాహియాన్ భారత సందర్శన | |
» 415 | - | మొదటి కుమారగుప్తుడి పట్టాభిషేకం | |
» 455 | - | స్కందగుప్తుడి పట్టాభిషేకం | |
» 606-647 | - | హర్షవర్థనుడి పాలనా కాలం | |
» 712 | - | మొదటిసారిగా భారత దేశం పై అరబ్బుల దండయాత్ర | |
» 836 | - | కనౌజ్ లో భోజరాజు పట్టాభిషేకం | |
»985 | - | రాజరాజచోళుడి పట్టాభిషేకం | |
» 998 | - | సుల్తాన్ మహమ్మద్ పట్టాభిషేకం | |
» 1001 | - | భారత దేశంపై గజనీ మహమ్మద్ మొదటి దండయాత్ర. ఇందులో పంజాబ్ రాజు జయపాలుడిని గజనీ ఓడించాడు. | |
» 1025 | - | గజనీ మహమ్మద్ దండయాత్రలో సోమనాథ దేవాలయం ధ్వంసం. | |
» 1191 | - | మొదటి తరైన్ యుద్ధం. ఘోరీ మహమ్మద్, పృథ్విరాజ్ చౌహాన్ ల మధ్య జరిగింది. పృథ్విరాజ్ విజయం సాధించాడు. | |
» 1192 | - | తరైన్ యుద్ధం. ఘోరీ మహమ్మద్, పృథ్విరాజ్ ల మధ్య జరిగింది. ఈసారి విజయం ఘోరీ మహమ్మద్ ను వరించింది. | |
» 1206 | - | కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించాడు. బానిస వంశ స్థాపన | |
» 1210 | - | కుతుబుద్దీన్ ఐబక్ మరణం | |
» 1221 | - | భారత దేశంపై మంగోలుల దండయాత్ర. ఛెంఘిజ్ ఖాన్ దండెత్తి వచ్చాడు. | |
» 1236 | - | రజియా సుల్తానా ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించింది. | |
» 1240 | - | రజియా సుల్తానా మరణం. | |
» 1246 | - | బాల్బన్ పాలన ప్రారంభం | |
» 1296 | - | అల్లాఉద్దీన్ ఖిల్జీ ఢిల్లీ సింహాసనాన్ని ఎక్కాడు. | |
» 1316 | - | అల్లాఉద్దీన్ ఖిల్జీ మరణం. | |
» 1325 | - | మహమ్మద్ బీన్ తుగ్లక్ పాలన ప్రారంభం. | |
» 1327 | - | తుగ్లక్ పాలనలో ఢిల్లీ నుంచి దౌలతాబాద్ కు రాజధాని మార్పు. | |
» 1336 | - | దక్షిణాదిన విజయనగర సామ్రజ్యానికి పునాదులు. | |
» 1351 | - | ఫిరోజ్ షా సింహాసనానికి వచ్చాడు. | |
» 1388 | - | ఫిరోజ్ తుగ్లక్ మరణం | |
» 1398 | - | భారత్ పై తైమూర్ దండయాత్రలు |
గురునానక్
|
» 1469 | - | గురునానక్ జననం | |
» 1494 | - | ఫర్ఘానాలో సింహాసనాన్ని అధిష్టించిన బాబర్. | |
» 1497-98 | - | భారత దేశానికి సముద్రమార్గం కనుగొన్న వాస్కొడిగామా. | |
» 1526 | - | మొదటి పానిపట్టు యుద్ధం. బాబర్ చేతిలో ఇబ్రహీం లోడీ పరాజయం. మొగలు సామ్రాజ్య స్థాపన. | |
» 1527 | - | కణ్వ యుద్ధం. ఇందులో రాణా సంగాను బాబర్ ఓడించాడు. | |
» 1530 | - | బాబర్ మరణం. హుమాయున్ రాజ్యానికి వచ్చాడు. | |
» 1539 | - | హుమాయున్ ను ఓడించి షేర్ షా సూరి భారత దేశ రాజ్యాధినేత అయ్యాడు. | |
» 1540 | - | కనౌజ్ యుద్ధం | |
» 1555 | - | ఢిల్లీ సింహాసనాన్ని హుమాయున్ తిరిగి దక్కించుకున్నాడు. | |
» 1556 | - | రెండో పానిపట్టు యుద్ధం | |
» 1557 | - | గోవాలో మొట్టమొదటి పుస్తక ప్రచురణ | |
» 1565 | - | తల్లికోట యుద్ధం | |
» 1576 | - | హల్దీఘాట్ యుద్ధం. అక్బర్ చేతిలో రాణా ప్రతాప్ ఓటమి. | |
» 1582 | - | దీన్-ఇ-ఇలాహీ అనే కొత్త మతాన్ని అక్బర్ ఏర్పాటు చేశాడు. | |
» 1597 | - | రాణా ప్రతాప్ మరణం | |
» 1600 | - | ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపన | |
» 1605 | - | అక్బర్ మరణం. జహంగీర్ పాలన ప్రారంభం. | |
» 1611 | - | నూర్జహన్ తో జహంగీర్ వివాహం. | |
» 1616 | - | జహంగీర్ సభను సందర్శించిన సర్ థామస్ రో. |
శివాజీ
|
» 1627 | - | శివాజీ జననం. జహంగీర్ మరణం. | |
» 1628 | - | షాజహన్ భారత దేశ చక్రవర్తి అయ్యాడు. | |
» 1631 | - | ముంతాజ్ మహల్ మరణం. | |
» 1634 | - | భారత దేశంలో బ్రిటిష్ వర్తకానికి బెంగాల్ లో అనుమతి. | |
» 1659 | - | సింహాసనాన్ని అధిష్టించిన ఔరంగజేబు. షాజహాన్ కు జైలు శిక్ష | |
» 1665 | - | శివాజీని ఖైదు చేసిన ఔరంగజేబు. | |
» 1666 | - | షాజహన్ మరణం. | |
» 1675 | - | సిక్కుల తొమ్మిదో గురువు తేజ్ బహదూర్ కి ఉరిశిక్ష | |
» 1680 | - | శివాజీ మరణం. | |
» 1684 | - | బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ బొంబాయిలో మొదటి ముద్రణాలయాన్ని స్థాపిచింది. | |
» 1707 | - | ఔరంగజేబు మరణం. | |
» 1708 | - | గురుగోవింద్ సింగ్ మరణం. | |
» 1780-84 | - | రెండో మైసూర్ యుద్ధం. | |
» 1784 | - | పిట్స్ చట్టం. | |
» 1790-92 | - | మూడో మైసూర్ యుద్ధం | |
» 1793 | - | బెంగాల్ శాశ్వత సెటిల్ మెంట్ | |
» 1799 | - | నాలుగో మైసూర్ యుద్ధం – టిప్పు సుల్తాన్ మరణం. | |
» 1802 | - | బేసిన్ ఒప్పందం | |
» 1809 | - | అమృతసర్ ఒప్పందం |
రాజా రామమోహన్ రాయ్
|
