Sunday, October 11, 2015

సమగ్ర కుటుంబ సర్వే - 2014

* సమగ్ర కుటుంబ సర్వే పేరుతో ప్రభుత్వం 2014 ఆగస్టు 19న రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి సర్వేని చేపట్టింది. రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు సంబంధించి సమగ్రమైన, పటిష్టమైన గణాంక సమాచార వివరాలను సిద్ధం చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యం.
* అర్హులైన లబ్దిదారులను గుర్తించి, వారి వ్యక్తిగత అవసరాలే లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయడానికి సమగ్ర కుటుంబ సర్వే దోహదపడుతుంది.
* ఈ సర్వే ప్రకారం అత్యధికంగా 16.56 లక్షల కుటుంబాలు రంగారెడ్డి జిల్లాలోనూ, అత్యల్పంగా 6.97 లక్షల కుటుంబాలు నిజామాబాద్ జిల్లాలోనూ ఉన్నాయి.
ఆహార భద్రత
* ఆహార భద్రత కార్డులకు అర్హులైన కుటుంబాలకు 2015 జనవరి 1 నుంచి మనిషికి ఆరు కిలోల చెప్పున, రూపాయికే కిలో బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు.
* ఇంతకు ముందు మనిషికి 4 కిలోలు చొప్పున, కటుంబానికి 20 కిలోలకు మించి బియ్యం ఇచ్చేవారు కాదు. ప్రస్తుతం కుటుంబంలో ఎంత మంది సభ్యులున్నా.. మనిషికి 6 కిలోలు వంతున బియ్యాన్ని ఇస్తున్నారు.
* అంత్యోదయ అన్న యోజన(ఏఏవై) కింద ఎంపికైన కుటుంబాలకు కిలో రూపాయి ధరకు నెలకు 35 కిలోల బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు.
* ఇంతవరకు తెలంగాణలో ఆహార భద్రత కార్డులకు అర్హులుగా 87.57 లక్షలు కుటుంబాలను గుర్తించారు. అంత్యోదయ అన్న యోజన కార్డులకు 49 వేల మంది అర్హులను గుర్తించారు.
సన్న బియ్యం పథకం
* హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులకు, మధ్యాహ్న భోజనం పథకం కింద లబ్ది పొందుతున్న విద్యార్థులకు పుష్టికరమైన, నాణ్యమైన ఆహారాన్ని అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. దీనికి అనుగుణంగా ప్రభుత్వం సూపర్‌ఫైన్ రకం (సన్న బియ్యం) బియ్యాన్ని సరఫరా చేస్తుంది.
హరితహారం
* హరితహారం కార్యక్రమాన్ని 2015 జులై 3న ముఖ్యమంత్రి కేసీఆర్ రంగారెడ్డి జిల్లా 'చిలుకూరు'లో ప్రారంభించారు.
* రాష్ట్రంలో అడవుల శాతాన్ని 24 నుంచి 33 శాతానికి పెంచడం హరితహారం లక్ష్యం. ఇందులో భాగంగా వచ్చే మూడేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 230 కోట్ల మొక్కలను పెంచడం లక్ష్యం.
సామాజిక భద్రతకు 'ఆసరా'
* ఆసరా అనేది సామాజిక భద్రతా పింఛన్ల కార్యక్రమం. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, నేతపనివారు, కల్లుగీత పనివారు, హెచ్ఐవీ, ఎయిడ్స్ బాధితులు సామాజిక భద్రతతో రోజువారీ కనీస అవసరాలను తీర్చుకోవడానికి ఈ పథకం అండగా నిలుస్తుంది.
* ఈ పథకంలో భాగంగా వృద్ధులు, వితంతువులు, కల్లుగీత పనివారు, నేతపనివారు, హెచ్ఐవీ, ఎయిడ్స్ బాధితులకు గతంలో నెలకు రూ. 200 చెల్లించేవారు. ప్రస్తుతం దీన్ని వెయ్యి రూపాయలకు పెంచారు. వికలాంగులకు నెలకు రూ. 500 ఇచ్చేవారు, ప్రస్తుతం రూ. 1500 చెల్లిస్తున్నారు.
* 2015 నుంచి బీడీ కార్మికుల్లోని మహిళలకు కూడా 'ఆసరా' పథకం కింద ఆర్థిక సాయాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీరికి కూడా రూ.1000 జీవన భృతి కల్పిస్తున్నారు.
 
తాగునీటి సరఫరా పథకం
* తెలంగాణ తాగునీటి సరఫరా ప్రాజెక్ట్ (టీడీడబ్ల్యూఎస్పీ) కింద హైదరాబాద్ మినహా.. 9 జిల్లాల్లోని 25,139 ఆవాసాలు, 67 మున్సిపాలిటీల పరిధిలో నివసిస్తున్న 3.19 కోట్ల జనాభాకు ప్రతిరోజూ తాగునీటిని అందిస్తారు.
* ఈ ప్రాజెక్టును నాలుగేళ్లలో పూర్తి చేయనున్నారు. తెలంగాణ తాగునీటి సరఫరా పథకం పైలాన్‌ని 2015 జూన్ 8న నల్గొండ జిల్లా 'చౌటుప్పల్‌లో సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు.
* ప్రాజెక్టు ముఖ్యాంశాలు: 1) ప్రతి ఇంటికీ నల్లా ద్వారా సురక్షిత తాగునీరు. 2) ప్రతి వ్యక్తికి రోజుకు గ్రామాల్లో 100 లీటర్లు, పట్టణాల్లో 135 లీటర్లు, నగరాల్లో 150 లీటర్ల నీటి సరఫరా. 3) 25 వేల జనావాసాలకు పైప్‌లైన్‌తో తాగునీటిని అందించడం. 4) ప్రాజెక్టులో 10 శాతం పారిశ్రామిక అవసరాలకు కేటాయింపు. 5) నల్గొండ జిల్లా ప్రజలకు ఫ్లోరోసిస్ నుంచి విముక్తి కలిగించడం.
గ్రామజ్యోతి (తెలంగాణ గ్రామ అభివృద్ధి పథకం)
* ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే లక్ష్యంతో గ్రామజ్యోతి కార్యక్రమాన్ని 2015 ఆగస్టు 17న వరంగల్ జిల్లా గంగదేవిపల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు.
* ఈ కార్యక్రమంలో భాగంగా వచ్చే నాలుగేళ్లలో రూ. 25 వేల కోట్లతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడతారు.
* ప్రతి గ్రామానికి తాగునీటి సరఫరా.. గ్రామాల్లో పారిశుద్ధ్యం, ఆరోగ్యం, విద్య, సాంఘిక భద్రత, పేదరిక నిర్మూలన, సహజవనరుల నిర్వహణ, వ్యవసాయం, మౌలిక వసతుల కల్పనకు ఈ కార్యక్రమం ద్వారా అధిక ప్రాధాన్యం ఇస్తారు.
* 'గ్రామసభ'లో గ్రామాభివృద్ధి ప్రణాళిక తయారీ - ప్రజల సమష్టి భాగస్వామ్యంతో సమ్మిళిత - సమీకృత అభివృద్ధిని సాధించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.
పారదర్శకత, జవాబుదారీతనం, సాధికారత, ప్రోత్సాహకాలతో లక్ష్య సాధన.
* 'గ్రామజ్యోతి'లో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీలో 7 గ్రామాభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేస్తారు. అవి.. 1) పారిశుద్ధ్యం - తాగునీరు 2) ఆరోగ్యం - పోషకాహారం 3) విద్య 4) సామాజిక భద్రత - పేదరిక నిర్మూలన 5) సహజవనరుల నిర్వహణ 6) వ్యవసాయం 7) మౌలిక వసతులు
* ప్రతి కమిటీలో అయిదుగు సభ్యులుంటారు. గ్రామసభ ఆమోదంతో రంగాల వారీగా ప్రణాళికల రూపకల్పన, వనరుల కేటాయింపు, ఫలితాలను రాబట్టడం ఈ కమిటీల ప్రధాన విధులు.
పల్లె ప్రగతి
* నిరుపేదల జీవనాభివృద్ధికి 'తెలంగాణ పల్లెప్రగతి' పథకాన్ని 2015 ఆగస్టు 22న రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది.
* రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన అత్యంత పేదరికంలో మగ్గుతున్న 150 మండలాల్లో అయిదేళ్ల పాటు ఈ పథకం అమల్లో ఉంటుంది.
* పథకం మొత్తం వ్యయం రూ. 642 కోట్లు (ఇందులో రూ. 450 కోట్లు ప్రపంచ బ్యాంకు ఇస్తుంది).
పథకం లక్ష్యాలు: గ్రామస్థాయిలో పేదల కోసం 2.5 లక్షల ఉత్పత్తిదారుల సంఘాలు, కృషిమార్టుల ఏర్పాటు ద్వారా ఆదాయాన్ని పెంచడం.
* వ్యవసాయ పద్ధతులు, మార్కెటింగ్ మెలకువల్లో శిక్షణ, పాడి పరిశ్రమ, గొర్రెలు, మేకలు పెంపకంతో పాటు వరి, తృణధాన్యాల ఉత్పత్తి తదితర అంశాల్లో చేయూతనందించడం.
* 2.5 లక్షల పేద కుటుంబాల్లో ఆరోగ్యం, ఆహార భద్రత కల్పించడం. 150 మండలాల్లో అందరూ మరుగుదొడ్లు వినియోగించుకునేలా చూడటం.
* 1000 గ్రామ పంచాయతీల్లో 'పల్లె సమగ్ర సేవా కేంద్రాల ఏర్పాటు.
<a href="http://www.flipkart.com/acer-liquid-z530/p/itmebzzgkzagmswu?pid=MOBEBZZGHFCE8SAT&affid=karthipaw">Acer Liquid Z530</a>

తెలంగాణ రాష్ట్రం - సంక్షేమ ప‌థ‌కాలు

* తెలంగాణ ప్రభుత్వం సామాజిక భాగస్వామ్యంతో వికేంద్రీకరణ నమూనాలో 'మిషన్ కాకతీయ' పేరిట రాష్ట్రంలో ఉన్న 46,531 చెరువుల (చిన్న తరహా సాగునీటి వనరులు) పునరుద్ధరణ కోసం బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టింది.
* ఈ పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ 2015 మార్చి 12న నిజామాబాద్ జిల్లా, ఎల్లారెడ్డి నియోజకవ్గం, 'సదాశివనగర్ గ్రామం' లోని పాతచెరువులో ప్రారంభించారు.
* ఈ కార్యక్రమం కింద రానున్న అయిదేళ్లలో రూ.20,000 కోట్ల అంచనా వ్యయంతో అన్ని చెరువులను పునరుద్ధరించాలనేది లక్ష్యం.
