Tuesday, October 21, 2014

స్వచ్ఛ భారత్‌ గురించి పూర్తి వివరాలు (Swachh Bharat Abhiyan)

పారిశుద్ధ్య పథకం 'స్వచ్ఛ భారత్‌'ను గాంధీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ న్యూఢిల్లీలో ప్రారంభించారు.

ముఖ్యాంశాలు     
 » స్వచ్ఛ భారత్ అమలుకు అయ్యే మొత్తం వ్యయం రూ.62,009 కోట్లు కాగా, కేంద్ర ప్రభుత్వం రూ.14,623 కోట్లను అందజేయనుంది.      
» ఈ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 4,041 పట్టణాల్లో అయిదేళ్లపాటు వివిధ కార్యక్రమాలను చేపట్టనున్నారు.      
» అనారోగ్యం కారణంగా పనిచేయలేక ప్రతి భారతీయుడు ఏటా సగటున రూ.6,500 ను నష్టపోతున్నట్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిందన్నారు.      
» గ్రామీణ ప్రాంతాల పారిశుద్ధ్యానికి సంబంధించి ఇప్పటికే ఉన్న 'నిర్మల్ భారత్ అభియాన్‌'ను స్వచ్ఛ భారత్‌లో కలిపివేయాలని కేంద్ర మంత్రివర్గం ఇటీవల నిర్ణయించింది.      
» ప్రధాని ప్రారంభించిన 'స్వచ్ఛ భారత్' కార్యక్రమం కింద దేశంలోని 2.47 లక్షల గ్రామ పంచాయతీలకు ఏటా రూ.20 లక్షలు చొప్పున అందుతాయి.      
» ఢిల్లీలోని వాల్మీకి బస్తీలో మోదీ స్వయంగా చీపురు పట్టి ఊడ్చారు.      
» ప్రధాని ప్రజలందరితో భారత్‌ను పరిశుభ్రంగా ఉంచుతామని ప్రతిజ్ఞ చేయించారు. బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు.      
» స్వచ్ఛభారత్ ప్రచారానికి ప్రధాని మోదీ తొమ్మిది మంది ప్రముఖులను ఆహ్వానించారు. వీరిలో సచిన్ టెండూల్కర్, శశి థరూర్, అనిల్ అంబానీ, సల్మాన్ ఖాన్, ప్రియాంక చోప్రా, కమల్ హాసన్, బాబా రాందేవ్, గోవా గవర్నర్ మృదులా సిన్హాతోపాటు టీవీ సీరియల్ 'తారక్ మెహ్తా కా ఉల్టా చష్మా' బృందం ఉన్నారు. వీరిలో ప్రతి ఒక్కరూ మరో తొమ్మిది మందిని ఈ ప్రచార కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని ప్రధాని సవాల్ విసిరారు. ఆవిధంగా కొత్తగా వచ్చేవారు తమ వంతు బాధ్యతగా తొమ్మిది మందిని తీసుకురావాలని, ఈ విధంగా ఇది కొనసాగుతూనే ఉండాలని పేర్కొన్నారు.      
» దేశ జనాభా 125 కోట్లలో దాదాపు 72.2% మంది గ్రామాల్లోనే ఉంటున్నారు. మొత్తం గ్రామాల్లోని 16.78 కోట్ల గృహ సముదాయాల్లో కేవలం 5.48 కోట్ల ఇళ్లకే మరుగుదొడ్ల సదుపాయం ఉంది. దీనర్థం 67.3% గ్రామీణ నివాసాల్లో ఇప్పటికీ మరుగుదొడ్లు లేవు. ఇది చాలా బాధాకర విషయం అని, దీని వల్ల ప్రజారోగ్యం క్షీణిస్తుందన్నారు.      
» దేశంలో పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపరచడానికి 1986లోనే కేంద్ర గ్రామీణ పారిశుద్ధ్య పథకం (సీఆర్ఎస్‌పీ) ఆరంభించారు. తర్వాత 1999లో సంపూర్ణ పారిశుద్ధ్య పథకం (టీఎస్‌సీ), నిర్మల్ గ్రామ్ పురస్కార్ పథకం మొదలు పెట్టారు. బహిరంగ విసర్జనను 2017 నాటికి పూర్తిగా మాన్పించాలనేది వీటి లక్ష్యం.      
» భారతదేశంలోనే అత్యంత విజయవంతమైన, అనుసరణీయమైన విధానాలతో స్వచ్ఛభారత్ లక్ష్యాన్ని పశ్చిమబెంగాల్‌లోని మిడ్నపూర్ జిల్లా దశాబ్దం కిందటే సాధించింది. 'సుస్వాగతం... మా గ్రామంలో ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి ఉంది. బహిరంగ మల విసర్జన లేదు' అని సాధికారతతో గ్రామాలకు స్వాగత బోర్డులను ఏర్పాటు చేసుకున్న ఘన చరిత్ర మిడ్నపూర్ జిల్లాది. దాదాపు 50 అభివృద్ధి చెందుతున్న దేశాలకు అక్కడి విధానం ఆదర్శంగా నిలిచింది. వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణ లక్ష్యానికి 1999లో శ్రీకారం చుట్టి 2004 నాటికి సాధించింది.      
» స్వచ్ఛ భారత్ ప్రచారానికి గాంధీజీ కళ్లద్దాలతో వినూత్నమైన లోగోను రూపొందించిన మహారాష్ట్రకు చెందిన అనంత్‌ను ప్రధాని అభినందించారు.      
» 'ఏక్ కదమ్ స్వచ్ఛతా కీ ఓర్' (స్వచ్ఛత వైపు ఒక ముందడుగు) అనే నినాదానికి రూపకల్పన చేసిన గుజరాత్‌కు చెందిన భాగ్యశ్రీకి ప్రధాని అభినందనలు తెలిపారు.

