Sunday, January 4, 2015

అవినీతి నిరోధక స్వచ్ఛంద సంస్థ 'ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్' ప్రపంచ అవినీతి సూచి నివేదికను విడుదల చేసింది.

డిసెంబరు - 3,2014

అవినీతి నిరోధక స్వచ్ఛంద సంస్థ 'ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్' ప్రపంచ అవినీతి సూచి నివేదికను విడుదల చేసింది.        
» ఈ నివేదికలో 175 దేశాలతో కూడిన జాబితాలో భారత్ 38 మార్కులతో 85వ స్థానంలో నిలిచింది. గతేడాది 36 మార్కులతో 94వ స్థానంలో ఉంది.
       

 » అవినీతి అత్యంత తక్కువ ఉన్న దేశంగా డెన్మార్క్ తన అగ్రస్థానాన్ని మరోసారి నిలబెట్టుకుంది. అవినీతిరహిత అంశాలకు సంబంధించి ఆ దేశానికి 92 మార్కులు లభించాయి.
       

 » ఉత్తర కొరియా, సోమాలియా చెరో 8 మార్కులతో చిట్టచివరి (175) స్థానంలో ఉన్నాయి.
        

» చైనా గత ఏడాది 80వ స్థానంలో ఉండగా, ఈ సారి 100వ స్థానానికి పడిపోయింది. పాకిస్థాన్, నేపాల్ 126వ స్థానంలో నిలిచాయి. బంగ్లాదేశ్ 145, శ్రీలంక 85, అఫ్గానిస్థాన్ 172వ స్థానంలో ఉండగా, భూటాన్‌కు 30వ స్థానం లభించింది.


టాప్ టెన్ అవినీతిరహిత దేశాలు: 
డెన్మార్క్ (92 మార్కులు), న్యూజిలాండ్ (91), ఫిన్లాండ్ (89), స్వీడన్(87), నార్వే(86), స్విట్జర్లాండ్ (86), సింగపూర్ (84), నెదర్లాండ్స్ (83), లగ్జెంబర్గ్ (82), కెనడా (81). 


No comments:

Post a Comment