* చెరువుల పునరుద్ధరణలో కింది అంశాలు భాగంగా ఉంటాయి.
1) పూడిక తొలగింపు - నిల్వ సామర్థ్యాన్ని పెంచడం.
2) పూడిక మట్టిని పొలాల్లో పునర్వినియోగించడం.
3) చెరువులకు సంబంధించిన పిల్ల కాలువల పునరుద్ధరణ.
4) గట్లు, తూములు, అడ్డుకట్టల మరమ్మతులు.
5) సాగునీటి కాలువల రీ-సెక్షనింగ్.
వర్తమానాంశాలు - ప్రాంతీయం
మిషన్ కాకతీయ ఆవశ్యకత:
* రాష్ట్రంలో వ్యవసాయాభివృద్ధికి చెరువుల వ్యవస్థ కీలకమైంది. భూసార, జలసంరక్షణ, వరదల నియంత్రణ, కరవు నివారణ, పశుగణం, గృహ వినియోగాలు, భూగర్భజలాలను పెంచడం, శీతోష్ణస్థితి, పర్యావరణ పరిరక్షణలకు చెరువుల పునరుద్ధరణ దోహదపడుతుంది.
* 2014-15 నుంచి మొదలయ్యే ఈ పథకంలో భాగంగా అయిదేళ్ల కాలంలో ఏడాదికి 20 శాతం చొప్పున మొత్తం 46,531 చెరువులను పునరుద్ధరిస్తారు.
కళ్యాణ లక్ష్మి 
* తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ కుటుంబాల్లో ఆర్థిక కుంగుబాటు లేకుండా చేయడానికి వివాహ సమయంలో యువతులకు ఆర్థిక సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం కళ్యాణలక్ష్మి పథకాన్ని ప్రారంభించింది.
* ఈ పథకం కింద 18 సంవత్సరాలు నిండిన అవివాహిత యువతులకు వివాహ సమయంలో జీవితంలో ఒకసారి రూ.51,000 ఆర్థిక సాయం అందిస్తారు.
* ఈ పథకం 2014 అక్టోబరు 2 నుంచి అమల్లోకి వచ్చింది.
* ఈ పథకం కింద లబ్ధి పొందే తల్లిదండ్రుల ఆదాయం ఏడాదికి రూ.2 లక్షలకు మించకూడదు.
షాదీ ముబారక్
అవివాహిత మైనారిటీ కమ్యూనిటీ యువతులందరికీ వివాహ సందర్భంగా వారి కుటుంబ భారాన్ని తగ్గించడానికి ప్రభుత్వం 'షాదీ ముబారక్' పథకాన్ని ప్రవేశపెట్టింది.
* ఈ పథకం 2014 అక్టోబరు 2 నుంచి అమల్లోకి వచ్చింది.
* వివాహానికి కనీసం నెల ముందు దరఖాస్తు చేసుకునే ప్రతి మైనారిటీ బాలికకు ఒకసారి రూ.51,000 ఆర్థిక సాయం అందిస్తారు.
* ఈ మొత్తాన్ని పెళ్లికూతురు పేరిట అకౌంట్ పేయీ చెక్కు ద్వారా బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు.
ఆరోగ్య లక్ష్మి 
* గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించే ఉద్దేశంతో 'ఆరోగ్యలక్ష్మి' కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది.
* ఈ పథకం 2015 జనవరి 1 నుంచి అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ అమల్లోకి వచ్చింది.
* ఈ కార్యక్రమం కింద గర్భిణులకు, బాలింతలకు ప్రతి రోజూ ఒక పూట భోజనాన్ని సమకూరుస్తారు.
* రాష్ట్రంలో 5,66,917 మంది మహిళలకు ఈ ప్రయోజనాన్ని కల్పించారు.
మహిళలకు రక్షణ 
* రాష్ట్రంలోని మహిళలు, బాలికల భద్రత, రక్షణ, సంరక్షణ, సాధికారతల కోసం తెలంగాణ స్టేట్ సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ అండ్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ విమెన్ పేరుతో ఒక సంస్థను 2014 నవంబరు 25న రిజిస్టర్ చేశారు.
షీ క్యాబ్స్ 
* మహిళా డ్రైవర్లను ప్రోత్సహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 'షీ క్యాబ్స్' పేరుతో 2015 సెప్టెంబరు 8న ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించింది.
* అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించి, ప్రతి టాక్సీకి 35 శాతం సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుంది.

Tuesday, October 6, 2015

సకలం సమ్మతం-భిన్నత్వంలో ఏకత్వం

  • భిన్నత్వంలో ఏకత్వం ప్రత్యేకతగా ఉన్న భారతీయ సమాజ లక్షణాల్లో అత్యంత ప్రధానమైన వాటిలో మతం ఒకటి. ఇక్కడ అనేక మతాలున్నాయి.. అన్ని మతాలూ మానవజీవనం సన్మార్గంలో, ఉత్కృష్టంగా సాగిపోవాలనే చెబుతున్నాయి. ఈ దిశగా ప్రతి మతం పలు నియమాలు, జీవన సూత్రాలను ప్రబోధిస్తోంది. మతపరంగా ఇంతటి వైవిధ్యమైన సమాజం పురాతన కాలంలోగానీ, ఆధునిక కాలంలోగానీ ఎక్కడా లేదు. అన్ని రకాల ప్రజలను, మతాలను సమాజంలోకి ఆహ్వానించడమే ఇందుకు కారణం. ఇంత సహనం ఉన్న సమాజాలు దాదాపు తక్కువ. అందుకే అనేక మతాలు, జాతులు మన దేశంలో స్థిరపడ్డాయి. మతాలను, మతపరమైన విభాగాలను అర్థం చేసుకుంటే భారతీయ సమాజాన్ని స్థూలంగా తెలుసుకోవచ్చు. పోటీపరీక్షల అభ్యర్థుల కోసం ఈ అంశాలపై టీఎస్‌పీఎస్సీ సిలబస్ కమిటీ సభ్యులు ఆచార్య గణేశ్ అందిస్తున్న సమగ్ర విశ్లేషణ 'ఈనాడు ప్రతిభ'కు ప్రత్యేకం..
  • భారతీయ సమాజంలో ఉన్న మతాల్లో హిందూ, ఇస్లాం, క్రైస్తవం, బౌద్ధం, జైనం, సిక్కు, పార్సీ ప్రధానమైనవి...
  • హిందూమతం
  • హిందూమతమనేది కొన్ని తాత్విక సిద్ధాంతాలపై ఆధారపడింది. ప్రధానంగా కర్మ, ధర్మ, పునర్జన్మ, మోక్ష, ముక్తి సిద్ధాంతాలను హిందూమతం ప్రబోధిస్తుంది. వీటినే హిందూమత విశ్వాసాలని కూడా అనొచ్చు. హిందూమతం చెప్పేదేమంటే ప్రతి హిందువు జీవితలక్ష్యం మోక్షసాధన. ఆ మోక్షసాధనకు ధర్మమార్గంలో జీవితాన్ని గడపాలని చెబుతుంది. ఈ మత విశ్వాసం ప్రకారం మోక్షమంటే ఆత్మ, పరమాత్మలో లీనం కావడమే..హిందూమతానికి కొన్ని తాత్విక, ధార్మిక ప్రాతిపదికలున్నాయి. అవి..
    1. 1. వేదాలు
      2. స్మృతులు
      3. శ్రుతులు
      4. ఉపనిషత్తులు
      5. అహింస
      6. సహనం
      7. ధార్మికజీవనం
      8. వర్ణాశ్రమధర్మాలు
      9. పురుషార్థాలు.
  • హిందూమతానికి కులవ్యవస్థకు అవినాభావ సంబంధం ఉంది. హిందూ సమాజం వివిధ కుల సమూహాలుగా విభజితమైంది. హిందూ జీవన దృక్పథం ప్రధానంగా కిందివాటి ద్వారా అర్థమవుతుంది.
    1. 1. ధర్మ సిద్ధాంతం
      2. కర్మ సిద్ధాంతం
      3. వర్ణ వ్యవస్థ
      4. ఆశ్రమ వ్యవస్థ
      5. పురుషార్థాలు
      6. రుణాలు
      7. సంస్కారాలు.
    ధర్మం అంటే..?
  • హిందూ జీవనంలో ధర్మమనేది ప్రవర్తన నియమావళికి సంబంధించిన అంశం. ధర్మం అంటే సత్యానువర్తనం. ఏది సమాజానికి ఆమోద యోగ్యమో.. దానికి అనుగుణంగా వ్యక్తి జీవించాలి. అంటే నీతి, నిజాయతీ, నైతిక ప్రవర్తన గురించి ధర్మం చెబుతుంది. హిందూ సామాజిక వ్యవస్థలో ధర్మం అత్యంత ఉన్నతం, ఉత్కృష్టమైంది.
  • కర్మ సిద్ధాంతం
  • వ్యక్తి తాను చేసే పనులను బట్టి.. మంచి-చెడులను బట్టి.. ప్రస్తుత జీవితం, భావి జీవితం నిర్ధారితమవుతుందనేది కర్మ సిద్ధాంతం. ప్రతి వ్యక్తిలో ఆత్మ ఉంటుంది. ఆత్మ శాశ్వతం. దీనికి పునర్జన్మ ఉంటుంది. ఈ పునర్జన్మ అనేది వ్యక్తి చేసే ఉచితానుచితాలను బట్టి నిర్ధారితమవుతుంది. ప్రస్తుత జీవితం - గత జీవితంలో చేసిన మంచి-చెడుల ఫలితం! అలాగే భవిష్యత్తు అనేది ఇప్పుడు చేసే మంచి-చెడులపై ఆధారపడి ఉంటుందని కర్మసిద్ధాంతం చెబుతుంది. హిందూసమాజంపై ఈ కర్మసిద్ధాంతం ప్రభావం చాలా ఉంటుంది.
  • వర్ణ వ్యవస్థ
  • ఇది అత్యంత కీలకమైంది. రుగ్వేదంలోని పురుషసూక్తంలో చాతుర్వర్ణాల గురించిన ప్రస్తావన ఉంది. అక్కడే వర్ణవ్యవస్థ గురించి చెప్పారు. రుగ్వేదం ప్రకారం సృష్టికర్త 4 శరీర భాగాల నుంచి నాలుగు వర్ణాలకు సంబంధించిన ప్రజలు ఉద్భవించారు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు - ఈ నాలుగూ వర్ణాలు. దీన్నే దైవాంశసంభూత సిద్ధాంతం అని కూడా అంటారు. అంటే ఈ సృష్టి అంతా దైవం నుంచి వచ్చిందనేది ఓ భావన. దీంతో విభేదించేవారున్నా వర్ణ వ్యవస్థ ప్రభావం హిందూ సమాజంపై ఉంది. తదనంతర కాలంలో వర్ణవ్యవస్థ నుంచి కులాలు, ఉపకులాలు ఉద్భవించాయి.
