Showing posts with label 'Trafficking in Person Hero' in 2014. Show all posts
Showing posts with label 'Trafficking in Person Hero' in 2014. Show all posts

Wednesday, July 30, 2014

'ట్రాఫికింగ్ ఇన్ పర్సన్ హీరో' 2014 ('Trafficking in Person Hero' in 2014)

 జూన్ - 20,2014

మనుషుల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అవిశ్రాంత పోరాటం సాగిస్తున్న భారత ఉద్యమకారుడు భానుజ శరణ్‌లాల్‌కు అమెరికా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక 'ట్రాఫికింగ్ ఇన్ పర్సన్ హీరో' అవార్డును ప్రదానం చేసింది.   
»    ఉత్తర భారత్‌లో మనుషుల అక్రమ రవాణకు వ్యతిరేకంగా ఆయన సారథ్యంలోని 'మానవ సన్‌సధన్ ఏవం మహిళా వికాస్ సంస్థాన్' విశేష కృషి చేస్తోంది.   
»    భానుజ శరణ్‌లాల్‌తో పాటు నేపాల్‌కు చెందిన టెక్ నారాయణ్ కన్వర్, ట్రినిడాడ్ అండ్ టొబాగోకు చెందిన చార్మెయిన్ గాంధీ ఆండ్రూస్‌కు కూడా ఈ అవార్డును ప్రదానం చేసింది.   
»    ప్రపంచవ్యాప్తంగా మనుషుల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నవారికి అమెరికా ఈ అవార్డును ఇచ్చి సత్కరిస్తోంది