» 1828 | - | రాజారామమోహన్ రాయ్ బ్రహ్మ సమాజం ఏర్పాటు. | |
» 1829 | - | సతీసహగమన ఆచారం నిషేధం | |
» 1830 | - | బ్రహ్మ సమాజ స్థాపకుడు రాజారామమోహన్ రాయ్ ఇంగ్లండ్ సందర్శన | |
» 1833 | - | రాజారామమోహన్ రాయ్ మరణం. | |
» 1838 | - | కలకత్తాలో మొట్ట మొదటి నూలు మిల్లు ఏర్పాటు | |
» 1839 | - | మహారాజా రంజిత్ సింగ్ మరణం | |
» 1839-42 | - | మొదటి ఆగ్రా యుద్ధం | |
» 1845-46 | - | మొదటి ఆంగ్లో – సిక్ యుద్ధం | |
» 1852 | - | రెండో ఆంగ్లో – బర్మా యుద్ధం | |
» 1853 | - | బాంబే, థానేల మధ్య మొదటి రైలు ప్రయాణం. కలకత్తాలో మొదటి టెలిగ్రాఫ్ లైన్ ఏర్పాటు | |
» 1857 | - | సిపాయి తిరుగుబాటు లేదా ప్రథమ స్వాతంత్ర్య పోరాటం | |
» 1861 | - | రవీంద్రనాథ్ ఠాగూర్ జననం |
రవీంద్రనాథ్ ఠాగూర్
|
» 1867 | - | బొంబాయిలో డాక్టర్ ఆత్మారామ్ పాండురంగ ఆధ్వర్యంలో ప్రార్థనా సమాజ్ ఏర్పాటు. | |
» 1869 | - | మహాత్మా గాంధీ జననం | |
» 1875 | - | స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజ్ ఏర్పాటు; దివ్యజ్ఞాన సమాజం ఏర్పాటు. | |
» 1876 | - | సురేంద్రనాథ్ బెనర్జీ భారతీయ సంఘం (ఇండియన్ అసోసియేషన్) ఏర్పాటు. | |
» 1885 | - | భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన | |
» 1885 – 1905 | - | మితవాద యుగం | |
» 1889 | - | జవహర్ లాల్ నెహ్రూ జననం |
స్వామి వివేకానంద
|
» 1893 | - | చికాగోలో స్వామి వివేకానంద చరిత్రాత్మక ప్రసంగం. | |
» 1897 | - | సుభాస్ చంద్రబోస్ జననం | |
» 1904 | - | టిబెట్ యాత్ర | |
» 1905 | - | లార్డ్ కర్జన్ ఆధ్వర్యంలో మొదటి బెంగాల్ విభజన | |
» 1906 | - | ముస్లిం లీగ్ స్థాపన | |
» 1906 – 1920 | - | అతివాద యుగం | |
» 1909 | - | మింటో – మార్లే సంస్కరణలు | |
» 1911 | - | ఢిల్లీ దర్బార్; బ్రిటిష్ రాజు, రాణి భారత సందర్శన; భారత్ రాజధానిగా ఢిల్లీ. | |
» 1913 | - | గదర్ పార్టీ ఏర్పాటు | |
» 1914 | - | మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభం | |
» 1915 | - | భారత దేశానికి గాంధీజీ రాక. | |
» 1916 | - | కాంగ్రెస్, ముస్లిం లీగ్ మధ్య లక్నో ఒప్పందం; మద్రాస్ లో హోమ్ రూల్ లీగ్ ఏర్పాటు. | |
» 1917 | - | చంపారన్ ఉద్యమం | |
» 1918 | - | మొదటి ప్రపంచ యుద్ధం ముగింపు | |
» 1919 | - | మాంటేగ్ – ఛేమ్స్ ఫర్డ్ సంస్కరణలు, రౌలత్ చట్టం, అమృతసర్ లో జలియన్ వాలాభాగ్ ఉదంతం | |
» 1920 | - | ఖిలాఫత్ ఉద్యమం | |
» 1921 | - | ఉత్తర ప్రదేశ్ లో రైతుల పోరాటం, మోప్లా తిరుగుబాటు. | |
» 1922 | - | చౌరీచౌరా సంఘటన, సహాయ నిరాకరణ ఉద్యమం నిలుపుదల. | |
» 1922 | - | మొదటి కమ్యూనిస్టు పత్రిక సోషలిస్టు ప్రచురణ. | |
» 1926 | - | భారత దేశంలో కమ్యూనిస్టు పార్టీ స్థాపన. | |
» 1927 | - | సైమన్ కమిషన్ బహిష్కరణ; భారత్ లో బ్రాడ్ కాస్టింగ్ ప్రారంభం. | |
» 1928 | - | పంజాబ్ కేసరి లాలా లజపతిరాయ్ మరణం | |
» 1929 | - | మీరట్ కుట్ర కేసు | |
» 1929 | - | లాహోర్ లో జరిగిన కాంగ్రెస్ సదస్సులో సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం తీర్మానం | |
» 1930 | - | సహాయ నిరాకరణ ఉద్యమం, గాంధీజీ దండియాత్ర (ఏప్రిల్ 6); మొదటి రౌండ్ టేబుల్ సమావేశం. | |
» 1931 | - | గాంధీ – ఇర్విన్ ఒప్పందం; రెండో రౌండ్ టేబుల్ సమావేశం. | |
» 1932 | - | మూడో రౌండ్ టేబుల్ సమావేశం. | |
» 1935 | - | భారత ప్రభుత్వ చట్టం రూపకల్పన | |
» 1937 | - | ప్రొవిన్షియల్ అటానమీ. | |
» 1939 | - | రెండో ప్రపంచ యద్ధం ప్రారంభం. | |
» 1941 | - | రవీంద్రనాథ్ ఠాగూర్ మరణం, సుభాస్ చంద్రబోస్ భారత దేశం నుంచి తప్పించుకొని వెళ్లిపోవడం. | |
» 1942 | - | క్రిప్స్ మిషన్ ఇండియా రాక, ఆగస్టు 8న క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభం. | |
» 1942-44 | - | ప్రొవిన్షియల్ అజాద్ హిందూ హుకూమత్ ను సుభాస్ చంద్రబోస్ ఏర్పాటు చేశారు. అజాద్ హింద్ ఫౌజ్ ను కూడా బోస్ ఏర్పాటు చేశారు. బెంగాల్ లో తీవ్రమైన కరవు వచ్చింది. | |
» 1945 | - | వేవెల్ ప్రణాళిక; సిమ్లా సమావేశం; ఇండియన్ నేషనల్ ఆర్మీ విచారణ, సిమ్లా సమావేశం, రెండో ప్రపంచ యుద్ధం ముగింపు. | |
» 1946 | - | క్యాబినెట్ మిషన్ భారత్ సందర్శన, కేంద్రంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు. | |
» 1947 | - | అఖండ భారత్ విభజన. రెండు దేశాలుగా భారత్, పాకిస్థాన్ ఆవిర్భావం. | |
» 1948 | - | గాంధీజీ హత్య (జనవరి 30), దేశవ్యాప్తంగా సంస్థానాల విలీనం. | |