  • ఆశ్రమ వ్యవస్థ
  • ఆశ్రమాలు నాలుగు.. హిందూధర్మ శాస్త్రాల ప్రకారం ఆశ్రమం అంటే వ్యక్తి తన జీవితకాలంలో చేసే ఒక్కో మజిలీ అని అర్థం. వ్యక్తి సంపూర్ణ జీవితంలో నాలుగు దశలుంటాయి. మనిషి జీవితకాలం వంద సంవత్సరాలనుకుంటే ప్రతి 25 సంవత్సరాలను ఒక ఆశ్రమంగా భావిస్తారు.
    1. 1. బ్రహ్మచర్యాశ్రమం
      2. గృహస్థాశ్రమం
      3. వానప్రస్థాశ్రమం
      4. సన్యాసాశ్రమం.
  • బ్రహ్మచర్యాశ్రమంలో జ్ఞానాన్ని సంపాదించాలి. గృహస్థాశ్రమంలో పెళ్లి చేసుకొని, ధర్మబద్ధంగా పిల్లల్ని కనడం, కుటుంబానికి కావాల్సిన ధనాన్ని ధర్మబద్ధంగా ఆర్జించడం.. మొత్తం మీద ధర్మబద్ధంగా జీవించాలి. వానప్రస్థాశ్రమంలో.. గృహస్థాశ్రమం నుంచి బయటకు వచ్చి తన జీవతానుభవాలను సమాజంతో పంచుకోవాలి. సన్యాసాశ్రమంలో తన ఆత్మను పరమాత్మలో విలీనం చేయడానికి సిద్ధపడాలి. అంటే మోక్షప్రాప్తి కోసం సన్నద్ధంగా ఉండాలి. అంటే ఈ దశలో వ్యక్తి పూర్తిగా దైవచింతనలోనే గడపాలి. కుటుంబం, భార్యాబిడ్డల నుంచి పూర్తిగా దూరమవడం అంటే భౌతిక కాంక్షలకు లోనుకాకుండా సామాన్యజీవితాన్ని గడపడం.
  • పురుషార్థాలు ఇవి ప్రధానంగా నాలుగు..
    1. 1. ధర్మ
      2. అర్థ
      3. కామ
      4. మోక్ష..
  • హిందువుగా జన్మించిన ప్రతి వ్యక్తి తప్పనిసరిగా మొదటి మూడింటిని పాటించాలన్నది హిందూ ధర్మశాస్త్రాల సారం. ధర్మబద్ధంగా జీవితాన్ని గడపాలి, ధర్మబద్ధంగా సంపాదించాలి. ధర్మబద్ధంగా పిల్లల్ని కని సమాజాన్ని వృద్ధి చేయాలి. వ్యక్తి శాశ్వతం కాదు సమాజం శాశ్వతం. సమాజాన్ని కొనసాగించడానికి పిల్లల్ని కనడం ఓ ధర్మం. ఈ మూడింటినీ ధర్మబద్ధంగా పూర్తిచేస్తే మోక్షం లభిస్తుంది.
    హిందూ జీవన విధానంలో వర్ణవ్యవస్థ, ఆశ్రమ వ్యవస్థ, పురుషార్థాలు సమాంతరంగా నడిచే వ్యవస్థలు. ఇప్పటికీ ఇవి చాలామటుకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానే వ్యక్తులపై ప్రభావం చూపుతూనే ఉన్నాయి. పురుషార్థాల్లో అర్థం (డబ్బు) సంపాదించడం పురుషులకే అని ఎక్కడా లేదు. వ్యక్తిచేసే పనులు చెప్పారే తప్ప వ్యక్తి పురుషుడా, స్త్రీనా అని చెప్పలేదు.
  • రుణాలు
  • హిందూ జీవన దృక్పథం ప్రకారం ప్రతి వ్యక్తి మూడు రుణాలతో పుడతాడని చెబుతారు. ఈ మూడు రుణాలు తీర్చకుంటే మోక్షం ప్రాప్తించదనేది హిందూమత విశ్వాసం. ఆ రుణాలు-
    1. 1. రుషి రుణం.
      2. పితౄణం
      3. దేవరుణం.
  • వీటిలో పితౄణం ఉన్నతమైందిగా పరిగణిస్తారు.
    1. » రుషిరుణం అంటే గురురుణం. జ్ఞానాన్ని సంపాదించుకోవడం ద్వారా దీన్ని తీర్చుకోవాలని చెబుతారు. గురువుకంటే ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించి, గురువుతో ప్రశంసలు పొందేలా జ్ఞానాన్ని పొందితే రుషిరుణం తీర్చుకున్నట్లు.
      » పితౄణం అంటే తల్లిదండ్రుల రుణం. వారిని గౌరవించడం, వారు వృద్ధాప్య దశకు వచ్చినప్పుడు సేవలందించడం ద్వారా, వారికి మోక్షప్రాప్తి లభించేలా చేయాలి. అంటే వారికి అవసరమైన ప్రతీదీ చేయడం ద్వారా, సంస్కారాలను నిర్వర్తించడం ద్వారా పితౄణం తీర్చుకోవచ్చు.
      » దేవరుణం అంటే భగవంతుడి రుణం. యజ్ఞయాగాదులు చేయడం ద్వారా ఈ రుణం తీర్చుకోవచ్చని హిందూ ధర్మశాస్త్రం చెబుతోంది.
    సంస్కారాలు
  • సంస్కారం అంటే శుద్ధి చేయడమని అర్థం. హిందూ జీవన విధానంలో ఒక్కో దశలో ఒక్కో రకమైన శుద్ధి అవసరంగా భావిస్తారు. మనుస్మృతిలో ఈ సంస్కారాల గురించి చెప్పారు. గర్భదానంతో ఆరంభమై అంత్యేష్టితో ఇవి ముగుస్తాయి. గర్భదాన సంస్కారమంటే భార్యాభర్తలిద్దరూ తమకు సుపుత్రుడిని ప్రసాదించాలనే ప్రార్థన. తల్లి గర్భంలోకి రాకముందు నుంచే చేసే సంస్కారం. అంటే మనిషి పుట్టకముందే చేసేదిది. నామకరణం, ఉపనయనం, సమవర్తన (విద్యాభ్యాసం ముగించుకొని గృహస్థాశ్రమంలోకి ప్రవేశించే - వివాహానికి సిద్ధమయ్యే దశలో చేసే సంస్కారం), వివాహం, అంత్యేష్టి (చనిపోయేప్పుడు చేసే సంస్కారం) మరికొన్ని సంస్కారాలు. వీటిలో కొన్ని పురుషులకు మాత్రమే ఉన్నాయి.
  • ఇస్లాం
  • ఇస్లాం మతానికి కొన్ని సిద్ధాంతాలున్నాయి. హిందూమతంలో బహుదేవతారాధన ఉంటే ఇస్లాం ఏకదేవతారాధనా మతం. అల్లా యందు సంపూర్ణ విశ్వాసం ఉండాలని ఈ మతం చెబుతుంది. ఇందులో విగ్రహారాధన ఉండదు. ఖురాన్ మతగ్రంథం. ముస్లిం మతాన్ని ఆచరించేవారు ప్రధానంగా అయిదు విధులను పాటించాలి. వాటినే ఇస్లాం పంచ సూత్రాలంటారు.
    1. 1. అల్లాయందు విశ్వాసం
      2. రోజుకు 5 సార్లు ప్రార్థించడం (నమాజ్)
      3. జకాత్ (సంపాదించిన దాంట్లో కొంత దానం చేయడం)
      4. ప్రతి సంవత్సరం ముఖ్యంగా రంజాన్ మాసంలో ఉపవాసం ఉండటం (రోజా)
      5. జీవితకాలంలో ఒక్కసారైనా మక్కాను సందర్శించడం
    క్రైస్తవం
  • క్రైస్తవమతం కూడా ఏకదేవతారాధనను విశ్వసిస్తుంది. ఈ మత స్థాపకుడు జీసస్ క్రైస్ట్. మతగ్రంథం బైబిల్. క్రైస్తవం ప్రకారం ఏక వివాహ పద్ధతిని పాటించాలి. బహు వివాహం నిషిద్ధం. భారత్‌లోని క్రైస్తవుల్లో రెండు వర్గాలు కనిపిస్తాయి.
    1. 1. ప్రొటెస్టెంట్లు
      2. క్యాథలిక్‌లు.
  • క్యాథలిక్‌ల్లో మళ్లీ రోమన్ క్యాథలిక్‌లు, సిరియన్ క్యాథలిక్‌లు ఉన్నారు. బైబిల్‌లో చెప్పిన అంశాలనే పాటించడం, సమష్టి ఆరాధన ఈ మత విధానం.
  • బౌద్ధమతం
  • భారతదేశంలో చాలా ప్రభావం చూపించిన మతం బౌద్ధం. బుద్ధుడు మధ్యేమార్గ సిద్ధాంతాన్ని (మిడిల్‌పాథ్) ప్రబోధించారు. అంటే మనిషి పూర్తిగా సన్యాసిగా కాకుండా, పూర్తిగా భౌతిక కాంక్షలతో కాకుండా స్వయం నిగ్రహశక్తితో జీవితాన్ని గడపాలనేదే మధ్యేమార్గ సిద్ధాంతం. ఎవరైతే ఈ నిగ్రహశక్తిని కోల్పోతారో అటువంటివారు తనకుతాను మానసికంగా బలహీనులయ్యే అవకాశముంది. నిగ్రహాన్ని నిలబెట్టుకోవటానికి.. అర్య అష్టాంగమార్గ సిద్ధాంతాన్ని కూడా బుద్ధుడు చెప్పారు. అవి...
