స్మార్ట్ నగరాల ప్రాజెక్ట్‌లో విద్య, వైద్యానికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యతను ఇచ్చింది. ఎంపిక చేసిన నగరాల్లో స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ పూర్తయ్యేలోగా ఆయా విభాగాల్లో ప్రభుత్వం ప్రతిపాదించిన పథకాలను అమలుచేసి, ప్రజలకు విద్య, వైద్యంలో ఇబ్బందులు లేకుండా చూడాలని నిర్ణయించింది.
స్మార్ట్ సిటీ - వైద్యరంగం
స్మార్ట్ సిటీల్లోని ప్రజల వైద్యానికి సంబంధించి అత్యవసర కేసులను 30 నిమిషాల్లోనే పరిష్కరించాలని భావిస్తోంది. ప్రతి లక్ష జనాభాకు అన్ని ఆసుపత్రుల్లో కలిపి దాదాపు 1210 పడకలు అందుబాటులోకి రానున్నాయి.
ఇక్కడి పౌరులందరికీ నూరు శాతం టెలి మెడిసిన్ సౌకర్యంతో పాటు, 15 వేల కుటుంబాలకు ఒక డిస్పెన్సరీని ఏర్పాటు చేస్తుంది.
50 వేల జనాభాకు డయాగ్నస్టిక్ సెంటర్‌తో పాటు, 100 వరకు కుటుంబ సంక్షేమ కేంద్రాల ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది.
స్మార్ట్ సిటీ - విద్యారంగం
స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్‌లో కీలకమైన ప్రాథమిక, ఉన్నత విద్యకు ప్రాధాన్యం ఇచ్చారు. విద్యలో ప్రమాణాలు మెరుగుపరచడంతో పాటు, అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు కల్పిస్తారు. నగరంలోని ప్రతి 10 లక్షల జనాభాకు ఒక ఇంజినీరింగ్, మెడికల్ కళాశాలను అందుబాటులోకి తీసుకురానుంది. అలాగే ఒక ప్రొఫెషనల్, పారామెడికల్, పశు వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తుంది. ప్రతి 1.25 లక్షల జనాభాకు ఒక కళాశాలను ఏర్పాటు చేయాలని, స్మార్ట్ సిటీకి యూనివర్సిటీ ఉండాలని అభివృద్ధి సూచిక కింద కేంద్రం పేర్కొంది.
స్మార్ట్ సిటీ లక్ష్యాలు:
2500 కుటుంబాలకు ఒక నర్సరీ పాఠశాల.
5 వేల కుటుంబాలకు ఒక ప్రాథమిక పాఠశాల (1 నుంచి 5వ తరగతి).
7500 కుటుంబాలకు ఒక సీనియర్ సెకండరీ పాఠశాల (6 నుంచి 12వ తరగతి).
ప్రతి లక్ష జనాభాకు సమీకృత పాఠశాల (1 నుంచి 12వ తరగతి).
45 వేల కుటుంబాలకు ఒక సాధారణ వికలాంగుల పాఠశాల.
10 లక్షల జనాభాకు మానసిక వికలాంగుల పాఠశాల.

No comments:
Post a Comment