» 1949 | - | కశ్మీర్ లో శాంతిస్థాపనకు అంగీకారం, భారత రాజ్యాంగానికి ఆమోదం (నవంబరు 26) | |
» 1950 | - | గణతంత్ర రాజ్యంగా భారత్ ఆవిర్భావం (జనవరి 26న), భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. | |
» 1951 | - | మొదటి పంచవర్ష ప్రణాళిక. ఢిల్లీలో మొదటి ఆసియా క్రీడల నిర్వహణ. | |
» 1952 | - | లోక్ సభకు మొదటి సాధారణ ఎన్నికల నిర్వహణ. | |
» 1956 | - | రెండో పంచ వర్ష ప్రణాళిక ప్రారంభం. | |
» 1957 | - | దేశ వ్యాప్తంగా రెండో సాధారణ ఎన్నికల నిర్వహణ, గోవా విముక్తి | |
» 1963 | - | పదహారో రాష్ట్రంగా నాగాలాండ్ ఆవిర్భావం. |
లాల్ బహదూర్ శాస్త్రి
|
» 1964 | - | జవహర్ లాల్ నెహ్రూ మరణం; ప్రధానిగా లాల్ బహదూర్ శాస్త్రి. | |
» 1965 | - | భారత్ పై పాకిస్థాన్ దాడి | |
» 1966 | - | తాష్కెంట్ ఒప్పందం, లాల్ బహదూర్ శాస్త్రి మరణం, భారత ప్రధానిగా ఇందిరాగాంధీ. |
ఇందిరా గాంధీ
|
» 1967 | - | నాలుగో సాధారణ ఎన్నికలు. మూడో రాష్ట్రపతిగా డాక్టర్ జాకీర్ హుస్సేన్ ఎన్నిక. | |
» 1969 | - | భారత రాష్ట్రపతిగా వి.వి. గిరి ఎన్నిక, బ్యాంకుల జాతీయీకరణ. | |
» 1970 | - | రాష్ట్రంగా మేఘాలయ | |
» 1971 | - | కొత్త రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్, భారత్ – పాక్ యుద్ధం, కొత్త దేశంగా బంగ్లాదేశ్. | |
» 1972 | - | సిమ్లా ఒప్పందం; సి. రాజగోపాలాచారి మరణం. | |
» 1973 | - | మైసూర్ రాష్ట్రానికి కర్ణాటకగా పేరు మార్పు. | |
» 1974 | - | భారత్ లో అణ్వస్త్ర ప్రయోగం, అయిదో రాష్ట్రపతిగా ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. | |
» 1975 | - | ఆర్యభట్ట ఉపగ్రహ ప్రయోగం, 22వ రాష్ట్రంగా సిక్కిం. ఎమర్జెన్సీ ప్రకటన. | |
» 1976 | - | భారత్ – చైనా మధ్య దౌత్య సంబంధాలు. | |
» 1977 | - | ఆరో సాధారణ ఎన్నికలు, లోక్ సభలో జనతా పార్టీ ఆధిక్యం, ఆరో రాష్ట్రపతిగా నీలం సంజీవరెడ్డి. | |
» 1979 | - | ప్రధాని పదవికి మొరార్జీ దేశాయ్ రాజీనామా, ప్రధాన మంత్రిగా చరణ్ సింగ్, ఆగస్టు 20న చరణ్ సింగ్ రాజీనామా, ఆరో లోక్ సభ రద్దు. | |
» 1980 | - | ఏడో సాధారణ ఎన్నికలు; అధికారంలోకి కాంగ్రెస్ (ఐ), ప్రధాన మంత్రిగా ఇందిరాగాంధీ; విమాన ప్రమాదంలో సంజయ్ గాంధీ మరణం; ఎస్ ఎల్ వి – 3 ద్వారా రోహిణి ఉపగ్రహ ప్రయోగం. | |
» 1982 | - | మార్చి 19న ఆచార్య జె.బి. కృపలానీ మరణం; ఇన్ శాట్ – 1ఏ ప్రయోగం; జులై 15న రాష్ట్రపతిగా జైల్ సింగ్; నవంబరు 5న గుజరాత్ లో తుపాను వల్ల 500 మంది మరణం; నవంబరు 15న ఆచార్య వినోబా మరణం; నవంబరు 19న తొమ్మిదో ఆసియా క్రీడలు ప్రారంభం. | |
» 1983 | - | ఢిల్లీలో చోగమ్ సదస్సు | |
» 1984 | - | పంజాబ్ లో ఆపరేషన్ బ్లూస్టార్; అంతరిక్షంలోకి రాకేశ్ శర్మ; ఇందిరాగాంధీ హత్య, ప్రధానిగా రాజీవ్ గాంధీ. |
రాజీవ్ గాంధీ
|
» 1985 | - | రాజీవ్ – లోంగోవాలా సంధి; అసోం ఒప్పందం; ఏడో పంచ వర్ష ప్రణాళిక; పార్టీ ఫిరాయింపుల చట్టం. | |
» 1986 | - | మిజోరాం ఒప్పందం | |
» 1987 | - | రాష్ట్రపతిగా ఆర్.వెంకట్రామన్, ఉప రాష్ట్రపతిగా శంకర్ దయాళ్ శర్మ, బోఫోర్స్ గన్, ఫెయిర్ ఫాక్స్ వివాదాలు. | |
» 1989 | - | అయోధ్యలో రామ శిలాన్యాస పూజ; మొదటి సారిగా భారత్ ఐఆర్ బిఎమ్ ‘అగ్ని’ ని ఒడిశా నుంచి విజయవంతంగా ప్రయోగించారు (మార్చి 22). జూన్ 5న త్రిశూల్ క్షిపణి ప్రయోగం, సెప్టెంబరు 27న పృథ్వి రెండోసారి ప్రయోగం విజయవంతం; నవంబరు 29న ఎన్నికల్లో ఓడిపోయిన రాజీవ్ గాంధీ ప్రభుత్వం నుంచి తప్పుకున్నారు; జవహర్ రోజ్ గార్ యోజన ప్రారంభం; నేషనల్ ఫ్రంట్ నాయకుడు వి.పి. సింగ్ ఏడో ప్రధానిగా ఎన్నిక. | |
» 1990 | - | వెనక్కి వచ్చిన భారత శాంతి దళం; ఇండియన్ ఎయిర్ లైన్స్ కి చెందిన ఎ-320 ప్రమాదం; జనతా దళ్ విభజన; ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న బీజేపీ; అద్వాణీ రథయాత్ర-అరెస్టు; మండల్ కమిటీ నివేదిక అమలును ప్రకటించిన వి.పి.సింగ్; రామ జన్మభూమి బాబ్రీ మసీదు వివాదం నేపథ్యంలో అయోధ్యలో హింసాకాండ. | |
» 1991 | - | జనవరి 17న గల్ఫ్ యుద్ధం; మే 21న రాజీవ్ గాంధీ హత్య; జూన్ 20న పదో లోక్ సభ ఏర్పాటు; ప్రధాన మంత్రిగా పీవీ నరసింహారావు. |
పీవీ నరసింహారావు
|
» 1992 | - | ఇజ్రాయిల్ తో దౌత్య సంబంధాల ఏర్పాటు; ఏప్రిల్ 23న భారతరత్న, ఆస్కార్ అవార్డు గ్రహీత సత్యజిత్ రే మరణం; జులై 25న రాష్ట్రపతిగా శంకర్ దయాళ్ శర్మ ఎన్నిక; ఫిబ్రవరి 7న మొదటి సారిగా భారత్ స్వదేశీయంగా తయారు చేసిన ఐఎన్ ఎస్ శక్తి సబ్ మెరైన్ ప్రారంభం. | |