    1. 1. సరైన విశ్వాసం,
      2. సరైన అభిలాష/కోరిక,
      3. సరైన భాష,
      4. సరైన చర్య,
      5. సరైన జీవనవిధానం,
      6. సరైన ప్రయత్నం,
      7. సరైన ఆలోచన,
      8. సరైన యోచన
  • కర్మ, అహింస, పునర్జన్మను విశ్వసించిన బుద్ధుడు విగ్రహారాధనను, కులాల్ని ఖండించారు. అంతా సమానమే అనేది బౌద్ధమతం. వాస్తవికంగా చెప్పాలంటే హిందూమతంలోని అసమానత్వం, కొన్ని మత ఛాందస భావాలకు వ్యతిరేకంగా, విభిన్నంగా ఏర్పడిందే బౌద్ధం. దీన్ని 'రియాక్షనరీ రిలీజియన్ అని అంటారు. భారత్‌లోనే పుట్టినా ఇతర దేశాల్లో బాగా వ్యాపించింది. మన దేశంలో మహారాష్ట్ర, అసోం, సిక్కింలలో బౌద్ధమత జనాభా ఎక్కువ. బౌద్ధ దేవాలయాలు, ఆరామాలు- బుద్ధగయ, కుశినగరం, సారనాథ్, సాంచిలో ఉన్నాయి. హేతుబద్ధమైన ఆలోచనలు, నియమాలు, ఆహారానికి సంబంధించి ఎలాంటి నియమనిబంధనలు లేకపోవడం (బుద్ధుడు శాకాహారి అని చెప్పినా ఏది ఇస్తే అది స్వీకరించేవారు).. పూర్తి ఆచరణాత్మకవాదం ఈ మతం ప్రత్యేకత. అహింస అని చెప్పినా మధ్యేమార్గ సిద్ధాంతం చెప్పారు. పరిస్థితులకు అనుగుణంగా, ఆచరణాత్మకంగా జీవించాలనేది బౌద్ధం. అందుకే చాలా ప్రభావం చూపించి ప్రాచుర్యం పొందింది. ఒకదశలో హిందూమతానికి సవాల్‌గా నిలిచింది. బుద్ధుడి ప్రవచనాలను జాతక కథల్లో వివరించారు. వీటిని ప్రాకృతంలో రాశారు. బుద్ధుడి తర్వాతి కాలంలో బౌద్ధంలో రెండు శాఖలొచ్చాయి.
    1. 1. మహాయానం
      2. హీనయానం.
    జైనమతం
  • జైనమతం ప్రాచీనమైంది. దీన్ని ఎవరు స్థాపించారనే దానిపై భిన్న వాదనలున్నాయి. జైన తీర్థంకరుల్లో 24వ తీర్థంకరుడు మహావీరుడు. ఈ మహావీరుడే జైనమతానికి గుర్తింపు తెచ్చి, బలోపేతం చేశారు. జైనమతం కర్మ, అహింస, పునర్జన్మ సిద్ధాంతాలను విశ్వసిస్తుంది. అన్ని మతాల్లోకంటే అహింసకు అత్యంత ప్రాధాన్యమిచ్చేది జైనమతం. ఏ జీవికీ, ఏ రూపంలోనూ హింస ఉండకూడదని జైనమతం భావిస్తుంది. ఇందులోనూ రెండు శాఖలున్నాయి.
    1. 1. శ్వేతాంబర
      2. దిగంబర.
  • జైనమతంలో మోక్షమార్గం గురించి ప్రధానంగా చెబుతారు. ఇందుకోసం
    1. 1. సమ్యక్ దర్శన (సరైన విశ్వాసం)
      2. సమ్యక్ జ్ఞాన (సరైన జ్ఞానం)
      3. సమ్యక్ చరిత (సరైన ప్రవర్తన) ఉండాలని జైనం చెబుతుంది.
  • వీటినే రత్నత్రయాలంటారు. జైనమతం నైతిక ప్రవర్తన గురించి 5 సూత్రాలు చెబుతుంది. అవి..
    1. 1. అహింస
      2. సత్యం
      3. అస్థేయ (దొంగతనం చేయకుండా ఉండటం)
      4. బ్రహ్మచర్యం (లైంగిక నిగ్రహం)
      5. అపరిగ్రహ (అత్యాశ లేకపోవడం).
    సిక్కుమతం
  • ఇది కూడా హిందూమతం నుంచి వచ్చిందే. గురునానక్ దీని స్థాపకులు. గ్రంథసాహెబ్ సిక్కుల పవిత్ర మతగ్రంథం. సిక్కుమతానికి చెందిన పురుషులకు 5 మతపరమైన చిహ్నాలుంటాయి.
    1. 1. కేశాలు
      2. కంగన్ (దువ్వెన)
      3. ముంజేతి కడియం
      4. చిన్న చెడ్డి
      5. కృపాణ్ (చిన్న ఖడ్గం).
  • ఈ మతం విగ్రహారాధనను వ్యతిరేకిస్తుంది. సిక్కుల పదో గురువు గురు గోవింద్‌సింగ్ సిఖ్ ఖల్సా (సిఖ్ మిలిటరీ ఆర్డర్)ను స్థాపించారు. దీన్ని సిక్కుల అస్తిత్వం కోసం ఏర్పాటు చేశారు. ఈ ఖల్సాలోకి వచ్చేవారు పైనచెప్పిన చిహ్నాలను పాటిస్తారు. అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయం వీరి పవిత్ర దేవాలయం.
  • పార్సీలు
  • వీళ్లనే జొరాస్ట్రియన్లు అంటారు. వీరి మతమే జొరాస్ట్రియన్ మతం. వీళ్లు అగ్నిని పూజిస్తారు. పార్సీల్లో రెండు ప్రధాన శాఖలున్నాయి. 1. కదీమి 2. శంషాయి. పార్సీలు ఎక్కువ నైతిక జీవనానికి ప్రాధాన్యమిస్తారు. పార్సీల అధిదేవత (సుప్రీం గాడ్)ను అహూరా మాజ్దా అంటారు. జరాతుస్త్రా - అనే వ్యక్తి వీరి మతప్రవక్త, మతగురువు. ఈ మతంలో చనిపోయిన తర్వాత కళేబరాన్ని దహనం గానీ, ఖననం గానీ చేయరు. నిశ్శబ్ద శిఖరం (టవర్స్ ఆఫ్ సైలెన్స్) వద్ద ఉంచుతారు. అంటే కళేబరాన్ని పక్షులకు అర్పితం చేస్తారు. హైదరాబాద్‌లో ఉన్న పార్సిగుట్టలో ఇలాంటి ఏర్పాటు ఉంది. పార్సీల పవిత్రగ్రంథం జెండ్ అవెస్థా. పార్సీలను పర్షియా నుంచి వచ్చినట్లు భావిస్తారు. అయితే అక్కడ చాలా తెగలున్నాయి. అంతా ముస్లింలు కాదు. ఇస్లాం మతంలోకి మారాలన్న ఒత్తిడిని తట్టుకోలేక దాన్ని వ్యతిరేకించి, తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి వచ్చేశారు. వీరు ముఖ్యంగా వాణిజ్యవేత్తలు. వ్యాపారంలోనూ చాలా నైతికతను పాటిస్తారు. పార్సీల నైతిక నియమావళిలో మూడు సూత్రాలుంటాయి.
    1. 1. హూమత (మంచి ఆలోచన)
      2. హుక్తా (మంచి మాటలు)
      3. హువర్‌స్టా (మంచి పనులు).
    సాంస్కృతిక విభాగాలు
  • భారతీయ సమాజంలోని మరో వైవిధ్యం సాంస్కృతిక విభాగాలు. భారతీయ సంస్కృతి ప్రధాన లక్షణాలు
    1. 1. ధార్మిక జీవనం జీవిత పరమార్థం.. భారత్‌లోని దాదాపు అన్ని మతాలు దీన్నే ప్రబోధిస్తున్నాయి.
      2. మతంపట్ల సమ్మేళనాత్మక దృక్పథం.. భారతీయ సమాజం కేవలం ఒక మతానికి సంబంధించిన సమాజం కాదు. విభిన్న మతాలున్నాయిక్కడ. అన్నీ సమానంగా జీవించే అవకాశం ఉంది. భారత రాజ్యాంగం కూడా ఈ అవకాశం ఇచ్చింది. భారత్‌లోని ఏ వ్యక్తి అయినా తనకిష్టమైన మతాన్ని అనుసరించవచ్చు.. పాటించవచ్చు. ఆ రకమైన సాంస్కృతిక సమ్మిళిత దృక్పథం భారత్‌లో కనిపిస్తుంది.
      3. భిన్నత్వంలో ఏకత్వం.. వివిధ మతాలు, భాషలు, జాతులున్నా భారతీయులంతా ఒకటే అనే భావన భారతీయ సంస్కృతిలో కనిపిస్తుంది.
      4. మతపరమైన, సాంస్కృతికపరమైన ఐక్యత.. ఏ మతానికి, సంస్కృతికి సంబంధించినవారైనా ఒకటే అనే భావన.
      5. సహనం.
      6. అహింస. ఇవన్నీ భారతీయ సమాజ సాంస్కృతిక లక్షణాలు.

    తెలంగాణ సాహిత్యం

    ఆది నుంచీ తెలంగాణ ప్రజలను ముందుకు నడిపించడంలో.. చైతన్య పరచడంలో సాహిత్యానిదే కీలకపాత్ర. సూటిగా మనసులను తాకేలా, ఆలోచింపజేసేలా.. ఎందరో ప్రముఖులు తమ రచనలు, కళా రూపాల ద్వారా సమాజాన్ని జాగృతం చేయగలిగారు. నవలలు, కవితలు, పాటలు, నాటికలు, నాటకాలు, బుర్రకథలు, హరికథలు, ఒగ్గుకథలు, వీధి భాగోతాలు.. ఒకటేమిటి అనేక రూపాల్లో చైతన్యాన్ని నింపగలిగారు. దశాబ్దాల చరిత్రను సొంతం చేసుకున్న తెలంగాణ సాహిత్యపు విశేషాల సమాహారమిది..
    భ్యుదయ సాహిత్యానికి 1946 నుంచి 1951 వరకు సాగిన తెలంగాణ సాయుధ పోరాటం స్వర్ణయుగం. తెలంగాణ ప్రజలతోపాటు ఎన్నో ప్రాంతాల్లోని ఎందరినో ప్రభావితం చేసింది. పోరాటం జరుగుతున్న కాలంలోనూ, ఆ తర్వాత కూడా పోరాటస్ఫూర్తితో రచనలు వెలువడ్డాయి. తెలంగాణ విమోచనోద్యమ రచయితలు కవిత్వం, పాట, నాటకం, నాటిక లాంటి సాహిత్య ప్రక్రియలను.. బుర్రకథ, ఒగ్గుకథ, బుడబుక్కల కథ, హరికథ, వీధి భాగోతం, యక్షగానం లాంటి ప్రజా కళారూపాలను సుసంపన్నం చేశారు.
