Tuesday, September 30, 2014

మార్స్ కక్ష్యలోకి మంగల్యాన్ ను విజయవంతగా ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించిన భారతీయ రోదసీ విభాగం


Mars Orbiter Missionభారత దేశపు మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్), మంగల్యాన్ 24 సెప్టెంబర్ 2014న అంగాకరక కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించింది. దాని లిక్విడ్ దూర బిందువు మోటార్ (లామ్) 24 నిమిషాల 16 సెకన్లు మండించబడిన తరువాత ఉదయం 07:17:32 గంటల షెడ్యూల్ సమయానికి ప్రవేశించింది.

దీంతో, భారతదేశం, మొదటి ప్రయత్నంలోనే అంగాకరక గ్రహ కక్ష్యలో ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టిన మొట్టమొదటి దేశంగా చరిత్రకెక్కింది.అంతేకాకుండా. అంగాకరక గ్రహం మీద కాలుమోపాలనే తన కలను సాకారం చేసుకునేందుకు ఒక అడుగు ముందుకేసింది. 

ఇస్రో శాస్త్రవేత్తలు చేసిన ఈ ఘనతను, కీలకమైన మార్స్ కక్ష్యాప్రవేశాన్ని తిలకించడానికి బెంగళూరు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ, ఇస్రో కంట్రోల్ రూమ్ నుంచి వీక్షించారు. ఈ మిషన్ విజయవంతమైన తరువాత ఇస్రో శాస్త్రవేత్తల బృందాన్ని భారత ప్రధాని మోడీ అభినందించారు.

ప్రధానితో పాటు కర్ణాటక సీఎం సిద్దరామయ్య, కేంద్ర రైల్వేశాఖమంత్రి సదానంద గౌడ, పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి G M సిద్దేశ్వర, ఇస్రో చైర్మన్ డా. కే.రాధాకృష్ణన్ మరియు సీనియర్ శాస్త్రవేత్త UR రావు తదితరులు ఇస్రో నుంచి మామ్‌ను కక్ష్యలోకి ప్రవేశపెట్టే ప్రక్రియను వీక్షించారు.
Manglayaan

గత సెప్టెంబర్ 22 2014న, ఈ మిషన్ యొక్క ప్రధాన ఇంజిన్ యొక్క కీలకమైన లిక్విడ్ దూర బిందువు మోటార్ (లామ్)ను ఇస్రో విజయవంతంగా పరీక్షించింది.

ఇప్పటివరకు వివిధ దేశాలు 51 మిషన్లను అంగారక కక్ష్యలోకి పంపగా 21 మాత్రమే విజయవంతమయ్యాయి. మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించడంతో భారత్ ప్రపంచవ్యాప్తంగా తన సామర్ధ్యాన్ని నిరూపించుకోగలిగింది.

మంగల్యాన్ ప్రధానంగా, మార్స్ యొక్క భౌతిక లక్షణాలు మరియు వాతావరణ పరిశీలన చేసేందుకు రూపొందించబడిన ఒక సాంకేతిక మిషన్. 5 నవంబర్ 2013న భారతదేశం, ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీహరికోట నుండి ఈ ఉపగ్రహమిషన్ ను ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం ఈ మిషన్ కు సమ్మతించిన తరువాత 15 నెలల్లోనే 450 కోట్లు (74 మిలియన్లు డాలర్లు ) ఖర్చుతో సిద్దం అయ్యింది.

అమెరికా యొక్క మావెన్ కు, భారతదేశం యొక్క మంగల్యాన్ కు పోలిక 

22 సెప్టెంబర్ 2014న భారత్ యొక్క MOM మోటార్ ఇంజిన్ ను పరిక్షించేనాటికి, అమెరికా యొక్క మవెన్ (MAVEN) మార్స్ కక్ష్యలోకి ప్రవేశించింది.

 
MOM (మంగల్యాన్)
MAVEN (మార్స్ అటమోస్ఫెర్ అండ్ వొలటైల్ ఎవల్యూషన్ )
ప్రయత్నాలు
మొదటి ప్రయత్నంలోనే
ఐదవ ప్రయత్నంలో
విలువ
75 మిలియన్ అమెరికన్ డాలర్లు
671 మిలియన్ అమెరికన్ డాలర్లు
లిఫ్ట్ ఆఫ్ సమయంలో బరువు
1350 కిలోగ్రాములు
2250 కిలోగ్రాములు
పెటిలోడ్లు
 5 పెటిలోడ్లు
 7 పెటిలోడ్లు
చేరగలిగే దూరం
మార్స్ కు 377-423 కిలోమీటర్ల దూరం
మార్స్ కు 150 కిలోమీటర్ల దూరం
ముఖ్యుద్దేశం
 ఈ అధ్యయనంలో ప్రధాన దృష్టి అంగారక గ్రహం మీద మీథేన్ ఉనికిని కనుగొనడంలో ఉండనుంది.
అంగారక గ్రహం యొక్క ఉపరితల వాతావరణ అధ్యయనంచేయనుంది. ఇలా ఉపరితల వాతావరణ అధ్యయనం కోసం మాత్రమే రూపొందించబడిన మొట్టమొదటి ఉపగ్రహం.

No comments:

Post a Comment