» 1993 | - | జనవరి 29న అయోధ్యలో 67.33 ఎకరాల స్వాధీనానికి ఆర్డినెన్స్; ముంబయిలో వరుస బాంబు పేలుళ్లు – 300 మృతి; మహారాష్ట్ర లో భూ కంపం. | |
» 1994 | - | పౌర విమానయానంపై ఏకస్వామ్యానికి ముగింపు పలికిన ప్రభుత్వం; గ్యాట్ ఒప్పందంపై వివాదాలు; ప్లేగు వ్యాధి వ్యాప్తి; మిస్ యూనివర్స్ గా సుస్మితాసేన్, మిస్ వరల్డ్ గా ఐశ్వర్యరాయ్ | |
» 1995 | - | ఉత్తర ప్రదేశ్ లో మొదటి దళిత ముఖ్యమంత్రిగా మాయావతి; మహారాష్ట్ర, గుజరాత్ లలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు; కర్ణాటకలో జనతా దళ్, ఒడిశాలో కాంగ్రెస్ ప్రభుత్వాల ఏర్పాటు; మాయవతి ప్రభుత్వం పడిపోవడంతో ఉత్తర ప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధింపు; ఇన్ శాట్ 2సి, ఐఆర్ ఎస్1-సి ప్రయోగాలు. | |
» 1996 | - | హవాలా కుంభకోణం; పీఎస్ ఎల్ వీ డీ3 ప్రయోగం; పదకొండో లోక్ సభ ఎన్నికలు; అతి పెద్ద పార్టీగా బీజేపీ. | |
» 1997 | - | భారత దేశపు 50 సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. |
అటల్ బిహారి వాజ్ పేయీ
|
» 1998 | - | మదర్ థెరిసా మరణం; భారత ప్రధానిగా వాజ్ పేయీ; పోఖ్రాన్-2 అణు పరీక్షలు. | |
» 1999 | - | డిసెంబరు 24న భారత విమానం ఐసీ – 814 హైజాక్ చేసి కాందహార్ తీసుకెళ్లిన అఫ్ఘనిస్థాన్ తీవ్రవాదులు; ఆ విమాన ప్రయాణికులు, సిబ్బంది విడుదల కోసం ముగ్గురు మిలిటెంట్లను భారత ప్రభుత్వం జూన్ లో జైలు నుంచి విడుదల చేసింది; పాకిస్థాన్ అక్రమ నిర్బంధం నుంచి ఎనిమిది రోజుల తర్వాత ఫ్లైట్ లెఫ్ట్ నెంట్ నచికేత విడుదల; పాకిస్థాన్ దురాక్రమణలను నిరోధించడానికి కార్గిల్ యుద్ధం, ఆపరేషన్ విజయ్ తో విజయం సాధించిన ఇండియన్ ఆర్మీ. | |
» 2000 | - | అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారత్ పర్యటన; చత్తీస్ గఢ్, ఉత్తరాఖండ్, ఝార్ఖండ్ రాష్ట్రాల ఆవిర్భావం; 100 కోట్లు దాటిన భారత్ జనాభా. | |
» 2001 | - | జులైలో భారత్- పాకిస్థాన్ ల మధ్య ఆగ్రా సదస్సు; జనవరిలో గుజరాత్ భూకంపం; మార్చిలో ఆయుధాల ఒప్పందంలో ఆర్మీ ఆఫీసర్లు, మంత్రుల అక్రమాలను బయటపెట్టిన తెహల్కా; స్వాతంత్ర్యానంతరం ఆరో జనాభా లెక్కలు. | |
» 2002 | - | అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఎన్నిక. ఫిబ్రవరి 27న గుజరాత్ లోని గోద్రా లో మత కలహాలు; నేషనల్ వాటర్ పాలసీ ప్రకటన. |
అబ్దుల్ కలాం
|
» 2003 | - | ఇన్ శాట్ – 3ఏ ప్రయోగం విజయవంతం; వైట్ కాలర్ నేరాలను అరికట్టడానికి ఆర్థిక ఇంటెలిజెన్స్ విభాగాన్ని సీబీఐ ఏర్పాటు చేసింది; ఇన్ శాట్ -3ఇ ప్రయోగం సఫలం. | |
» 2004 | - | సాధారణ ఎన్నికల్లో ఎన్ డీఏ పరాజయం; మన్మోహన్ సింగ్ ప్రధానిగా ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్. |
ముఖ్యమైన ఆపరేషన్లు
ఆపరేషన్ పేరు | ఆపరేషన్ ఉద్దేశం |
» రెయిన్ బో ఈస్ట్ | 2004 డిసెంబరు 26న వచ్చిన సునామీ బాధితుల సాయం కోసం మనదేశ నౌకాదళం, శ్రీలంక చేపట్టిన కార్యక్రమం. |
» ఆపరేషన్ పవన్ | శ్రీలంలోని భారత శాంతి స్థాపక దళ కార్యక్రమాలు |
» ఆపరేషన్ రెడ్ డాన్ | ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ ను పట్టుకోడానికి అమెరికా సైన్యం చేపట్టింది. |
» ఆపరేషన్ ఓవర్ లోడ్ | ఫ్రాన్స్ ను నాజీల నుంచి విముక్తం చేయడానికి అమెరికా చేపట్టిన సైనికచర్య. |
» ఆపరేషన్ ఈగల్ | శ్రీలంకలోని తమిళులకు ఆహార పదార్థాలు, వైద్య సదుపాయాలు, ఇతర సౌకర్యాలు కల్పించడానికి భారత శాంతిస్థాపక దళం చేపట్టిన కార్యక్రమం. |
» ఆపరేషన్ లీప్ ఫార్వర్డ్ | ఎల్.టి.టి.ఇ (లిబరేషన్ ఆఫ్ తమిళ ఈలం) స్థావరాలను ధ్వంసం చేయడానికి శ్రీలంక సైన్యం, వైమానిక, నౌకాదళాలు సంయుక్తంగా చేపట్టిన కార్యక్రమం. |
» ఆపరేషన్ ఆల్ క్లియర్ | భూటాన్ లోని భారత వ్యతిరేక శక్తులైన ఉల్ఫా, కమటాపూర్ లిబరేషన్ ఆర్గనైజేషన్, నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ ల కోసం చేపట్టిన చర్య. |
» ఆపరేషన్ తొపక్ | మన దేశ యువకులకు అక్రమంగా సైనిక శిక్షణ ఇచ్చి మన దేశంలో అలజడులు సృష్టించడానికి పాకిస్థాన్ అధ్యక్షుడు 1988 లో ఏర్పాటు చేసింది. |
» ఆపరేషన్ ఎండ్యూరింగ్ ఫ్రీడమ్ | అల్ ఖైదా ఉగ్రవాద సంస్థను అరికట్టడానికి అమెరికా చేపట్టిన సైనిక చర్య. |
» ఆపరేషన్ సన్ షైన్ | 1995లో ఎల్.టి.టి.ఈ స్థావరమైన జాఫ్నాపై శ్రీలంక సైన్యం చేపట్టిన చర్య. |
» ఆపరేషన్ చెక్ మేట్ | ఎల్.టి.టి.ఈ కి వ్యతిరేకంగా భారత శాంతిదళాలు తీసుకున్న చర్యలు. |