    పోరాట గీతాలు
    సుద్దాల హన్మంతు, తిరునగరి రామాంజనేయులు, దాశరథి, కాళోజీ, సోమసుందర్, సుంకర సత్యనారాయణ తదితరులు ఎన్నో పోరాట గీతాలు రాశారు. సుద్దాల హన్మంతు 'పల్లెటూరి పిల్లగాడా!' పాటతో తెలుగు ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు. 'వెట్టిచాకిరి విధానమో రైతన్నా.. ఎంత జెప్పినా తీరదో కూలన్నా..' అనే గీతంలో ప్రతిఫలం లేకుండా చేసిన వెట్టిని గుండెలవిసి పోయేలా వివరించారు సుద్దాల. నిజాం నవాబుపై రాసిన గీతాల్లో యాదగిరి రాసి, పాడిన 'నైజాం సర్కరోడా' పాట తెలంగాణ ప్రజల నోళ్లలో ఇప్పటికీ, ఎప్పటికీ నానుతూనే ఉంటుంది.
    దాశరథి కృష్ణమాచార్య 'ఓ నిజాము పిశాచమా! కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని, తీగెలను తెంపి అగ్నిలో దింపినావు, నా తెలంగాణ కోటి రతనాల వీణ' అంటూ జైలు గోడలపై బొగ్గుతోనే పద్యాలు రాశారు. 'సైసై గోపాలరెడ్డీ! నీవు, నిలిచావు ప్రాణాలొడ్డి..' అంటూ స్మృతి గీతాలు రాశారు తిరునగరి. 'మన కొంపలార్చిన, మన స్త్రీల చెరిచిన, మన పిల్లల చంపి మనల బంధించిన..' అంటూ ఉద్యమ సందేశాన్నందిచారు కాళోజీ. 
    ప్రజా కళారూపాలు
    తెలంగాణ సాయుధ పోరాట కాలంలో నాయకుల ఉపన్యాసాలు, పత్రికల వార్తల కంటే ఎక్కువ ప్రభావం చూపినవి ప్రజా కళారూపాలు. తిరునగరి రామాంజనేయులు తన పాటలతోపాటు హరికథలు, బుర్రకథలు అల్లి ప్రజల్లో చైతన్యం నింపారు. సుద్దాల హన్మంతు గొల్లసుద్దులు, పిట్టలదొర వేషం, బుర్రకథ తదితర ప్రక్రియలతో ప్రజలను కదిలించారు. సుంకర-వాసిరెడ్డిల 'మాభూమి' నాటకం చాలా ప్రాచుర్యం పొందింది. సుంకర సత్యనారాయణ 'కష్టజీవి' బుర్రకథను వేలాదిగా ప్రదర్శనలు ఇచ్చారు. 'ఆంధ్ర మహాసభ కాఫిర్ల సంఘం..' అందులో చేరకూడదు అంటూ ప్రచారం చేసే వారిని దెబ్బతీసేందుకు తిరునగరి 'వీరబందగీ'; పోరాటం తీవ్రమవుతున్న దశలో 'తెలంగాణ వీరయోధులు' బుర్రకథలు రాసి ప్రదర్శించారు. చెర్విరాల బాగయ్య 'షోయబుల్లాఖాన్', చౌడవరపు విశ్వనాథం 'ఆంధ్రమహాసభ' లాంటివి పోరాట కాలంలో ప్రజలను చైతన్య పరిచాయి. ఉద్యమ కాలంలో ప్రజా కళారూపాలకు లభిస్తున్న ఆదరణను సహించలేని నాటి నిజాం ప్రభుత్వం 'కష్టజీవి', 'తెలంగాణ వీరయోధులు' బుర్రకథలను, 'మాభూమి' నాటకాన్ని నిషేధించింది.
    'వీర తెలంగాణ' గొల్లసుద్దులను తిరునగరి ప్రదర్శించారు. 'అంబ పలుకు జగదాంబ పలుకు' అంటూ సాగే బుడబుక్కల కథ, నందన.. అంటూ పంతులు కంచు పళ్లెం మీద దరువేస్తూ పాడే చెంచుల కళా రూపం, పిట్టలదొర లాంటి కళారూపాలు అణగారిన వర్గాల్లో చైతన్య జ్వాలలు రగిల్చాయి.
    పోరాట నవలలు
    తెలుగు సాహిత్యం గర్వించదగిన నవలా సాహిత్యాన్ని తెలంగాణ రైతాంగ పోరాటం సృష్టించింది. వీటిలో పోరాటం కొనసాగుతుండగా 1947లో బొల్లిముంత శివరామకృష్ణ రాసిన 'మృత్యుంజయులు', లక్ష్మీకాంత మోహన్ రాసిన 'సింహగర్జన'(1950) వెలువడ్డాయి. పోరాట విరమణ తర్వాత వట్టికోట ఆళ్వారుస్వామి రాసిన 'ప్రజల మనిషి'(1955), 'గంగు'(1965) నవలలు వెలువడ్డాయి. వీటిలో 'ప్రజల మనిషి' తెలంగాణ గురించి తెలంగాణ వ్యక్తి రాసిన తొలి నవల. ఇది 1934-40 మధ్య తెలంగాణ జీవితాలను కళ్లకు కట్టినట్లు చూపుతుంది. ఆళ్వారుస్వామి 1946-53 మధ్య దీర్ఘకాలం జైల్లో ఉన్నప్పుడు ఈ నవలను రాశారు. ఇది 1955 జనవరిలో వెలువడింది. 1940-45 మధ్య తెలంగాణ పోరాటాన్ని చిత్రించిన గంగు నవల ఆళ్వారు స్వామి అకాలమరణం(1961)తో అసంపూర్తిగా మిగిలిపోయింది. 1965 జనవరిలో అసంపూర్ణ నవలగానే అది ప్రచురితమైంది. 1947 నాటి తెలంగాణ గురించి మహీధర రామ్మోహన్‌రావు రాసిన 'ఓనమాలు' 1956 మార్చిలో వెలువడింది. ఆయన మరో నవల 'మృత్యువు నీడల్లో' 1962లో వెలువడింది.
    వట్టికోటకు కొనసాగింపుగా, తనదైన శైలిలో నవలా రచనకు పూనుకున్నారు దాశరథి రంగాచార్య. 1938కి పూర్వపు తెలంగాణ జన జీవితాలను చిత్రిస్తూ.. 'చిల్లర దేవుళ్లు'(1969) రాశారు. 1942-48 మధ్య కాలం నాటి పరిస్థితులతో 'మోదుగు పూలు'(1971), 1948-68 నాటి తెలంగాణ స్థితిగతులతో 'జనపథం'(1976) నవలలు రాశారు. తెలంగాణ పాత్రోచిత భాషతో వచ్చిన చిల్లరదేవుళ్లు నవల ఆనాడు చర్చనీయాంశమైంది. ఈ నవలను కాకతీయ పిక్చర్స్ వారు సినిమాగా తీశారు. అది 1977లో విడుదలైంది. రేడియోలో నాటకంగా ప్రసారం అయ్యింది. హిందీ, ఇంగ్లిష్ భాషల్లోకి అనువాదమైంది కూడా. 1971లోనే ఈ నవలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆ కాలంలోనే గొల్లపూడి నారాయణరావు 'తెలుగుగడ్డ' నవల తెలంగాణ ప్రజల దయనీయ జీవితాలను కళ్లకు కట్టింది. ఇటీవల కాలంలో వచ్చిన 'సంగం' (తిరునగరి రామాంజనేయులు), 'బందూక్' (కందిమళ్ల ప్రతాపరెడ్డి), 'మలుపు తిరిగిన రథచక్రాలు' (ముదిగంటి సుజాతారెడ్డి), 'కాలరేఖలు' (అంపశయ్య నవీన్) .... తెలంగాణ ఇతివృత్తంతో వచ్చిన నవలలు.
    పోరాట కథలు
    నిజాం ప్రభుత్వం నిర్బంధానికి గురై జైలు జీవితాన్ని గడిపిన వట్టికోట ఆళ్వారుస్వామి 'జైలు లోపల' పేరుతో కథలు రాశారు. పొట్లపల్లి రామారావు 'జైలు' కథలు వెలువరించారు. హైదరాబాద్ సంస్థానం రద్దవుతున్న చివరి రోజుల్లో నవాబుల జీవితాలు, హిందూ ముస్లింల సంబంధాలను వివరిస్తూ నెల్లూరి కేశవస్వామి 'చార్మినార్' కథలు రాశారు. తెలంగాణ పోరాటం తర్వాతి కాలం నాటి జనజీవితాలను చిత్రిస్తూ కాంచినేపల్లి చిన వెంకట రామారావు 'మన ఊళ్లో కూడానా?' కథల సంపుటిని వెలువరించారు.
    ఆధునిక సాహిత్యం
    మానవతావాద కవిత్వం: నిజాంకు వ్యతిరేకంగా పోరాటం సల్పిన దాశరథి 'తిమిరంతో సమరం;' సమకాలీన ఉద్యమ చైతన్యాన్ని జీర్ణించుకుని మానవతను వినిపించిన డాక్టర్ సి.నారాయణరెడ్డి 'విశ్వగీతి' నుంచి 'విశ్వంభర' వరకు.. 'సమదర్శనం' నుంచి 'మట్టీ మనిషీ ఆకాశం' వరకు సాగిన ఆయన కవితాయాత్ర; ప్రజల గొడవనే 'నా గొడవ'గా భావించిన కాళోజీ; ప్రాచీన, ఆధునిక సాహితీ సంప్రదాయాలకు నిలయమైన బాపురెడ్డి పద్య, గేయ, వచన కావ్యాలు సమత మమతల సంగమంగా కనిపిస్తాయి. 'తంగేడుపూలు' నుంచి 'జలగీతం' వరకు కొనసాగిన డాక్టర్ ఎన్.గోపి కవితా ప్రస్థానంలో మనవతా దృక్పథమే అంతః సూత్రంగా కనిపిస్తుంది.
    దిగంబర కవిత్వం: తెలంగాణ సాయుధ పోరాట కాలంలో అభ్యుదయ సాహిత్యం విస్తృతంగా వెలువడింది. తర్వాతి రోజుల్లో స్తబ్దత ఏర్పడింది. దాన్ని తొలిగించి జాతిలో చైతన్యం రేకెత్తించాలన్న ఉద్దేశంతో దిగంబర కవులు కవితా రంగంలో ప్రవేశించారు. 1965-68 మధ్య కాలంలో మూడు కవితా సంపుటాలను వెలువరించారు. వారు కవితలకు 'దిక్‌'లు అని పేరు పెట్టారు. ఆరుగురు దిగంబర కవుల్లో చెరబండరాజు (బద్దం భాస్కర్ రెడ్డి), జ్వాలాముఖి (ఏవీ రాఘవాచార్యులు), నిఖిలేశ్వర్ (యాదవరెడ్డి) తెలంగాణ ప్రాంతీయులు.