స్మార్ట్ సిటీ గురించి పూర్తి వివరాలు (Full details about the Smart City)

స్మార్ట్ నగరాల ప్రాజెక్ట్‌లో విద్య, వైద్యానికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యతను ఇచ్చింది. ఎంపిక చేసిన నగరాల్లో స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ పూర్తయ్యేలోగా ఆయా విభాగాల్లో ప్రభుత్వం ప్రతిపాదించిన పథకాలను అమలుచేసి, ప్రజలకు విద్య, వైద్యంలో ఇబ్బందులు లేకుండా చూడాలని నిర్ణయించింది.
స్మార్ట్ సిటీ - వైద్యరంగం
 స్మార్ట్ సిటీల్లోని ప్రజల వైద్యానికి సంబంధించి అత్యవసర కేసులను 30 నిమిషాల్లోనే పరిష్కరించాలని భావిస్తోంది. ప్రతి లక్ష జనాభాకు అన్ని ఆసుపత్రుల్లో కలిపి దాదాపు 1210 పడకలు అందుబాటులోకి రానున్నాయి.


 ఇక్కడి పౌరులందరికీ నూరు శాతం టెలి మెడిసిన్ సౌకర్యంతో పాటు, 15 వేల కుటుంబాలకు ఒక డిస్పెన్సరీని ఏర్పాటు చేస్తుంది.
 50 వేల జనాభాకు డయాగ్నస్టిక్ సెంటర్‌తో పాటు, 100 వరకు కుటుంబ సంక్షేమ కేంద్రాల ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది.



స్మార్ట్ సిటీ - విద్యారంగం

 స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్‌లో కీలకమైన ప్రాథమిక, ఉన్నత విద్యకు ప్రాధాన్యం ఇచ్చారు. విద్యలో ప్రమాణాలు మెరుగుపరచడంతో పాటు, అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు కల్పిస్తారు. నగరంలోని ప్రతి 10 లక్షల జనాభాకు ఒక ఇంజినీరింగ్, మెడికల్ కళాశాలను అందుబాటులోకి తీసుకురానుంది. అలాగే ఒక ప్రొఫెషనల్, పారామెడికల్, పశు వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తుంది. ప్రతి 1.25 లక్షల జనాభాకు ఒక కళాశాలను ఏర్పాటు చేయాలని, స్మార్ట్ సిటీకి యూనివర్సిటీ ఉండాలని అభివృద్ధి సూచిక కింద కేంద్రం పేర్కొంది.

స్మార్ట్ సిటీ లక్ష్యాలు:
 2500 కుటుంబాలకు ఒక నర్సరీ పాఠశాల.


 5 వేల కుటుంబాలకు ఒక ప్రాథమిక పాఠశాల (1 నుంచి 5వ తరగతి).
 7500 కుటుంబాలకు ఒక సీనియర్ సెకండరీ పాఠశాల (6 నుంచి 12వ తరగతి).


 ప్రతి లక్ష జనాభాకు సమీకృత పాఠశాల (1 నుంచి 12వ తరగతి).
 45 వేల కుటుంబాలకు ఒక సాధారణ వికలాంగుల పాఠశాల.