» ఆపరేషన్ డిజర్ట్ ఫాక్స్ | ఇరాక్ పై దాడికి అమెరికా వైమానిక దళం చేపట్టిన చర్య. |
» ఆపరేషన్ స్యార్ యర్ | ఇరాక్ లోని ఉగ్రవాదులను నాశనం చేయడానికి అమెరికా వైమానిక దళం 2006 లో చేపట్టిన దాడులు. |
» ఆపరేషన్ రెస్టోర్ హోష్ | సోమాలియాలో కరవు నివారణ కోసం యూఎన్ వో చేపట్టిన చర్యలు. |
» ఆపరేషన్ సైలెన్స్ | లాల్ మసీదులోని తీవ్ర వాదులను, మత ఛాందసులను నిరోధించడానికి పాకిస్థాన్ సైన్యం చేసిన కార్యక్రమం |
» ఆపరేషన్ పుష్ బాల్ | బంగ్లాదేశ్ నుంచి భారత దేశంలోకి వలస వచ్చిన వారిని వెనక్కి పంపే కార్యక్రమం |
» ఆపరేషన్ ఖఖరి | రివల్యూషనరీ యునైటెడ్ ఫ్రంట్ కు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి చేపట్టిన చర్య ఇది. సియెర్రాలియోన్ లో జరిగింది. 222 మంది భారత సైనికులను విడిపించడానికి ఈ చర్య చేపట్టారు. |
» ఆపరేషన్ డెవలప్ మెంట్ ఎఫర్ట్ | బంగ్లాదేశ్ లోని తుపాను బాధితుల కోసం చేపట్టిన ఆపరేషన్ ఇది. అమెరికా నావికా దళాలు దీన్ని నిర్వహించాయి. |
» ఆపరేషన్ ఎర్త్ క్వేక్ | ఎల్ టీటీఈ తీవ్రవాదులను నాశనం చేయడానికి శ్రీలంక సైన్యం ఈ చర్యను చేపట్టింది. |
» ఆపరేషన్ జాయింట్ ఎండీవర్ | నాటో ఆధ్వర్యంలో శాంతి స్థాపన కోసం బోస్నియాలో జరిగిన కార్యక్రమం. |
» ఆపరేషన్ అనకొండ | తోరాబోరా గుహల్లో దాక్కొని ఉన్న అల్ ఖైదా తీవ్రవాదులను చంపడానికి అమెరికా ఈ ఆపరేషన్ నిర్వహించింది. |
» ఆపరేషన్ ఒడిస్సీడాన్ | అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా తదితర దేశాల సైన్యంతో కూడిన అంతర్జాతీయ దళాలు లిబియాపై చేపట్టిన చర్య. |
» ఆపరేషన్ జరోనిమా | అల్ ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్ ను చంపడానికి అమెరికా సైన్యాలు చేపట్టిన కార్యక్రమం. |
» ఆపరేషన్ ఖంజర్ | తాలిబన్ ల ఏరివేతకు అమెరికా సైన్యం, అప్ఘానిస్థాన్ సైన్యం సంయుక్తంగా చేపట్టిన చర్య. |
జాతీయ స్థాయిలో చేపట్టిన కొన్ని ముఖ్యమైన ఆపరేషన్లు | |
» ఆపరేషన్ విజయ్ | 1999 మే 14న కార్గిల్ లో అక్రమంగా చొరబడిన వారిని నిరోధించడానికి భారత సైన్యం చేపట్టిన చర్య. |
» ఆపరేషన్ టోర్నడో | ముంబయిలో తీవ్రవాదుల దాడి జరిగినప్పుడు నారీమన్ హోటల్లో చిక్కుకున్న బందీలను విడిపించడానికి సైన్యం నిర్వహించిన చర్య. |
» ఆపరేషన్ బ్లూ స్టార్ | అమృతసర్ లోని స్వర్ణదేవాలంలో ఉన్న తీవ్రవాదులను చంపడానికి 1984లో భారత సైన్యం చేపట్టిన చర్య ఇది. |
» ఆపరేషన్ సైక్లోన్ | ముంబయి నగరంపై 2009 సంవత్సరం నవంబరు 26న జరిగిన దాడిలో తాజ్ హోటల్ లో దాక్కున ఉగ్రవాదులను నాశనం చేయడానికి నిర్వహించిన కార్యక్రమం. |
» ఆపరేషన్ కోబ్రా | జమ్మూ-కశ్మీర్ లో తీవ్రవాదుల ప్రాబల్య నిరోధానికి చేపట్టిన చర్య. |
» ఆపరేషన్ పరాక్రమ్ | భారత పార్లమెంటుపై 2001లో దాడి జరిగినప్పుడు తలెత్తిన అవాంఛనీయ పరిస్థితులు, ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్ సరిహద్దులోకి సైన్యాన్ని తరలించే చర్య. |
» ఆపరేషన్ గుడ్ విల్ | జమ్మూ-కశ్మీర్ లోని ప్రజల విశ్వాసాన్ని సంపాదించడానికి భారత సైన్యం చేపట్టిన కార్యక్రమం. |
» ఆపరేషన్ సెర్చ్ | ప్రత్యేక ఖలిస్థాన్ దేశం కోసం స్వర్ణదేవాలయం కేంద్రంగా పోరాడుతున్న ఖలిస్థాన్ తీవ్రవాదులను నిరోధించడానికి భారత సైన్యం చేసిన చర్య. |
» ఆపరేషన్ కూంబింగ్ -1 | పంజాబ్ లో తీవ్రవాదుల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో వారిని నిరోధించడానికి చేపట్టిన చర్య. |
» ఆపరేషన్ ఉడ్ రోజ్ | 1984లో పంజాబ్ లో తీవ్రవాదుల ఏరివేత చర్య |
» ఆపరేషన్ షాప్ | 1984లో స్వర్ణ దేవాలం మినహా మిగతా గురుద్వారాలలో చేపట్టిన చర్య. |
» ఆపరేషన్ బ్లాక్ థండర్ | 1988లో స్వర్ణ దేవాలయం నుంచి తీవ్రవాదుల ఏరివేత. |
» ఆపరేషన్ రక్షక్ 1, 2 | పంజాబ్ లో తీవ్రవాదుల అరాచకాలకు అడ్డుకట్ట వేసి, అక్కడ ప్రశాంత ఎన్నికల నిర్వహణ కోసం చేపట్టిన చర్య. |
» ఆపరేషన్ నైట్ డామినెన్స్ | పంజాబ్ లో రాత్రి వేళల్లో గ్రామాల్లో నిర్వహిస్తున్న ఉగ్రవాద కార్యకలాపాలను నిరోధించడం. |
» ఆపరేషన్ ఫైనల్ ఎసాల్ట్ | పంజాబ్ లో ఉగ్రవాద అణచివేత చర్యలు. |
» ఆపరేషన్ విన్ ఓవర్ | పంజాబ్ లో ప్రజల అభిమానాన్ని పొందడానికి సైన్యం చేపట్టిన కార్యక్రమం. |
» ఆపరేషన్ హంట్ డౌన్ | సరిహద్దు భద్రతా దళం, కశ్మీర్ లోని పోలీసులతో కలిసి కశ్మీర్ లోని ఉగ్రవాదులను ఏరివేయడానికి చేపట్టిన ఆపరేషన్. |
» ఆపరేషన్ టైగర్ | జమ్మూ-కశ్మీర్ లో ఉగ్రవాద నిరోధానికి చేపట్టిన చర్య. |