    విప్లవ కవిత్వం: నక్సల్ బరి, శ్రీకాకుళం ఉద్యమ ప్రేరణతో 1970లో విప్లవ రచయిత సంఘం(విరసం) ఆవిర్భవించింది. 1969-70 మధ్య 'తిరగబడు', 'లే', 'మార్చ్', 'ఝంజ', 'విప్లవం వర్థిల్లాలి' లాంటి కవితా సంపుటాలు వెలువడి విప్లవ కవితా దృక్పథానికి విస్తృతిని చేకూర్చాయి. దిగంబర కవుల్లో కొందరు విరసంలో చేరారు. విప్లవ కవిత్వంలో పాటకు చాలా ప్రాముఖ్యం లభించింది. శివసాగర్ రాసిన నరుడో భాస్కరుడా!, చెల్లీ చెంద్రమ్మా!.. గూడ అంజయ్య రాసిన 'ఊరు మనదిరా! ఈ వాడ మనదిరా!' లాంటి పాటలు ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లాయి. గద్దర్, వంగపండు ప్రసాదరావు లాంటివారి పాటలు విస్తృత ప్రాచుర్యం పొందాయి.
    మినీ కవిత్వం: వచన కవితలోని అస్పష్టత, సుదీర్ఘతలను పరిహరించే ఉద్దేశంతో ఆధునిక కాలంలో మినీ కవిత ఆవిర్భవించింది. సంక్షిప్తత, కొసమెరుపు మినీ కవితకు ప్రాణం. అలిశెట్టి ప్రభాకర్ కార్టూన్ కవితలు, దేవిప్రియ లాంటి వారి రాజకీయ వ్యాఖ్యాన కవితలు వర్తమాన పరిస్థితులకు అద్దం పడతాయి. మినీ కవితకు విశేషమైన ప్రాచుర్యం కల్పించినవారు అలిశెట్టి ప్రభాకర్. 'ఎర్ర పావురాలు', 'మంటల జెండాలు', 'చురకలు', 'సంక్షోభగీతం', 'రక్తలేఖ', 'సిటీలైఫ్' లాంటి మినీ కవితా సంకలనాలు వెలువరించారు. హైకులు, నానీలు కూడా మినీకవిత రూపాలే. హైకూ రూపంలో పెన్నా శివరామకృష్ణ కవితా సంపుటాలు వెలువరించారు. డాక్టర్ ఎన్.గోపి ప్రారంభించిన 'నానీ'లు జీవితానుభూతులను చిత్రిస్తాయి.
    స్త్రీవాద కవిత్వం: 1981లో ప్రచురితమైన రేవతీదేవి 34 కవితల 'శిలాలోలిత' స్త్రీవాద సంపుటాలకు నాంది పలికింది. స్త్రీల సమస్యలను స్త్రీలే శక్తిమంతంగా ప్రదర్శించగలరన్నది స్త్రీవాదుల అభిప్రాయం. 1990లో త్రిపురనేని 'గురిచూసి పాడేపాట పేరుతో స్త్రీవాద కవితల సంకలనాన్ని ప్రకటించారు. అప్పటి నుంచి స్త్రీవాద కవిత్వం విస్తృతంగా వెలువడుతోంది. 1993లో ****అస్మతవారు 'నీలి మేఘాలు' పేరుతో కవితలు సేకరించి ప్రచురించారు. షాజహానా, అనిశెట్టి రజిత, 'శిలాలోలిత' (పి. లక్ష్మి), జాజుల గౌరి, జూపాక సుభద్ర తదితరులు తెలంగాణ స్త్రీవాద కవయిత్రులు. 
    దళితవాద కవిత్వం: 90వ దశకంలో వినిపించిన బలమైన గొంతుక దళితవాదం. జయధీర్ తిరుమలరావు సంపాదకత్వంలో 1993లో 'దళిత గీతాలు', త్రిపురనేని శ్రీనివాస్, జి. లక్ష్మినరసయ్య సంపాదకత్వంలో 1995లో 'చిక్కనవుతున్న పాట', 'పదునెక్కిన పాట' సంకలనాలు వెలువడ్డాయి. దళిత ఐక్యవేదిక తరపున బీఎస్ రాములు 'ప్రవహించే పాట - ఆంధ్రప్రదేశ్ దళిత గీతాలు' ప్రచురించారు. 'బహువచనం', 'దండోరా', 'మేమే', 'నిశాని', 'గుండెడప్పు', 'మూలవాసుల పాటలు'.. లాంటి సంకలనాలు ప్రాచుర్యం పొందాయి. జూలూరి గౌరీశంకర్, బన్న ఐలయ్య, కలేకూరి ప్రసాద్ తదితరులు ప్రత్యేక కావ్యాలు వెలువరించారు.
    మైనార్టీ కవిత్వం: ఇతర వెనకబడిన వర్గాలవారి మాదిరిగానే ముస్లింలు కూడా అన్యాయాలకు గురవుతన్నారన్న అభిప్రాయంతో మైనార్టీవాదం, ముస్లింవాదం వెలుగులోకి వచ్చాయి. నల్గొండ ప్రాంతం నుంచి వెలువడిన 'బహువచనం', 'మేమే సంకలనాలు', 'బీసీ కవుల ప్రత్యేక సంచిక' లాంటివి బహుజన కవిత్వానికి ప్రాతినిధ్యం వహించాయి. వర్గీకరణ పేరుతో దళిత వాదులు రెండు వర్గాలుగా చీలిపోవడం మంచి పరిణామం కాదంటూ మాస్టార్జీ లాంటివారు హెచ్చరిస్తూ పాటలు రాశారు. ముస్లింలలో నెలకొన్న దారిద్య్రం, అభద్రతా భావం, ఛాందసత్వం వస్తువులుగా చేసుకుని యాకుబ్, స్కైబాబా, దిలావర్, అఫ్సర్, ఖదీర్, ఖాజా, షాజహానా లాంటివారు కవితలు రాశారు. మైనార్టీవాద కవిత్వానికి మచ్చుతునక 'జల్ జలా' కవితా సంపుటి.
    అస్తిత్వ పోరాట కవిత్వం: తెలంగాణ దుర్భర పరిస్థితులకు అద్దం పడుతూ ప్రాంతీయ స్పృహతో కూడిన కవిత్వాన్ని తెలంగాణ కవులు వెలువరించారు. 'పొక్కిలి' (జూలూరి గౌరీశంకర్ సంపాదకత్వంలో) 'మత్తడి' (సుంకిరెడ్డి సురేంద్రరాజు), 'కరువు' (మల్లేశం లక్ష్మయ్య) 'పరిచయిక'(సిరిసిల్ల సాహితీ సమితి) లాంటి కవితా సంకలనాలు ప్రాంతీయ అస్తిత్వ ధోరణిలో వెలువడ్డాయి. కాశీం 'పొలమారిన పాలమూరు', వడ్డేబోయిన శ్రీనివాస్ 'పడావు' లాంటి దీర్ఘ కవితలు తెలంగాణ వాస్తవికతను చిత్రించాయి. ఆది నుంచీ తెలంగాణ ప్రజలను ముందుకు నడిపించడంలో.. చైతన్య పరచడంలో సాహిత్యానిదే కీలకపాత్ర. సూటిగా మనసులను తాకేలా, ఆలోచింపజేసేలా.. ఎందరో ప్రముఖులు తమ రచనలు, కళా రూపాల ద్వారా సమాజాన్ని జాగృతం చేయగలిగారు. నవలలు, కవితలు, పాటలు, నాటికలు, నాటకాలు, బుర్రకథలు, హరికథలు, ఒగ్గుకథలు, వీధి భాగోతాలు.. ఒకటేమిటి అనేక రూపాల్లో చైతన్యాన్ని నింపగలిగారు. దశాబ్దాల చరిత్రను సొంతం చేసుకున్న తెలంగాణ సాహిత్యపు విశేషాల సమాహారమిది..
    భ్యుదయ సాహిత్యానికి 1946 నుంచి 1951 వరకు సాగిన తెలంగాణ సాయుధ పోరాటం స్వర్ణయుగం. తెలంగాణ ప్రజలతోపాటు ఎన్నో ప్రాంతాల్లోని ఎందరినో ప్రభావితం చేసింది. పోరాటం జరుగుతున్న కాలంలోనూ, ఆ తర్వాత కూడా పోరాటస్ఫూర్తితో రచనలు వెలువడ్డాయి. తెలంగాణ విమోచనోద్యమ రచయితలు కవిత్వం, పాట, నాటకం, నాటిక లాంటి సాహిత్య ప్రక్రియలను.. బుర్రకథ, ఒగ్గుకథ, బుడబుక్కల కథ, హరికథ, వీధి భాగోతం, యక్షగానం లాంటి ప్రజా కళారూపాలను సుసంపన్నం చేశారు.
    పోరాట గీతాలు
    సుద్దాల హన్మంతు, తిరునగరి రామాంజనేయులు, దాశరథి, కాళోజీ, సోమసుందర్, సుంకర సత్యనారాయణ తదితరులు ఎన్నో పోరాట గీతాలు రాశారు. సుద్దాల హన్మంతు 'పల్లెటూరి పిల్లగాడా!' పాటతో తెలుగు ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు. 'వెట్టిచాకిరి విధానమో రైతన్నా.. ఎంత జెప్పినా తీరదో కూలన్నా..' అనే గీతంలో ప్రతిఫలం లేకుండా చేసిన వెట్టిని గుండెలవిసి పోయేలా వివరించారు సుద్దాల. నిజాం నవాబుపై రాసిన గీతాల్లో యాదగిరి రాసి, పాడిన 'నైజాం సర్కరోడా' పాట తెలంగాణ ప్రజల నోళ్లలో ఇప్పటికీ, ఎప్పటికీ నానుతూనే ఉంటుంది.
    దాశరథి కృష్ణమాచార్య 'ఓ నిజాము పిశాచమా! కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని, తీగెలను తెంపి అగ్నిలో దింపినావు, నా తెలంగాణ కోటి రతనాల వీణ' అంటూ జైలు గోడలపై బొగ్గుతోనే పద్యాలు రాశారు. 'సైసై గోపాలరెడ్డీ! నీవు, నిలిచావు ప్రాణాలొడ్డి..' అంటూ స్మృతి గీతాలు రాశారు తిరునగరి. 'మన కొంపలార్చిన, మన స్త్రీల చెరిచిన, మన పిల్లల చంపి మనల బంధించిన..' అంటూ ఉద్యమ సందేశాన్నందిచారు కాళోజీ. 