 10 లక్షల జనాభాకు మానసిక వికలాంగుల పాఠశాల.

ఎబోలా వైరస్ పూర్తి వివరాలు (Full details of the Ebola virus)

పశ్చిమాఫ్రికాలోని సియెర్రా లియోన్, లైబీరియా, గినియా, నైజీరియా దేశాల్లో ఎబోలా వైరస్ బారినపడి సుమారు 950 మంది మరణించారు.   
»    వైరస్ ప్రబలిన దేశాల్లో వైరస్‌ను అరికట్టేందుకు ప్రపంచ బ్యాంకు, ఆఫ్రికా అభివృద్ధి బ్యాంకు రూ.1500 కోట్ల తక్షణ సాయం ప్రకటించాయి.   
»    వైరస్ బారిన పడిన రిపబ్లిక్ ఆఫ్ గినియా, లైబీరియా, సియెర్రా లియోన్‌కు ఔషధాల కొనుగోలుకు రూ.30 లక్షల చొప్పున సాయాన్ని భారత్ ప్రకటించింది.   
»    వైరస్ ప్రబలిన దేశాల నుంచి వచ్చే ప్రయాణికులందరికీ, విమానాశ్రయాల వద్ద క్షుణ్నంగా వైద్య పరీక్షలు నిర్వహించాలని భారత్ నిర్ణయించింది.  
 »    మనిషికి అత్యంత ప్రమాదకర వైరస్‌లలో ఒకటిగా ఎబోలా వైరస్‌ను పరిగణిస్తారు. మొదటిసారిగా కాంగోలోని ఎబోలా నది సమీపంలో 1976లో ఇది కనిపించింది. అందుకే దీనికి ఎబోలా అని పేరు పెట్టారు. వీటిలో అయిదు రకాలు ఉండగా మూడు చాలా ప్రమాదకరమైనవి. 100 మందికి సోకితే దాదాపు 70 మంది చనిపోతారు. 1979 నుంచి ఇప్పటివరకు 2,200 మందికి సంక్రమించగా 1500 మంది మరణించారు.   
»    ఎబోలా వైరస్ సహజ ఆతిథేయులు గబ్బిలాలు. గబ్బిలాల ద్వారా ఇవి జంతువులకు, జంతువుల ద్వారా మనుషులకు వ్యాప్తి చెందుతాయి.  
 »    రోగి రక్తం, మలమూత్రాలు, చెమట, ఇతర శరీర ద్రవాలు అంటిన సూదులు, కలుషిత మాంసంతో ఇది సంక్రమిస్తుంది. మొదటి దశలో జ్వరం, తలనొప్పి, కీళ్లు, గొంతునొప్పి, బలహీనత, తీవ్ర అలసట వస్తాయి. రెండోదశలో వికారం, వాంతులు, నీళ్ల విరేచనాలు రోగిని ఇబ్బంది పెడతాయి. మూడో దశలో వైరస్ దాడివల్ల కాలేయం, మూత్రపిండాలు విఫలమవుతాయి. శరీరంపై మచ్చలు, బొబ్బలు ఏర్పడతాయి. శరీరంలో అంతర్గత, బహిర్గత రక్తస్రావం మొదలై చివరికి రోగి మరణిస్తాడు. ఈ మూడు దశలు 2 - 21 రోజుల వ్యవధిలో జరిగిపోతాయి. 50 - 90% మంది 10 రోజుల్లోనే మరణిస్తారు.   
»    ఎబోలా వైరస్ మనుషులకే కాకుండా గొరిల్లాలు, చింపాంజీలు, ముళ్లపందులు, దుప్పులుకు కూడా ప్రాణాంతకంగానే పరిణమిస్తోంది.

Tuesday, September 30, 2014

మార్స్ కక్ష్యలోకి మంగల్యాన్ ను విజయవంతగా ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించిన భారతీయ రోదసీ విభాగం


Mars Orbiter Missionభారత దేశపు మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్), మంగల్యాన్ 24 సెప్టెంబర్ 2014న అంగాకరక కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించింది. దాని లిక్విడ్ దూర బిందువు మోటార్ (లామ్) 24 నిమిషాల 16 సెకన్లు మండించబడిన తరువాత ఉదయం 07:17:32 గంటల షెడ్యూల్ సమయానికి ప్రవేశించింది.

దీంతో, భారతదేశం, మొదటి ప్రయత్నంలోనే అంగాకరక గ్రహ కక్ష్యలో ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టిన మొట్టమొదటి దేశంగా చరిత్రకెక్కింది.అంతేకాకుండా. అంగాకరక గ్రహం మీద కాలుమోపాలనే తన కలను సాకారం చేసుకునేందుకు ఒక అడుగు ముందుకేసింది. 