» ఆపరేషన్ ఫాక్స్ | జమ్మూ – కశ్మీర్ లో ఉగ్రవాదాన్ని అణచి వేయడానికి నిర్వహించిన కార్యక్రమం ఇది. |
» ఆపరేషన్ విక్రమ్ | ఉగ్రవాదుల నిర్మూలనకు, శాంతి స్థాపనకు జమ్మూ-కశ్మీర్ లో నిర్వహించిన సైనిక చర్య. |
» ఆపరేషన్ క్రాంతి | అసోమ్ లో చెలరేగిన తీవ్రవాదులను నిర్మూలించి ప్రజలకు రక్షణ కల్పించడానికి భారత సైన్యం ఈ చర్య చేపట్టింది. |
» ఆపరేషన్ భజరంగ్ | 1980లో అసోమ్ లో ఉల్ఫా తీవ్రవాదుల ఏరివేతకు సైన్యం చేపట్టిన చర్య ఇది. ఇది విఫలమైంది. |
» ఆపరేషన్ రైనో | ఆపరేషన్ భజరంగ్ విఫలం కావడంతో అసోమ్ తీవ్రవాదలను అణచివేయడానికి చేపట్టిన చర్య. |
» ఆపరేషన్ క్లౌడ్ బరస్ట్ | ఇది కూడా అసోమ్ లోని తీవ్రవాదుల నిర్మూలన కోసం చేపట్టిందే. |
» ఆపరేషన్ బ్లూ ప్రింట్ | ఉల్ఫా తీవ్రవాదులు అసోమ్ లో చేస్తున్న కార్యకలాపాలను వెలుగులోకి తీసుకురావడానికి చేపట్టిన చర్య. |
» ఆపరేషన్ సహయోగ్ | అసోంలో ప్రజల అభిమానాన్ని సంపాదించడం కోసం భారత సైన్యం నిర్వహించిన కార్యక్రమం. |
» ఆపరేషన్ అగ్ని | ఉత్తర ప్రదేశ్ లోని తెరాయ్ ప్రాంతంలోని తీవ్రవాదుల ఏరివేతకు చేపట్టిన చర్య. |
» ఆపరేషన్ సైకో | హజ్రత్ మహల్ మసీదులో దాక్కున్న తీవ్రవాదులకు ఆహార పదార్థాలు అందకుండా అడ్డుకుంటూ వారిపై ఒత్తిడి పెంచడానికి చేపట్టిన సైనిక చర్య. |
» ఆపరేషన్ పోలో | 1948లో హైదరాబాద్ సంస్థానం స్వాధీనానికి భారత ప్రభుత్వం చేపట్టిన పోలీసు చర్య. |
» ఆపరేషన్ లోటస్ | బోఫోర్స్ కుంభకోణంలోని రహస్యాలను ఛేదించడానికి చేపట్టిన పోలీసు కార్యక్రమం. |
» ఆపరేషన్ శాండల్ ఫాక్స్ | గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ ను పట్టుకోడానికి చేపట్టిన పోలీసు చర్య ఇది. |
» ఆపరేషన్ మిడ్ నైట్ | సెంట్రల్ రిజర్వ్ పోలీసు, పంజాబ్ పోలీసులు 1987లో స్వర్ణ దేవాలయం పరిసర ప్రాంతాల్లో ఉన్న తీవ్రవాదులను ఏరివేయడానికి చేపట్టిన కార్యక్రమం. |
» ఆపరేషన్ కోకూన్ | గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ ను బంధించడానికి తమిళనాడు స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నిర్వహించిన చర్య. |
» ఆపరేషన్ ధన్వంతరి | దొంగ మందులను తయారు చేస్తున్న 4 పరిశ్రమలను గుర్తించి వాటిని నాశనం చేయడానికి బిహార్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం. |
» ఆపరేషన్ త్రీ స్టార్ | పార్లమెంట్ పై దాడి జరిగిన కేసులో ప్రధాన నిందితుడు అఫ్జల్ గురును ఉరి తీయడానికి చేపట్టిన చర్య. |
» ఆపరేషన్ ఎక్స్ | ముంబయిలో తీవ్రవాదుల దాడి కేసులో పట్టుబడిన అజ్మల్ కసబ్ ను పుణేలోని ఎరవాడ జైల్లో రహస్యంగా ఉరి తీసిన చర్య. |
ఇతర ముఖ్యమైన ఆపరేషన్లు | |
» ఆపరేషన్ తోడర్ మల్ | బిహార్ లో భూ సంస్కరణలను వేగంగా, నిష్పాక్షికంగా నిర్వహించడానికి చేపట్టిన కార్యక్రమం. |
» ఆపరేషన్ గ్రీన్ గోల్డ్ | వెదురు ఉత్పత్తులను పెంచడానికి చేపట్టిన చర్య. |
» ఆపరేసన్ బ్లూ రెమ్యూషన్ | చేపల ఉత్పత్తిని పెంచడానికి ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమం. |
» ఆపరేషన్ ఫ్లడ్ | 1970లో భారత దేశంలో పాల ఉత్పత్తిని పెంచడానికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం. |
» ఆపరేషన్ టీ-14 | పెరిగిపోతున్న అవినీతికి వ్యతిరేకంగా 1984లో నిర్వహించిన చర్య. |
» ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ | ప్రాథమిక విద్యను పరిపుష్టం చేయడానికి చేపట్టిన కార్యక్రమం ఇది. దీని ద్వారా ప్రాథమిక పాఠశాలల్లో కనీస వసతులు కల్పించారు. |
» ఆపరేషన్ – 100 | కార్లకు నల్లటి అద్దాలు ఉపయోగించ కూడదనే నిబంధనలతో హైదరాబాద్ పోలీసులు చేపట్టిన కార్యక్రమం ఇది. |
» ఆపరేషన్ సేవా | తీవ్రవాదం భయంతో జమ్మూ-కశ్మీర్ ను విడిచి వెళ్లిన ప్రజలకు సహాయం చేయడానికి ఉద్దేశించిన కార్యక్రమం. |
» ఆపరేషన్ గజ | 2008లో ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో ఏనుగులు సృష్టించిన అలజడిని నిరోధించడానికి అటవీశాఖ చేపట్టిన చర్య ఇది. |
» ఆపరేషన్ ఎక్స్ లెన్స్ | 1990 ఏసియన్ క్రీడల్లో ఉన్నత ప్రతిభా ప్రదర్శన లక్ష్యంగా భారత క్రీడాకారులకు మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు చేపట్టిన కార్యక్రమం. |
» ఆపరేషన్ దుర్యోధన్ | పార్లమెంట్ లో ప్రశ్నలు అడగటానికి పదకొండు మంది ఎంపీలు డబ్బు తీసుకుంటున్న విషయాన్ని ఆజ్ తక్ టీవీ ఛానల్, కోబ్రా పోస్టు న్యూస్ పోర్టల్ సంయుక్తంగా నిర్వహించిన చర్య ఇది. |