    ప్రజా కళారూపాలు
    తెలంగాణ సాయుధ పోరాట కాలంలో నాయకుల ఉపన్యాసాలు, పత్రికల వార్తల కంటే ఎక్కువ ప్రభావం చూపినవి ప్రజా కళారూపాలు. తిరునగరి రామాంజనేయులు తన పాటలతోపాటు హరికథలు, బుర్రకథలు అల్లి ప్రజల్లో చైతన్యం నింపారు. సుద్దాల హన్మంతు గొల్లసుద్దులు, పిట్టలదొర వేషం, బుర్రకథ తదితర ప్రక్రియలతో ప్రజలను కదిలించారు. సుంకర-వాసిరెడ్డిల 'మాభూమి' నాటకం చాలా ప్రాచుర్యం పొందింది. సుంకర సత్యనారాయణ 'కష్టజీవి' బుర్రకథను వేలాదిగా ప్రదర్శనలు ఇచ్చారు. 'ఆంధ్ర మహాసభ కాఫిర్ల సంఘం..' అందులో చేరకూడదు అంటూ ప్రచారం చేసే వారిని దెబ్బతీసేందుకు తిరునగరి 'వీరబందగీ'; పోరాటం తీవ్రమవుతున్న దశలో 'తెలంగాణ వీరయోధులు' బుర్రకథలు రాసి ప్రదర్శించారు. చెర్విరాల బాగయ్య 'షోయబుల్లాఖాన్', చౌడవరపు విశ్వనాథం 'ఆంధ్రమహాసభ' లాంటివి పోరాట కాలంలో ప్రజలను చైతన్య పరిచాయి. ఉద్యమ కాలంలో ప్రజా కళారూపాలకు లభిస్తున్న ఆదరణను సహించలేని నాటి నిజాం ప్రభుత్వం 'కష్టజీవి', 'తెలంగాణ వీరయోధులు' బుర్రకథలను, 'మాభూమి' నాటకాన్ని నిషేధించింది.
    'వీర తెలంగాణ' గొల్లసుద్దులను తిరునగరి ప్రదర్శించారు. 'అంబ పలుకు జగదాంబ పలుకు' అంటూ సాగే బుడబుక్కల కథ, నందన.. అంటూ పంతులు కంచు పళ్లెం మీద దరువేస్తూ పాడే చెంచుల కళా రూపం, పిట్టలదొర లాంటి కళారూపాలు అణగారిన వర్గాల్లో చైతన్య జ్వాలలు రగిల్చాయి.
    పోరాట నవలలు
    తెలుగు సాహిత్యం గర్వించదగిన నవలా సాహిత్యాన్ని తెలంగాణ రైతాంగ పోరాటం సృష్టించింది. వీటిలో పోరాటం కొనసాగుతుండగా 1947లో బొల్లిముంత శివరామకృష్ణ రాసిన 'మృత్యుంజయులు', లక్ష్మీకాంత మోహన్ రాసిన 'సింహగర్జన'(1950) వెలువడ్డాయి. పోరాట విరమణ తర్వాత వట్టికోట ఆళ్వారుస్వామి రాసిన 'ప్రజల మనిషి'(1955), 'గంగు'(1965) నవలలు వెలువడ్డాయి. వీటిలో 'ప్రజల మనిషి' తెలంగాణ గురించి తెలంగాణ వ్యక్తి రాసిన తొలి నవల. ఇది 1934-40 మధ్య తెలంగాణ జీవితాలను కళ్లకు కట్టినట్లు చూపుతుంది. ఆళ్వారుస్వామి 1946-53 మధ్య దీర్ఘకాలం జైల్లో ఉన్నప్పుడు ఈ నవలను రాశారు. ఇది 1955 జనవరిలో వెలువడింది. 1940-45 మధ్య తెలంగాణ పోరాటాన్ని చిత్రించిన గంగు నవల ఆళ్వారు స్వామి అకాలమరణం(1961)తో అసంపూర్తిగా మిగిలిపోయింది. 1965 జనవరిలో అసంపూర్ణ నవలగానే అది ప్రచురితమైంది. 1947 నాటి తెలంగాణ గురించి మహీధర రామ్మోహన్‌రావు రాసిన 'ఓనమాలు' 1956 మార్చిలో వెలువడింది. ఆయన మరో నవల 'మృత్యువు నీడల్లో' 1962లో వెలువడింది.
    వట్టికోటకు కొనసాగింపుగా, తనదైన శైలిలో నవలా రచనకు పూనుకున్నారు దాశరథి రంగాచార్య. 1938కి పూర్వపు తెలంగాణ జన జీవితాలను చిత్రిస్తూ.. 'చిల్లర దేవుళ్లు'(1969) రాశారు. 1942-48 మధ్య కాలం నాటి పరిస్థితులతో 'మోదుగు పూలు'(1971), 1948-68 నాటి తెలంగాణ స్థితిగతులతో 'జనపథం'(1976) నవలలు రాశారు. తెలంగాణ పాత్రోచిత భాషతో వచ్చిన చిల్లరదేవుళ్లు నవల ఆనాడు చర్చనీయాంశమైంది. ఈ నవలను కాకతీయ పిక్చర్స్ వారు సినిమాగా తీశారు. అది 1977లో విడుదలైంది. రేడియోలో నాటకంగా ప్రసారం అయ్యింది. హిందీ, ఇంగ్లిష్ భాషల్లోకి అనువాదమైంది కూడా. 1971లోనే ఈ నవలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆ కాలంలోనే గొల్లపూడి నారాయణరావు 'తెలుగుగడ్డ' నవల తెలంగాణ ప్రజల దయనీయ జీవితాలను కళ్లకు కట్టింది. ఇటీవల కాలంలో వచ్చిన 'సంగం' (తిరునగరి రామాంజనేయులు), 'బందూక్' (కందిమళ్ల ప్రతాపరెడ్డి), 'మలుపు తిరిగిన రథచక్రాలు' (ముదిగంటి సుజాతారెడ్డి), 'కాలరేఖలు' (అంపశయ్య నవీన్) .... తెలంగాణ ఇతివృత్తంతో వచ్చిన నవలలు.
    పోరాట కథలు
    నిజాం ప్రభుత్వం నిర్బంధానికి గురై జైలు జీవితాన్ని గడిపిన వట్టికోట ఆళ్వారుస్వామి 'జైలు లోపల' పేరుతో కథలు రాశారు. పొట్లపల్లి రామారావు 'జైలు' కథలు వెలువరించారు. హైదరాబాద్ సంస్థానం రద్దవుతున్న చివరి రోజుల్లో నవాబుల జీవితాలు, హిందూ ముస్లింల సంబంధాలను వివరిస్తూ నెల్లూరి కేశవస్వామి 'చార్మినార్' కథలు రాశారు. తెలంగాణ పోరాటం తర్వాతి కాలం నాటి జనజీవితాలను చిత్రిస్తూ కాంచినేపల్లి చిన వెంకట రామారావు 'మన ఊళ్లో కూడానా?' కథల సంపుటిని వెలువరించారు.
    ఆధునిక సాహిత్యం
    మానవతావాద కవిత్వం: నిజాంకు వ్యతిరేకంగా పోరాటం సల్పిన దాశరథి 'తిమిరంతో సమరం;' సమకాలీన ఉద్యమ చైతన్యాన్ని జీర్ణించుకుని మానవతను వినిపించిన డాక్టర్ సి.నారాయణరెడ్డి 'విశ్వగీతి' నుంచి 'విశ్వంభర' వరకు.. 'సమదర్శనం' నుంచి 'మట్టీ మనిషీ ఆకాశం' వరకు సాగిన ఆయన కవితాయాత్ర; ప్రజల గొడవనే 'నా గొడవ'గా భావించిన కాళోజీ; ప్రాచీన, ఆధునిక సాహితీ సంప్రదాయాలకు నిలయమైన బాపురెడ్డి పద్య, గేయ, వచన కావ్యాలు సమత మమతల సంగమంగా కనిపిస్తాయి. 'తంగేడుపూలు' నుంచి 'జలగీతం' వరకు కొనసాగిన డాక్టర్ ఎన్.గోపి కవితా ప్రస్థానంలో మనవతా దృక్పథమే అంతః సూత్రంగా కనిపిస్తుంది.
    దిగంబర కవిత్వం: తెలంగాణ సాయుధ పోరాట కాలంలో అభ్యుదయ సాహిత్యం విస్తృతంగా వెలువడింది. తర్వాతి రోజుల్లో స్తబ్దత ఏర్పడింది. దాన్ని తొలిగించి జాతిలో చైతన్యం రేకెత్తించాలన్న ఉద్దేశంతో దిగంబర కవులు కవితా రంగంలో ప్రవేశించారు. 1965-68 మధ్య కాలంలో మూడు కవితా సంపుటాలను వెలువరించారు. వారు కవితలకు 'దిక్‌'లు అని పేరు పెట్టారు. ఆరుగురు దిగంబర కవుల్లో చెరబండరాజు (బద్దం భాస్కర్ రెడ్డి), జ్వాలాముఖి (ఏవీ రాఘవాచార్యులు), నిఖిలేశ్వర్ (యాదవరెడ్డి) తెలంగాణ ప్రాంతీయులు.
    విప్లవ కవిత్వం: నక్సల్ బరి, శ్రీకాకుళం ఉద్యమ ప్రేరణతో 1970లో విప్లవ రచయిత సంఘం(విరసం) ఆవిర్భవించింది. 1969-70 మధ్య 'తిరగబడు', 'లే', 'మార్చ్', 'ఝంజ', 'విప్లవం వర్థిల్లాలి' లాంటి కవితా సంపుటాలు వెలువడి విప్లవ కవితా దృక్పథానికి విస్తృతిని చేకూర్చాయి. దిగంబర కవుల్లో కొందరు విరసంలో చేరారు. విప్లవ కవిత్వంలో పాటకు చాలా ప్రాముఖ్యం లభించింది. శివసాగర్ రాసిన నరుడో భాస్కరుడా!, చెల్లీ చెంద్రమ్మా!.. గూడ అంజయ్య రాసిన 'ఊరు మనదిరా! ఈ వాడ మనదిరా!' లాంటి పాటలు ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లాయి. గద్దర్, వంగపండు ప్రసాదరావు లాంటివారి పాటలు విస్తృత ప్రాచుర్యం పొందాయి.
    మినీ కవిత్వం: వచన కవితలోని అస్పష్టత, సుదీర్ఘతలను పరిహరించే ఉద్దేశంతో ఆధునిక కాలంలో మినీ కవిత ఆవిర్భవించింది. సంక్షిప్తత, కొసమెరుపు మినీ కవితకు ప్రాణం. అలిశెట్టి ప్రభాకర్ కార్టూన్ కవితలు, దేవిప్రియ లాంటి వారి రాజకీయ వ్యాఖ్యాన కవితలు వర్తమాన పరిస్థితులకు అద్దం పడతాయి. మినీ కవితకు విశేషమైన ప్రాచుర్యం కల్పించినవారు అలిశెట్టి ప్రభాకర్. 'ఎర్ర పావురాలు', 'మంటల జెండాలు', 'చురకలు', 'సంక్షోభగీతం', 'రక్తలేఖ', 'సిటీలైఫ్' లాంటి మినీ కవితా సంకలనాలు వెలువరించారు. హైకులు, నానీలు కూడా మినీకవిత రూపాలే. హైకూ రూపంలో పెన్నా శివరామకృష్ణ కవితా సంపుటాలు వెలువరించారు. డాక్టర్ ఎన్.గోపి ప్రారంభించిన 'నానీ'లు జీవితానుభూతులను చిత్రిస్తాయి.