ఇస్రో శాస్త్రవేత్తలు చేసిన ఈ ఘనతను, కీలకమైన మార్స్ కక్ష్యాప్రవేశాన్ని తిలకించడానికి బెంగళూరు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ, ఇస్రో కంట్రోల్ రూమ్ నుంచి వీక్షించారు. ఈ మిషన్ విజయవంతమైన తరువాత ఇస్రో శాస్త్రవేత్తల బృందాన్ని భారత ప్రధాని మోడీ అభినందించారు.

ప్రధానితో పాటు కర్ణాటక సీఎం సిద్దరామయ్య, కేంద్ర రైల్వేశాఖమంత్రి సదానంద గౌడ, పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి G M సిద్దేశ్వర, ఇస్రో చైర్మన్ డా. కే.రాధాకృష్ణన్ మరియు సీనియర్ శాస్త్రవేత్త UR రావు తదితరులు ఇస్రో నుంచి మామ్‌ను కక్ష్యలోకి ప్రవేశపెట్టే ప్రక్రియను వీక్షించారు.
Manglayaan

గత సెప్టెంబర్ 22 2014న, ఈ మిషన్ యొక్క ప్రధాన ఇంజిన్ యొక్క కీలకమైన లిక్విడ్ దూర బిందువు మోటార్ (లామ్)ను ఇస్రో విజయవంతంగా పరీక్షించింది.

ఇప్పటివరకు వివిధ దేశాలు 51 మిషన్లను అంగారక కక్ష్యలోకి పంపగా 21 మాత్రమే విజయవంతమయ్యాయి. మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించడంతో భారత్ ప్రపంచవ్యాప్తంగా తన సామర్ధ్యాన్ని నిరూపించుకోగలిగింది.

మంగల్యాన్ ప్రధానంగా, మార్స్ యొక్క భౌతిక లక్షణాలు మరియు వాతావరణ పరిశీలన చేసేందుకు రూపొందించబడిన ఒక సాంకేతిక మిషన్. 5 నవంబర్ 2013న భారతదేశం, ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీహరికోట నుండి ఈ ఉపగ్రహమిషన్ ను ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం ఈ మిషన్ కు సమ్మతించిన తరువాత 15 నెలల్లోనే 450 కోట్లు (74 మిలియన్లు డాలర్లు ) ఖర్చుతో సిద్దం అయ్యింది.

అమెరికా యొక్క మావెన్ కు, భారతదేశం యొక్క మంగల్యాన్ కు పోలిక 

22 సెప్టెంబర్ 2014న భారత్ యొక్క MOM మోటార్ ఇంజిన్ ను పరిక్షించేనాటికి, అమెరికా యొక్క మవెన్ (MAVEN) మార్స్ కక్ష్యలోకి ప్రవేశించింది.

 
MOM (మంగల్యాన్)
MAVEN (మార్స్ అటమోస్ఫెర్ అండ్ వొలటైల్ ఎవల్యూషన్ )
ప్రయత్నాలు
మొదటి ప్రయత్నంలోనే
ఐదవ ప్రయత్నంలో
విలువ
75 మిలియన్ అమెరికన్ డాలర్లు
671 మిలియన్ అమెరికన్ డాలర్లు
లిఫ్ట్ ఆఫ్ సమయంలో బరువు
1350 కిలోగ్రాములు
2250 కిలోగ్రాములు
పెటిలోడ్లు
 5 పెటిలోడ్లు
 7 పెటిలోడ్లు
చేరగలిగే దూరం
మార్స్ కు 377-423 కిలోమీటర్ల దూరం
మార్స్ కు 150 కిలోమీటర్ల దూరం
ముఖ్యుద్దేశం
 ఈ అధ్యయనంలో ప్రధాన దృష్టి అంగారక గ్రహం మీద మీథేన్ ఉనికిని కనుగొనడంలో ఉండనుంది.
అంగారక గ్రహం యొక్క ఉపరితల వాతావరణ అధ్యయనంచేయనుంది. ఇలా ఉపరితల వాతావరణ అధ్యయనం కోసం మాత్రమే రూపొందించబడిన మొట్టమొదటి ఉపగ్రహం.

