Tuesday, September 30, 2014

ఎడ్లబండి నుండి అంగారక గ్రహం దాకా: ఇస్రో ప్రయాణం ( Mangalyan History)

24 సెప్టెంబర్ 2014న అంగారక గ్రహ కక్ష్యలో మంగల్యాన్ ను ప్రవేశపెట్టి భారతదేశం చరిత్ర సృష్టించింది. ఈ ఘనత సాదించిన, ఆసియాలో మొదటిదేశంగాను మరియు అమెరికా మరియు మునుపటి సోవియట్ యూనియన్ల తరవాత  ప్రపంచంలోనే మూడవ దేశమైంది. అంతేకాకుండా నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మరియు మునుపటి USSR యొక్క స్పేస్ ఏజెన్సీ తర్వాత నాల్గవ స్పేస్ ఏజెన్సీ గా ఇస్రో గుర్తింపుపొందింది.

Bullock-Cart

మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, భారత దేశం తన తొలి ప్రయత్నంలోనే ఈ ఘనత సాధించమే కాకుండా మిగిలిన దేశాలకన్నా తక్కువ పెట్టుబడి (74 మిలియన్ అమెరికన్ డాలర్లు)తోను మిషన్ పూర్తయ్యేలా ఇస్రో శాస్త్రవేత్తలు కృషి చేశారు. 
1981లో లాంచ్ పాడ్ మీద ప్రయోగించడానికి అరియన్ పాసెంజర్ పేలోడ్ ఎక్స్పరిమెంట్ (APPLE) అనే తన ఉపగ్రహాన్ని ఎడ్లబండి మీద మోసుకెళ్ళిన ఇస్రో లాంటి సంస్థకిది నిజంగా ఘనకార్యమే. అంతేకాకుండా, ఈ ఘనత ఇస్రో స్పేస్ ఏజెన్సీకి, ఒక మైలురాయి అయ్యింది.
19 ఏప్రిల్ 1975లో తన ఆర్యభాట్టా-I ఉపగ్రహాన్ని అప్పటి సోవిఎట్ యూనియన్ యొక్క కోస్మోస్-3M లాంచ్ వెహికల్ ద్వారా అంతరీక్షంలోకి పంపిన ఇస్రో, తన ప్రయాణాన్ని సుదూరం సాగించి, ఉపగ్రహ ప్రయోగానికి వేరే దేశం మీద ఆధారపడే స్థాయి నుంచి సొంత ప్రయోగ పాడ్ (లాంచ్ పాడ్) లను నిర్మించుకుని, తమ సొంత ఉపగ్రహలనే కాకుండా వేరే దేశపు ఉపగ్రహాలను కుడా ప్రయోగించే స్థాయికి చేరింది. ఇస్రో ఇప్పటివరకు 65 ఉపగ్రహాలను ప్రయోగించగా అందులో 30 భారత దేశానివి కాగా 35ఇతర దేశాలవి కావడం విశేషం.
భారత్, అంతరీక్షంలో తన ఉనికి చాటుకున్న 6వ దేశమేకాకుండా రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాల ప్రాంతీయ నాయకులలో ఒకటిగా ఉంది. దాని ఎల్లప్పుడూ ఆధారపడదగిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ (PSLV),ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన ప్రయోగ వాహనాలలో ఒకటిగా అంతర్జాతీయ గుర్తింపు సాధించింది. PSLV ద్వారా ప్రయోగించిన 26 ప్రయోగాలలో 25 ప్రయోగాలు విజయవంతమవడం గుర్తించాల్సిన అవసరం
ఇంకా, 2008 లో ప్రయోగించబడిన  చంద్రయాన్ -I మిషన్ విజయవంతంగా పూర్తిచేయడం కూడా ఇస్రో చరిత్రలో ఒక ప్రధాన మైలురాయి. ఇది భూమి యొక్క సహజ ఉపగ్రహమైన చంద్రుడి మీద జెండాను పాతిన నాలుగు దేశాలలో భారతదేశాన్ని కుడా ఒకటిగా చేసింది.
అమెరికా యొక్క గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జిపిఎస్) మరియు రష్యా యొక్క GLONASS కు సమానమైన IRNSS వ్యవస్థ అభివృద్ధి మరియు భవిష్యత్తులో మనుషులతో కూడిన ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపడం వంటే ఆశయాలతో,  ఎడ్లబండి నుండి అంగారక గ్రహం దాకా సాగుతూ ఉన్న ఇస్రో ప్రయాణం, ప్రతీ భారతీయునికీ గర్వకారణమే!!!!

No comments:

Post a Comment