» ఆపరేషన్ చక్రవ్యూహ్ | ఎంపీ లాడ్స్ పథకం కింద పనులు చేపట్టేందుకు అక్రమ మార్గాలను ఎంచుకున్న ఎంపీల దురాగతాలను బహిర్గతం చేయడానికి డెడికేటర్ ఇన్వెస్టిగేటివ్ గిల్డ్, స్టార్ న్యూస్ ఉమ్మడిగా చేపట్టిన చర్య. |
ముఖ్యమైన కమిటీలు – కమిషన్లు
కమిటీలు | |||
కమిటీ | అధ్యక్షుడు లేదా చైర్మన్ | కమిటీ ఏర్పాటు ఉద్దేశం | |
» బల్వంత్ రాయ్ మెహతా | బల్వంత్ రాయ్ మెహతా | మూండంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థ |
బల్వంత్ రాయ్ మెహతా
|
» అశోక్ మెహతా కమిటీ | అశోక్ మెహతా | రెండంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థ | |
» సచార్ కమిటీ | జస్టిస్ రాజేందర్ సచార్ | మన దేశంలోని ముస్లిముల ఆర్థిక, సామాజిక, విద్యా ఉపాధి స్థాయులపై అధ్యయనం | |
» రాజమన్నార్ కమిటీ | జస్టిస్ రాజమన్నార్ | కేంద్ర, రాష్ట్ర సంబంధాల పరిశీలన | |
» దినేష్ గోస్వామి కమిటీ | దినేష్ గోస్వామి | ఎన్నికల సంస్కరణలు | |
» ఎల్.పి. గుప్తా కమిటీ | ఎల్.పి. గుప్తా | మూలధన మార్కెట్ పై సూచనలు | |
» నరేశ్ చంద్ర కమిటీ | నరేశ్ చంద్ర | విమానయాన రంగం ప్రైవేటీకరణ, 49 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతించాలని సిఫార్సు | |
» లింగ్డో కమిటీ | జె.ఎం. లింగ్డో | విద్యార్థి సంఘ ఎన్నికల సక్రమ నిర్వహణకు సూచనలు | |
» జెఠ్మలానీ కమిటీ | జెఠ్మలానీ | జమ్మూ-కశ్మీర్ లో శాంతి స్థాపన |
జెఠ్మలానీ
|
» మాలెగావ్ కమిటీ | వై.హెచ్ మాలెగావ్ | మైక్రోఫైనాన్స్ సంస్థల అధ్యయనం | |
» సయీద్ హమీద్ కమిటీ | సయీద్ హమీద్ | అండమాన్ లో జరావా తెగ అంతరించి పోకుండా సూచనలు | |
» మోహన్ కమిటీ | జస్టిస్ మోహన్ | ప్రభుత్వరంగసంస్థల స్థితిగతుల అధ్యయనం | |
» ఇక్బాల్ అహ్మద్ కమిటీ | ఇక్బాల్ అహ్మద్ | లాభదాయక పదవుల అంశం పరిశీలన | |
» వరదరాజన్ కమిటీ | వరదరాజన్ | తాజ్ మహల్ చుట్టుపక్కల కాలుష్యంపై అధ్యయనం | |
» యశ్ పాల్ కమిటీ | యశ్ పాల్ | ఉన్నత పాఠశాల పాఠ్యపుస్తకాల్లో మత పరమైన అంశాల పరిశీలన | |
» గుప్తా కమిటీ | ఇంద్రజిత్ గుప్తా | రాజకీయ పార్టీల ఎన్నికల వ్యయం, ఫండ్సుపై అధ్యయనం | |
» మషేల్కర్ కమిటీ | ఆర్.ఎ.మషేల్కర్ | మేధో సంపత్తి హక్కుల అధ్యయనం | |
» ఖుస్రో కమిటీ | ఎ.ఎం. ఖుస్రో | వ్యవసాయ రుణాలపై అధ్యయనం | |
» బెనర్జీ కమిటీ | జస్టిస్ ఉమేశ్ చంద్ర బెనర్జీ | గోద్రా రైలు దుర్ఘటన | |
» సుబ్రమణ్యం కమిటీ | సుబ్రమణ్యం | కార్గిల్ యుద్ధానికి దారితీసిన పరిస్థితులపై అధ్యయనం | |
» నరసింహం కమిటీ | నరసింహం | ఆర్థిక రంగ సంస్కరణలు | |
» ఎంపీ లాడ్స్ కమిటీ | వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ | ఎంపీ లాడ్స్ అవకతవకలపై విచారణ |
వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్
|
» ముఖర్జీ కమిటీ | ముఖర్జీ | కుటుంబ నియంత్రణ కార్యక్రమా నికి సంబంధించి అధ్యయనం | |
» మల్హోత్రా కమిటీ | ఆర్.ఎస్ మల్హోత్రా | బీమా రంగంలో సంస్కరణలు | |
» జీవన్ రెడ్డి కమిటీ | జస్టిస్ జీవన్ రెడ్డి | మణిపూర్ లో సాయుధ దళాల ప్రత్యేక హక్కుల చట్టం ఉపసంహరణపై పరిశీలన | |
» కె.జి. షా కమిటీ | కె.జి. షా | గోద్రా దుర్ఘటన అనంతరం రేగిన హింసపై అధ్యయనం. | |
» అశోక్ చందా కమిటీ | అశోక్ చందా | దూరదర్శన్, ఆకాశవాణిలకు స్వయం ప్రతిపత్తి | |
» సోమశేఖర్ కమిటీ | సోమశేఖర్ | ఏలేరు రిజర్వాయర్ భూసేకరణ అవకతవకలపై అధ్యయనం | |
» ఖోస్లా కమిటీ | కె.ఎన్. ఖోస్లా | నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణం | |
» లిబర్ హాన్ కమిటీ | జస్టిస్ లిబర్ హాన్ | బాబ్రీ మసీదు కూల్చివేతపై విచారణ | |
» వాల్మీకి ప్రసాద్ కమిటీ | వాల్మీకి ప్రసాద్ | ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాలకు రిజర్వేషన్లు | |
» జె.ఎఫ్. రబీరే కమిటీ | జె.ఎఫ్. రబీరే | పోలీస్ వ్యవస్థలో సంస్కరణలు | |
» నరసింహం కమిటీ | సతీష్ చంద్ర | యూపీఎస్సీ పరీక్ష పద్ధతిపై సమీక్ష | |
» మోహన్ కందా కమిటీ | మోహన్ కందా | సహకార రంగంలో సంస్కరణలు | |
» రాకేశ్ మోహన్ కమిటీ | రాకేశ్ మోహన్ | మౌలిక సదుపాయాల కల్పన | |
» లక్డావాలా కమిటీ | లక్డావాలా | పేదవారి గుర్తింపునకు ప్రాతిపదికల ఎంపికపై సూచనలు | |
» అబిద్ హుస్సేన్ కమిటీ | అబిద్ హుస్సేన్ | చిన్న తరహా పరిశ్రమల స్థితిగతులపై పరిశీలన | |
» ఉషా థోరట్ కమిటీ | ఉషాథోరట్ | బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల రంగంలో నియంత్రణకు సూచనలు | |
» రంగరాజన్ కమిటీ | డాక్టర్ సి. రంగరాజన్ | జాతీయ భద్రతా బిల్లుపై జాతీయ సలహా మండలి |