ధూల్ పూదో పర్ నవలకు 2013 సరస్వతీ సమ్మాన్ అందుకున్న గోవింద్ మిశ్రా

ప్రముఖ హిందీ రచయిత గోవింద్ మిశ్రాకు  2013 సంవత్సరానికిగాను సరస్వతీ సమ్మాన్ పురస్కారాన్ని 23 సెప్టెంబర్ 2014న అందుకున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ ఈ పురస్కారం అందజేశారు. 2008లో, ఆయన రచించిన ధూల్ పూదో పర్ అనే నవల, ఈ పురస్కారానికి ఎంపికైంది.
ఈ పురస్కారానికి ఎంపికవడం ద్వారా, హరివంశ్ రాయ్ బచ్చన్ తర్వాత ఈ పురస్కారానికి ఎంపికైన రెండో హిందీ రచయితగా గోవింద్ మిశ్రా ఘనతను సాధించారు. 1991లో ఈ పురస్కారాన్ని గెల్చుకున్న తొలి హిందీ రచయితగా హరివంశ్ రాయ్ బచ్చన్ కీర్తిని గడించారు.
ధూల్ పూదో పర్ నవల గురించి
ఈ నవల ఆధునిక భారతీయ మహిళలు పోరాటం వివరిస్తుంది మరియు రియాలిటీ మరియు శృంగారం, ఒక కళాత్మక మిశ్రమంగా ఉంటుంది. ఇది ఆధునిక కాలంలో భారతీయ మహిళల స్థితిగతులు యొక్క వాస్తవిక పాత్ర కోసమే కాక ఒక ప్రేమ కథగా చదవగల ఒక నవల.  
మిశ్రా ప్రచురించిన వాటిలో
• 11 నవలలు
• 100 కధలతో 14 చిన్న కదా సంపుటిలు
• ఐదు ట్రావెలోగ్స్
• ఐదు సాహిత్య వ్యాసాలు సేకరణలు
• ఒక పద్య సేకరణ
గోవింద్ మిశ్రా అందుకున్న మరికొన్ని అవార్డ్లు
• వ్యాస్ సమ్మాన్ (1998)
• సాహిత్య అకాడెమీ అవార్డు (2008)
• భారత్-భరతి సమ్మాన్ (2011)
సరస్వతీ సమ్మాన్
 • సాహిత్యంలో విశేష కృషిచేసిన వారికి సరస్వతీ సమ్మాన్ పురస్కారాన్ని అందజేస్తారు. ఇది ఒక వార్షిక సాహిత్య పురస్కారం.
• సరస్వతీ సమ్మాన్ పురస్కారం కోసం 22 భాషల రచయితలు మరియు కవుల, గత పది సంవత్సరాల రచనలను పరిగణలోకి తీసుకుంటారు.
• ఈ పురస్కారాన్ని 1991లో కే.కే.బిర్లా ఫౌండేషన్ ఏర్పాటు చేసింది.
• ఈ పురస్కారం కింద 10 లక్షల రూపాయలను మరియు ఒక ప్రశంసాపత్రాన్ని అందజేస్తారు.
• తొలుత ఈ సాహిత్య పురస్కారం కోసం దేశంలోని 15 భాషల రచయితలను పరిగణలోకి తీసుకునేవారు. 1992లో రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యుల్ లో చేర్చబడిన కొంకణి, మణిపురి మరియు నేపాలీ భాషల చేర్పుతో ఈ భాషల సంఖ్య 18కి చేరింది. మరోసారి 2004లో బోడో, డోగ్రి, మైథిలి మరియు సంతాలి భాషలను కలపగా మొత్తం భాషల సంఖ్య  22గా మారింది.
•2005వ సంవత్సరం నుంచి సరస్వతీ సమ్మాన్ పురస్కారం కోసం 22 భాషలకు చెందిన రచయితలు మరియు కవులను పరిగణిస్తున్నారు.
కే.కే. బిర్లా ఫౌండేషన్ ఈ అవార్డుతోపాటు హిందీ మరియు రాజస్థానీ రచయితల కోసం బీహారి పురస్కార్, హిందీ రచయితల కోసం వ్యాస్ సమ్మాన్ అనే మరో రెండు అవార్డులను కూడా ప్రదానం చేస్తుంది.   

