Showing posts with label pravasi barateeya samman awards 2014. Show all posts
Showing posts with label pravasi barateeya samman awards 2014. Show all posts

Thursday, July 24, 2014

ప్రవాసీ భారతీయ సమ్మాన్' పురస్కారం 2014

జనవరి - 9,2014
¤   వివిధ రంగాల్లో చేసిన సేవలకు 13 మంది ప్రవాస భారతీయులకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ న్యూఢిల్లీలో 'ప్రవాసీ భారతీయ సమ్మాన్' పురస్కారాలను ప్రదానం చేశారు.
    »    దక్షిణాఫ్రికాలో 1994 నుంచి 2004 వరకు పార్లమెంట్ సభ్యురాలిగా పనిచేసిన మహాత్మాగాంధీ మునిమనవరాలు ఇలాగాంధీ దక్షిణాఫ్రికాలో చేసిన ప్రజాసేవకు గుర్తింపుగా ఈ అవార్డును ప్రదానం చేశారు.
    »   భారత సంతతికి చెందిన ఆస్ట్రేలియా సెనేటర్ లీసా మారియా సింగ్‌కు ఈ అవార్డును ప్రదానం చేశారు. ఆస్ట్రేలియాలో తొలి దక్షిణాసియా సెనెటర్‌గా, మంత్రిగా ఆమె ఘనత సాధించారు. ప్రజాసేవతోపాటు, భారత్, ఆస్ట్రేలియాల మధ్య స్నేహసంబంధాల వృద్ధికి కృషి చేసినందుకు ఆమెకు ఈ పురస్కారాన్ని ప్రకటించారు.
    »   1937 నుంచి ఫిజీలో సామాజిక సేవలందిస్తున్నందుకు ఫిజీలోని రామకృష్ణ మిషన్‌కు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు.
ఇతర గ్రహీతలు: వర్ఘీస్ కురియన్, వాసుదేవన్ చంచ్లానీ, వికాస్ చంద్ర సన్యాల్, సత్నారాయన్ సింగ్ రాబిన్ బల్దేవ్‌సింగ్, శశింద్రన్ ముత్తువేల్, శిబుద్దీన్ వావకుంజు, షంషేర్ వాయలీల్ పరంబత్, శైలేష్ లక్ష్మణ్ వర, పార్థసారధి చిరామెల్ పిళ్లై, రేణు ఖతోర్.
    »   న్యూఢిల్లీలో జరిగిన 12వ ప్రవాస భారతీయ దినోత్సవ వేడుకల్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ పురస్కారాలను ప్రదానం చేశారు.