డాక్టర్ సి. రంగరాజన్
|
» వై.వి. రెడ్డి కమిటీ | డాక్టర్ వై.వి. రెడ్డి | చిన్న మొత్తాల పొదుపులు, సంస్కరణలు | |
» ప్రత్యూష్ సిన్హా | ప్రత్యూష్ సిన్హా | యాంట్రిక్స్, దేవాస్ ఒప్పందంలో అవకతవకలపై పరిశీలన | |
» చలపతిరావు కమిటీ | చలపతిరావు | ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ప్రైవేటీకరణ | |
» శామ్ పిట్రోడా కమిటీ | శామ్ పిట్రోడా | రైల్వేల నవీనీకరణ |
శామ్ పిట్రోడా
|
» కేల్కర్ కమిటీ | కేల్కర్ | పన్నుల సంస్కరణలు | |
» పి.ఎన్. భగవతీ కమిటీ | పి.ఎన్. భగవతీ | టేకోవర్లపై సెబీ కమిటీ | |
» కె.సి. పంత్ కమిటీ | కె.సి. పంత్ | ఖాదీ, గ్రామీణ పరిశ్రమల బలోపేతంపై సూచనలు | |
» ఎస్.కె. సింగ్ కమిటీ | ఎస్.కె. సింగ్ | ఎఫ్.డి.ఐ.లపై సూచనలు | |
» ప్రకాశమణి త్రిపాఠి కమిటీ | ప్రకాశమణి త్రిపాఠి | యూటీఐ, స్టాక్ మార్కెట్ కుంభ కోణాలపై అధ్యయనం | |
» దీపక్ పరేఖ్ కమిటీ | దీపక్ పరేఖ్ | యు.ఎస్. – 64 స్కీముపై పరిశీలన | |
» కె.పి. గీతాకృష్ణన్ కమిటీ | కె.పి. గీతాకృష్ణన్ | వ్యయ సంస్కరణలు | |
» సి.డి. షెనాయ్ కమిటీ | సి.డి. షెనాయ్ | జాతీయ జెండా నిబంధనలు | |
» జె.ఎం. గిర్ గ్లానీ కమిటీ | జె.ఎం. గిర్ గ్లానీ | సంయుక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల్లో పాటించాల్సిన ఆరు సూత్రాలకు సంబంధించి 610 జీవోపై సూచనలు | |
» రాఘవన్ కమిటీ | రాఘవన్ | విశ్వ విద్యాలయాల్లో, కళాశాల్లో ర్యాగింగ్ అరికట్టడంపై సూచనలు | |
» జానకీ రామన్ కమిటీ | జానకీరామన్ | బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల సెక్యూరిటీ లావాదేవీలపై సమీక్ష | |
» చరణ్ దాస్ మెహతా కమిటీ | చరణ్ దాస్ మెహతా | పార్లమెంటు సభ్యుల జీతభత్యాల పెంపుపై సూచనలు | |
» రంగనాథ్ మిశ్రా కమిటీ | రంగనాథ్ మిశ్రా | మత, భాషా సంబంధమైన మైనార్టీలపై అధ్యయనం | |
» కిరీట్ పారిఖ్ కమిటీ | కిరీట్ పారిఖ్ | పెట్రో ధరల విధానంపై సూచనలు | |
» జె.జె. ఇరానీ కమిటీ | జె.జె. ఇరానీ | కంపెనీ సంస్కరణలు | |
» షుంగ్లూ కమిటీ | షుంగ్లూ | కామన్ వెల్త్ గేమ్స్ ఆర్థిక అవకతవకలపై అధ్యయనం | |
» సి.వి. ఆనందబోస్ కమిటీ | సి.వి. ఆనందబోస్ | పద్మనాభస్వామి సంపద పర్యవేక్షణ | |
» శ్రీకృష్ణ కమిటీ | జస్టిస్ శ్రీకృష్ణ | సంయుక్త ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సంక్షోభ పరిష్కారంపై సూచనలు |
జస్టిస్ శ్రీకృష్ణ
|
» సురేశ్ టెండూల్కర్ కమిటీ | సురేశ్ టెండూల్కర్ | దేశంలో పేదరికం అంచనా | |
» ఎం.బి.ఎన్.రావు కమిటీ | ఎం.బి.ఎన్.రావు | మన దేశంలో తొలిసారి ప్రభుత్వ రంగంలో మహిళల బ్యాంకు ఏర్పాటుపై సూచనలు | |
» జె.ఎస్. వర్మ కమిటీ | జస్టిస్ జె.ఎస్.వర్మ | నిర్భయ చట్టంపై సూచనలు |
జస్టిస్ జె.ఎస్.వర్మ
|
» నిగర్వేకర్ కమిటీ | నిగర్వేకర్ | సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్ష మార్పులు | |
కమిషన్లు | |||
కమిషన్ | అధ్యక్షుడు లేదా ఛైర్మన్ | కమిషన్ ఏర్పాటు ఉద్దేశం | |
» హంటర్ కమిషన్ | హంటర్ | జలియన్ వాలాభాగ్ ఉదంతంపై అధ్యయనం | |
» అన్సారీ కమిషన్ | అన్సారీ | రాజీవ్ గాంధీ హత్యానంత అల్లర్లు | |
» ఎరాడి కమిషన్ | ఎరాడి | రావి, బియాస్ నదీ జలాల పంపిణీ | |
» నానావతి కమిషన్ | జస్టిస్ నానావతి | గుజరాత్ అల్లర్లు |
జస్టిస్ నానావతి
|
» రామచంద్రరాజు కమిషన్ | జస్టిస్ రామచంద్రరాజు | సంయుక్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎస్సీల వర్గీకరణకు సూచనలు | |
» పునర్విభజన కమిషన్ | జస్టిస్ కుల్దీప్ సింగ్ | అసెంబ్లీ, లోక్ సభ నియోజక వర్గాల పునర్విభజన | |
» బరూచా కమిషన్ | బరూచా | సంయుక్త ఆంధ్రప్రదేశ్ లో నక్సలైట్ల అణచివేతపై సూచనలు | |
» జైన్ కమిషన్ | జైన్ | రాజీవ్ గాంధీ హత్యకు దారితీసిన పరిస్థితుల అధ్యయనం | |
» శ్రీకృష్ణ కమిషన్ | జస్టిస్ శ్రీకృష్ణ | ముంబయి అల్లర్లపై పరిశీలన | |
» సర్కారియా కమిషన్ | జస్టిస్ ఆర్.ఎస్. సర్కారియా | కేంద్ర, రాష్ట్ర సంబంధాల పరిశీలన | |
» మండల్ కమిషన్ | జస్టిస్ బి.పి. మండల్ | వెనుకబడిన, మహిళలకు రిజర్వేషన్లు | |
» ఫజల్ అలీ కమిషన్ | జస్టిస్ ఫజల్ అలీ | భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ |
జస్టిస్ ఫజల్ అలీ
|
» కొఠారి కమిషన్ | దౌలత్ సింగ్ కొఠారి | ఉన్నత విద్యా ప్రమాణాలు | |
» పుఖాన్ కమిషన్ | పుఖాన్ | తెహల్కా ఉదంతంపై విచారణ | |
» రాజ్యాంగ సమీక్ష కమిషన్ | ఎం.ఎన్. వెంకటాచలయ్య | మన దేశ రాజ్యంగ సమీక్ష |
Subscribe to:
Posts (Atom)