2015ఆస్కార్ అవార్డులకు భారత్ అధికారిక ఎంట్రీగా గీతూ మోహన్ దాస్ యొక్క లయర్స్ డైస్ చిత్రం

Liar's Dice2015 ఆస్కార్ అవార్డులకు భారత్ యొక్క అధికారిక ఎంట్రీగా గీతు మోహన్ దాస్ యొక్క హిందీ చిత్రం ‘లయర్స్ డైస్’ 23 సెప్టెంబర్ 2014న ఎంపికైంది. ఈ 87 వ ఆస్కార్ అవార్డుల కార్యక్రమం 22 ఫిబ్రవరి 2015న అమెరికాలో ఈ చిత్రం ఉత్తమ విదేశీ భాషా చిత్రవిభాగంలో ఎంపికైంది.
మొత్తం 30 ఎంట్రీలు అందగా, ఈ చిత్రాన్ని ప్రముఖ చిత్ర నిర్మాత టి హరిహరన్ నేతృత్వంలోని 12 మంది సభ్యుల జ్యూరీ ఏకగ్రీవంగా ఎంపికచేసింది.
‘లయర్స్ డైస్’
‘లయర్స్ డైస్’ చిత్రం 19 సెప్టెంబర్ 2014న తిరువనంతపురం లో విడుదలైంది. 26 సెప్టెంబర్ 2014న పూణేలొనూ, PVR పిక్చర్స్ ద్వారా నవంబర్ 2014లో దేశమంతా ప్రదర్శింబడనుంది. 
ఈ చిత్రంలో జాతీయ అవార్డు గ్రహీతలు గీతాంజలి తాప మరియు నవజుద్దిన్ సిద్దికి నటించారు. ఈ సినిమా హిమాచల్ టిబెట్ సరిహద్దు వెంబడి వలసదారుల వ్యధలు వివరిస్తుంది.
ఈ చిత్రంలో, తప్పిపోయిన భర్తను వెతుకుంటూ వెళ్ళే కమల, తన కుమార్తె మరియు వారి ప్రయాణంలో తారసపడిన విచిత్రవ్యక్తి చేసిన సాహసాలను, భయంకరమైన సిద్దికి పాత్రకు కమల భయపడడాన్ని చిత్రీకరించారు.
2014 లో 61 వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఈ సినిమాకు గాను రాజీవ్ రవికి ఉత్తమ సినిమాటోగ్రఫీ మరియు గీతాంజలికి ఉత్తమ నటి అవార్డ్లు లభించాయి.
అంతేకాకుండా, ఇది సన్ డాన్స్ ఫిలిం ఫెస్టివల్ మరియు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ రోటర్డ్యామ్ లో ప్రదర్శించబడింది.
ఈ సినిమా 2013 లో ముంబై ఫిలిం ఫెస్టివల్ (MFF)లో మొట్టమొదటిసారిగా ప్రదర్శించబడింది.
భారతదేశం మరియు ఆస్కార్ అవార్డులు 
భారతదేశం ఇప్పటివరకు ఉత్తమ విదేశీ చిత్ర విభాగంలో లో ఆస్కార్ గెలవలేదు. ఆస్కార్ అవార్డుకు చివరి ఐదు పోటీదారులలో పోటిపడిన అశుతోష్ గోవరికేర్ యొక్క ‘లగాన్’ చిత్రం మాత్రమే కనీసం అంతవరుకు చేరిన  ఆఖరి భారతీయ చిత్రం కాగా సలాం బాంబే మరియు మదర్ ఇండియా చిత్రాలు మాత్రమే ఇప్పటివరకు ఆస్కార్ ఐదు పోటీదారులలో స్థానం సంపాదించాయి.


న్యూ యార్క్ లో జరిగిన 2014 UN పర్యావరణ మార్పు సదస్సు (2014 UN Climate Change Conference held in New York)

Who:  ఐక్యరాజ్య సమితి
Where:  న్యూయార్క్ లోని UN ప్రధాన కార్యాలయం వద్ద
What:  UN పర్యావరణ మార్పు సదస్సు
When:  23 సెప్టెంబర్ 2014
Why:  గ్లోబల్ వార్మింగ్ నుండి భుగ్రహాన్ని కాపాడటానికి

గ్లోబల్ వార్మింగ్ నుండి భుగ్రహాన్ని కాపాడటానికి కావలిసిన కోర్సును అమలు చేయడానికిగాను 23 సెప్టెంబర్ 2014న న్యూ యార్క్ లో UN ప్రధాన కార్యాలయం వద్ద UN పర్యావరణ మార్పు సదస్సు జరిగింది.

2015లో పారిస్ లో జరగనున్న సార్వత్రిక వాతావరణ ఒప్పందం అర్ధవంతమైనదిగా ఉండేలాగా రాజకీయ ఊపందించడానికే ఈ 2014 UN పర్యావరణ మార్పు సదస్సు జరిగింది. అంతేకాకుండా,  వాతావరణ మార్పు ప్రతికూల ప్రభావాలను తగించడానికి అన్ని దేశాల సహకారాన్ని కూడగట్టాలనే లక్ష్యంతోనూ జరిగింది.

