జులై - 21,2015
100 బిలియన్ డాలర్లు (రూ.6.50 లక్షల కోట్లు) మూలనిధితో ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధు (ఐఎంఎఫ్)లకు పోటీగా బ్రిక్స్ దేశాల సారథ్యంలో కొత్త బ్యాంకు 'ది న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు' (ఎన్‌డీబీ) ప్రారంభోత్సవం చైనాలోని షాంఘైలో ఘనంగా జరిగింది.
» వర్థమాన దేశాలు ప్రపంచ బ్యాంకు, ఐఎమ్ఎఫ్‌లపై ఆధారపడటాన్ని తగ్గించే లక్ష్యంతో ఈ బ్యాంకు ఏర్పాటైంది. వర్థమాన మార్కెట్ల నుంచి పుట్టుకొచ్చిన తొలి అతిపెద్ద ఆర్థిక సంస్థ కూడా ఇదే.
» తొలి అయిదేళ్ల పాటు ఎన్‌డీబీ అధ్యక్షుడిగా భారత్‌కు చెందిన కె.వి.కామత్ బాధ్యతలు నిర్వర్తిస్తారు.
» కె.వి.కామత్, చైనా ఆర్థికమంత్రి లూ జివే, షాంఘై నగర మేయర్ యాంగ్ షియాంగ్‌లు ఎన్‌డీబీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
» ఎన్‌డీబీకి శుభాకాంక్షలు చెప్పిన తొలి వ్యక్తి ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు జిమ్ యాంగ్ కిమ్.
» 2012లో దిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో వర్థమాన దేశాలకు ఒక బ్యాంకు ఉండాల్సిన అవసరాన్ని భారత్ నొక్కి చెప్పింది.
» ప్రాథమికంగా అయిదు వ్యవస్థాపన సభ్య దేశాలు (బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా) కలిసి సమాన నిష్పత్తిలో 50 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.3.25 లక్షల కోట్లు) మూలధనాన్ని సమకూరుస్తాయి.
» మరో 100 బిలియన్‌డాలర్ల అత్యయిక నిధి ఈ బ్యాంకుకు మద్దతుగా ఉంటుంది. 41 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.66 లక్షల కోట్లు)ను చైనా సమకూరుస్తుండగా భారత్, రష్యా, బ్రెజిల్‌లు 18 బిలియన్ డాలర్లు (సుమారు రూ.1.2 లక్షల కోట్లు) చొప్పున, దక్షిణాఫ్రికా 5 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.3.25 లక్షల కోట్లు) చొప్పున ఇస్తాయి.
» ఐఎమ్ఎఫ్, ప్రపంచ బ్యాంకుల తరహాలో ఏ సభ్యదేశానికీ వీటో పవర్ ఉండదు. అయిదేళ్లకోసారి రొటేషన్ పద్ధతిన అధ్యక్ష పదవి మారుతుంటుంది.

No comments:
Post a Comment