4 సెప్టెంబర్ 2014న భారత కేంద్ర కేబినెట్, పట్టణప్రాంతాలలో స్వచ్చ భారత్ మిషన్ కు ఆమోదం తెలిపింది.ఈ మిషన్ అక్టోబర్ 2, 2014నుంచి ప్రారంభమై ఐదేళ్ళ పాటు అమలు చేయబడుతుంది.
ఈ మిషన్ దేశంలోని 4041 పైగా చట్టబద్ధమైన పట్టణాల్లో అమలు చేయబడుతుంది మరియు 62009 కోట్లరూపాయల ఖర్చులో 14623 కోట్లరూపాయలు కేంద్ర ప్రభుత్వం భరించనుంది.
ఈ మిషన్ స్వచ్చ భారత్ అభియాన్ లో పట్టణ విభాగంగా ఉండిపట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ ద్వారా అమలు చేయబడనుంది. అయితే, దీని గ్రామీణ విభాగం మాత్రం కేంద్ర తాగునీరు మరియు పారిశుధ్యం మంత్రిత్వశాఖ ద్వారా అమలు చేయబడుతుంది.
మిషన్ యొక్క ప్రధాన అంశాలు

ఈ మిషన్ లో బహిరంగ మల విసర్చజన నిర్మూలన, అపరిశుభ్ర మరుగుదొడ్లను ఫ్లష్ టాయిలెట్లుగా మార్పు, మానవీయ శుద్ధి, మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఉన్నాయి.
ఈ కార్యక్రమంలో అన్ని 4041 చట్టబద్ధమైన పట్టణాల్లోనూ
(i) వ్యక్తిగత గృహ మరుగుదొడ్లు అందించడం;
(ii) సమాజ మరియు ప్రజా మరుగుదొడ్లు; మరియు
(iii) మున్సిపల్ ఘన వ్యర్ధాల నిర్వహణ, భాగాలుగా ఉన్నాయి.
ఇందులో 1.04 కోట్ల కుటుంబాలు కవర్ చేయబడి,
ఇందులో 1.04 కోట్ల కుటుంబాలు కవర్ చేయబడి,
కమ్యూనిటీ మరుగుదొడ్లకు 2.5 లక్షల సీట్లు,
ప్రజా మరుగుదొడ్లకు 2.6 లక్షల సీట్లు మరియు అన్ని పట్టణాలకు
ఘన వ్యర్ధాల నిర్వహణ సౌకర్యం సమకూరుస్తుంది.
మిషన్ యొక్క లక్ష్యం
మిషన్ యొక్క లక్ష్యం
ఇది పారిశుధ్యం మరియు దాని ప్రజారోగ్యం సంబంధాల గురించి పౌరులలో అవగాహన తీసుకురావడం మరియు ఆరోగ్యకరమైన పారిశుధ్యం పద్ధతులను గురించి ప్రజలలో ప్రవర్తనా మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో తలపెట్టబడింది.
ఈ లక్ష్యాలను నెరవేర్చడానికి సిద్దాంతాల రూపకల్పన, అమలు మరియు నిర్వహణ చేయడానికి స్థానిక సంస్థల పటిష్ట పరచాలనీ, మూలధన మరియు కార్యాచరణ వ్యయాలలో ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేసేందుకు సరియైన వాతావరణాన్ని సృష్టించాలనే లక్ష్యంలో పెట్టబడింది.
నేపధ్యం
10 జూలై 2014న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2014-15 కేంద్ర బడ్జెట్ లో స్వచ్చ భారత్ అభియాన్ గురించి ప్రస్తావించారు. కేంద్ర బడ్జెట్ లో త్రాగు నీరు & పారిశుధ్య ప్రణాళికలో భాగంగా స్వచ్చ భారత్ అభియాన్ ను ప్రతిపాదించారు. 2019 కల్లా ప్రతి ఇంటిలోనూ పారిశుధ్యం సౌకర్యం ఉండాలన్ని కూడా ఈ అభియాన్ కవర్ చేస్తుంది.
No comments:
Post a Comment