2009లో, గందరగోళములో ముగిసిన వాతావరణ మార్పుపై కోపెన్హాగన్ సదస్సు తరువాత వాతావరణ మార్పు పై ప్రపంచ నాయకులలో అతిపెద్ద సదస్సు ఇదేకావడం విశేషం. అయితే, చైనా మరియు ఇండియా నాయకులెవరు వెళ్లకపోవడంతో ఈ సదస్సుపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి.   

హాలీవుడ్ నటుడు లియోనార్డో డికాప్రియో కూడా ఈ UN వాతావరణ మార్పు శిఖరాగ్ర సదస్సుకు హాజరయ్యారు. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్, మొత్తం 120 నేతలలో, ఈ సదస్సకు ఆతిధ్యమిచారు.

సదస్సులో ప్రపంచ నాయకుల ప్రకటించిన విరాళాలు

కార్బన్ తగ్గింపు మరియు పర్యావరణ స్థితిస్థాపక అభివృద్ధి కోసం ప్రభుత్వాలు, వ్యాపార, ఆర్థిక, బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకులు మరియు పౌర సమాజం నాయకుల కొత్త సంకీర్ణ సంస్థ 200 US డాలర్లు పైగా కూడగట్టగలనే ఉద్దేశం ప్రకటించింది.

2020 కల్లా ఏడాదికి 100 బిలియన్ US డాలర్ల లక్ష్యం చేరుకునే విధంగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఫైనాన్స్లను ప్రోత్సహించనున్నట్టు దేశాలు గట్టిగా పునరుద్ఘాటించాయి.

యూరోపియన్ యూనియన్ 2014 మరియు 2020 మధ్య అభివృద్ధి చెందుతున్న దేశాలలో కార్బన్ విడుదలను తగ్గించే చర్యలు కోసం 3 బిలియన్ డాలర్ల ప్రకటించింది.

ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఫైనాన్స్ క్లబ్ (ఐడీఎఫ్సీ), 2015 చివరి నాటికి కొత్త వాతావరణ ఫైనాన్స్ కార్యకలాపాలు కోసం సంవత్సరానికి 100 బిలియన్ డాలర్ల ప్రత్యక్ష ఆకుపచ్చ / వాతావరణ పెట్టుబడి పెంచడానికి యోచిస్తున్నట్టు తెలిపింది.

ప్రముఖ వాణిజ్య బ్యాంకులు 2015 కల్లా 30 బిలియన్ డాలర్ల గ్రీన్ బాండ్లు జారీచేయాలనే తమ ప్రణాళికలను ప్రకటించాయి, అంతేకాకుండా 2020 నాటికి ప్రస్తుత వాతావరణ స్మార్ట్ అభివృద్ధి మొత్తాన్ని 10 రెట్లు పెంచాలనే తమ ఉద్దేశాన్ని ప్రకటించాయి.

సంస్థాగత పెట్టుబడిదారుల సంకీర్ణo, డిసెంబర్ 2015 నాటికి డీకార్బొనైజింగ్ కోసం 100 బిలియన్ US డాలర్లు ప్రకటించాయి.

భీమా పరిశ్రమ 2015 చివరి నాటికి దాని గ్రీన్ పెట్టుబడులను రెట్టింపు చేసి 84 బిలియన్ డాలర్ల చేయనున్నట్టు ప్రకటించింది.

ఉత్తర అమెరికా మరియు యూరోప్ నుండి మూడు ప్రధాన పింఛను కంపెనీలు 2020 కల్లా కార్బన్ పెట్టుబడులు తగ్గించడానికి 31 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ పెట్టుబడులు వచ్చేలా ప్రణాళికలను వేగవంతం చేస్తున్నట్లు ప్రకటించాయి.

వాతావరణ మార్పుపై ఐక్యరాజ్య ముసాయిదా సదస్సు (UNFCCC)
1997 క్యోటో ప్రోటోకాల్ కోసం వాతావరణ మార్పుపై ఐక్యరాజ్య ముసాయిదా సదస్సు (UNFCCC)లో జరిగే చర్చలకన్నా, ఈ సదస్సు కింద జరిగిన చర్చలు నుండి ప్రత్యేక ఉన్నాయి.
డిసెంబర్ 2015 లో పారిస్ సమావేశంతో UNFCCC ముగిసిపోనుంది

ఎడ్లబండి నుండి అంగారక గ్రహం దాకా: ఇస్రో ప్రయాణం ( Mangalyan History)

24 సెప్టెంబర్ 2014న అంగారక గ్రహ కక్ష్యలో మంగల్యాన్ ను ప్రవేశపెట్టి భారతదేశం చరిత్ర సృష్టించింది. ఈ ఘనత సాదించిన, ఆసియాలో మొదటిదేశంగాను మరియు అమెరికా మరియు మునుపటి సోవియట్ యూనియన్ల తరవాత  ప్రపంచంలోనే మూడవ దేశమైంది. అంతేకాకుండా నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మరియు మునుపటి USSR యొక్క స్పేస్ ఏజెన్సీ తర్వాత నాల్గవ స్పేస్ ఏజెన్సీ గా ఇస్రో గుర్తింపుపొందింది.

Bullock-Cart

మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, భారత దేశం తన తొలి ప్రయత్నంలోనే ఈ ఘనత సాధించమే కాకుండా మిగిలిన దేశాలకన్నా తక్కువ పెట్టుబడి (74 మిలియన్ అమెరికన్ డాలర్లు)తోను మిషన్ పూర్తయ్యేలా ఇస్రో శాస్త్రవేత్తలు కృషి చేశారు. 
1981లో లాంచ్ పాడ్ మీద ప్రయోగించడానికి అరియన్ పాసెంజర్ పేలోడ్ ఎక్స్పరిమెంట్ (APPLE) అనే తన ఉపగ్రహాన్ని ఎడ్లబండి మీద మోసుకెళ్ళిన ఇస్రో లాంటి సంస్థకిది నిజంగా ఘనకార్యమే. అంతేకాకుండా, ఈ ఘనత ఇస్రో స్పేస్ ఏజెన్సీకి, ఒక మైలురాయి అయ్యింది.
19 ఏప్రిల్ 1975లో తన ఆర్యభాట్టా-I ఉపగ్రహాన్ని అప్పటి సోవిఎట్ యూనియన్ యొక్క కోస్మోస్-3M లాంచ్ వెహికల్ ద్వారా అంతరీక్షంలోకి పంపిన ఇస్రో, తన ప్రయాణాన్ని సుదూరం సాగించి, ఉపగ్రహ ప్రయోగానికి వేరే దేశం మీద ఆధారపడే స్థాయి నుంచి సొంత ప్రయోగ పాడ్ (లాంచ్ పాడ్) లను నిర్మించుకుని, తమ సొంత ఉపగ్రహలనే కాకుండా వేరే దేశపు ఉపగ్రహాలను కుడా ప్రయోగించే స్థాయికి చేరింది. ఇస్రో ఇప్పటివరకు 65 ఉపగ్రహాలను ప్రయోగించగా అందులో 30 భారత దేశానివి కాగా 35ఇతర దేశాలవి కావడం విశేషం.
భారత్, అంతరీక్షంలో తన ఉనికి చాటుకున్న 6వ దేశమేకాకుండా రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాల ప్రాంతీయ నాయకులలో ఒకటిగా ఉంది. దాని ఎల్లప్పుడూ ఆధారపడదగిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ (PSLV),ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన ప్రయోగ వాహనాలలో ఒకటిగా అంతర్జాతీయ గుర్తింపు సాధించింది. PSLV ద్వారా ప్రయోగించిన 26 ప్రయోగాలలో 25 ప్రయోగాలు విజయవంతమవడం గుర్తించాల్సిన అవసరం
ఇంకా, 2008 లో ప్రయోగించబడిన  చంద్రయాన్ -I మిషన్ విజయవంతంగా పూర్తిచేయడం కూడా ఇస్రో చరిత్రలో ఒక ప్రధాన మైలురాయి. ఇది భూమి యొక్క సహజ ఉపగ్రహమైన చంద్రుడి మీద జెండాను పాతిన నాలుగు దేశాలలో భారతదేశాన్ని కుడా ఒకటిగా చేసింది.
అమెరికా యొక్క గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జిపిఎస్) మరియు రష్యా యొక్క GLONASS కు సమానమైన IRNSS వ్యవస్థ అభివృద్ధి మరియు భవిష్యత్తులో మనుషులతో కూడిన ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపడం వంటే ఆశయాలతో,  ఎడ్లబండి నుండి అంగారక గ్రహం దాకా సాగుతూ ఉన్న ఇస్రో ప్రయాణం, ప్రతీ భారతీయునికీ గర్వకారణమే!!!!