    స్త్రీవాద కవిత్వం: 1981లో ప్రచురితమైన రేవతీదేవి 34 కవితల 'శిలాలోలిత' స్త్రీవాద సంపుటాలకు నాంది పలికింది. స్త్రీల సమస్యలను స్త్రీలే శక్తిమంతంగా ప్రదర్శించగలరన్నది స్త్రీవాదుల అభిప్రాయం. 1990లో త్రిపురనేని 'గురిచూసి పాడేపాట పేరుతో స్త్రీవాద కవితల సంకలనాన్ని ప్రకటించారు. అప్పటి నుంచి స్త్రీవాద కవిత్వం విస్తృతంగా వెలువడుతోంది. 1993లో ****అస్మతవారు 'నీలి మేఘాలు' పేరుతో కవితలు సేకరించి ప్రచురించారు. షాజహానా, అనిశెట్టి రజిత, 'శిలాలోలిత' (పి. లక్ష్మి), జాజుల గౌరి, జూపాక సుభద్ర తదితరులు తెలంగాణ స్త్రీవాద కవయిత్రులు. 
    దళితవాద కవిత్వం: 90వ దశకంలో వినిపించిన బలమైన గొంతుక దళితవాదం. జయధీర్ తిరుమలరావు సంపాదకత్వంలో 1993లో 'దళిత గీతాలు', త్రిపురనేని శ్రీనివాస్, జి. లక్ష్మినరసయ్య సంపాదకత్వంలో 1995లో 'చిక్కనవుతున్న పాట', 'పదునెక్కిన పాట' సంకలనాలు వెలువడ్డాయి. దళిత ఐక్యవేదిక తరపున బీఎస్ రాములు 'ప్రవహించే పాట - ఆంధ్రప్రదేశ్ దళిత గీతాలు' ప్రచురించారు. 'బహువచనం', 'దండోరా', 'మేమే', 'నిశాని', 'గుండెడప్పు', 'మూలవాసుల పాటలు'.. లాంటి సంకలనాలు ప్రాచుర్యం పొందాయి. జూలూరి గౌరీశంకర్, బన్న ఐలయ్య, కలేకూరి ప్రసాద్ తదితరులు ప్రత్యేక కావ్యాలు వెలువరించారు.
    మైనార్టీ కవిత్వం: ఇతర వెనకబడిన వర్గాలవారి మాదిరిగానే ముస్లింలు కూడా అన్యాయాలకు గురవుతన్నారన్న అభిప్రాయంతో మైనార్టీవాదం, ముస్లింవాదం వెలుగులోకి వచ్చాయి. నల్గొండ ప్రాంతం నుంచి వెలువడిన 'బహువచనం', 'మేమే సంకలనాలు', 'బీసీ కవుల ప్రత్యేక సంచిక' లాంటివి బహుజన కవిత్వానికి ప్రాతినిధ్యం వహించాయి. వర్గీకరణ పేరుతో దళిత వాదులు రెండు వర్గాలుగా చీలిపోవడం మంచి పరిణామం కాదంటూ మాస్టార్జీ లాంటివారు హెచ్చరిస్తూ పాటలు రాశారు. ముస్లింలలో నెలకొన్న దారిద్య్రం, అభద్రతా భావం, ఛాందసత్వం వస్తువులుగా చేసుకుని యాకుబ్, స్కైబాబా, దిలావర్, అఫ్సర్, ఖదీర్, ఖాజా, షాజహానా లాంటివారు కవితలు రాశారు. మైనార్టీవాద కవిత్వానికి మచ్చుతునక 'జల్ జలా' కవితా సంపుటి.
    అస్తిత్వ పోరాట కవిత్వం: తెలంగాణ దుర్భర పరిస్థితులకు అద్దం పడుతూ ప్రాంతీయ స్పృహతో కూడిన కవిత్వాన్ని తెలంగాణ కవులు వెలువరించారు. 'పొక్కిలి' (జూలూరి గౌరీశంకర్ సంపాదకత్వంలో) 'మత్తడి' (సుంకిరెడ్డి సురేంద్రరాజు), 'కరువు' (మల్లేశం లక్ష్మయ్య) 'పరిచయిక'(సిరిసిల్ల సాహితీ సమితి) లాంటి కవితా సంకలనాలు ప్రాంతీయ అస్తిత్వ ధోరణిలో వెలువడ్డాయి. కాశీం 'పొలమారిన పాలమూరు', వడ్డేబోయిన శ్రీనివాస్ 'పడావు' లాంటి దీర్ఘ కవితలు తెలంగాణ వాస్తవికతను చిత్రించాయి. 

    తెలంగాణలో ఆంధ్రోద్యమం

    తెలంగాణ చరిత్రలో.. ప్రత్యేకించి నిజాం రాష్ట్ర ఆంధ్రోద్యమ చరిత్రలో 'ఆంధ్ర జనసంఘం' స్థాపన ఒక మహత్తర సంఘటన. అప్పటివరకు గ్రంథాలయాలను స్థాపించి భాషా సంస్కృతుల సేవకే పరిమితమైన తెలుగువారిని సామాజిక, రాజకీయ ఉద్యమాల వైపు తీసుకెళ్లిన ఘనత ఆంధ్ర జనసంఘానిదే. ఇది రాజకీయేతర సంస్థగా పనిచేస్తూనే, యువకులను చైతన్యపరిచి, పరిస్థితులను రాజకీయ కార్యరంగానికి సిద్ధం చేసింది. ఆంధ్ర మహాసభల ద్వారా మెరికల్లాంటి నాయకులను తయారు చేసింది. ప్రపంచ ప్రఖ్యాత తెలంగాణ సాయుధ పోరాటానికి బాటలు వేసింది. ఆంధ్రోద్యమంలో జనసంఘం, మహాసభల పాత్ర ఏమిటో తెలుసుకుందాం..
    నిజాం రాజ్యంలో తెలుగువారు తమ భాషా సంస్కృతులను పరిరక్షించుకోవడానికి శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం, రాజరాజనరేంద్ర ఆంధ్ర భాషా నిలయం లాంటి గ్రంథాలయాలను స్థాపించారు. వీటిద్వారా ప్రజలను చైతన్యపరిచారు. తెలుగువారు భాషా సంస్కృతులకు మాత్రమే పరిమితమైన సందర్భంలో.. వారి ఆలోచనల్లో గొప్ప మార్పును తీసుకొచ్చి, వారిని ఆంధ్రోద్యమం వైపు మళ్లించిన సంఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.
    ఆంధ్ర జనసంఘం
    హైదరాబాద్‌లోని వివేకవర్థిని థియేటర్‌లో 1921 నవంబరు 12వ తేదీ అర్ధరాత్రి హిందూ సంస్కార సభ జరిగింది. పుణె మహిళా విశ్వవిద్యాలయ స్థాపకులు దోండే కేశవ కార్వే ఆ సభకు అధ్యక్షులు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి ప్రముఖులు హాజరయ్యారు. వారంతా ఆంగ్లం, ఉర్దూతోపాటు వారి మాతృభాషల్లో కూడా ఉపన్యాసాలు ఇచ్చారు. ఆ సభలో వక్తగా ఉన్న ప్రముఖ హైకోర్టు న్యాయవాది ఆలంపల్లి వెంకట రామారావు తెలుగులో ఉపన్యాసం ప్రారంభించినప్పుడు సభికులంతా గోలచేసి ప్రసంగం కొనసాగకుండా చేశారు. ఈ ఘటనను సభలో పాల్గొన్న తెలుగువారు అవమానంగా భావించి, నిరసన తెలుపుతూ బయటకు వచ్చారు. వారంతా ఆ రాత్రే టేకుమాల రంగారావు ఇంట్లో సమావేశమయ్యారు. అక్కడకు వచ్చినవారిలో టేకుమాల రంగారావు, మాడపాటి హనుమంతరావు, మిట్ట లక్ష్మీనరసయ్య, ఆదిరాజు వీరభద్రరావు, నడింపల్లి జానకి రామయ్య, బూర్గుల రామకృష్ణారావు, మందుముల నరసింగరావు, బోయినపల్లి వెంకటరామారావు, కొమ్మవరపు సుబ్బారావు, బూర్గుల నరసింహారావు, డాక్టర్ పందింటి రామస్వామి నాయుడు.. అంతా కలిసి 'ఆంధ్ర జనసంఘం'ను స్థాపించారు. ఒక రూపాయి చందా ఇచ్చేవారు ఈ సభలో సభ్యులుగా ఉంటారని నిర్ణయించారు. వంద మంది సభ్యులు ఈ సంఘంలో చేరారు. 1922 ఫిబ్రవరి 24, మార్చి 17, ఏప్రిల్ 4న ఆంధ్ర జనసంఘం కొండా వెంకట రంగారెడ్డి అధ్యక్షతన మూడుసార్లు సమావేశమై నియమావళిని రూపొందించింది. ఆ తర్వాత ఎన్నో ఆంధ్రజన సంఘం శాఖలు నిజాం రాష్ట్రంలో ప్రారంభమై ఆంధ్రోద్యమ వ్యాప్తికి చురుగ్గా పనిచేశాయి. తెలుగువారిలో జాగృతి, ఉత్సాహం వెల్లివిరిశాయి. ఆంధ్ర జనసంఘం కూడా రాజకీయాల జోలికి వెళ్లకుండా జాగ్రత్త పడింది. సంస్కరణలు మాత్రమే లక్ష్యాలుగా నిర్ణయించుకుంది. 1922 డిసెంబరు 2న 'సూర్యాపేట వర్తక సంఘం'ను స్థాపించారు.
    జనసంఘం సమావేశాలు
    ఆంధ్ర జనసంఘం మొదటి సమావేశం 1923 జులై 27న హైదరాబాద్‌లో మాడపాటి హనుమంతరావు ఇంట్లో జరిగింది. అధ్యక్షుడుగా రాజ బహదూర్ వెంకట రామారెడ్డిని, కార్యదర్శిగా మాడపాటి హనుమంతరావును ఎన్నుకున్నారు.
    రెండో సమావేశం 1924 మార్చి 1న నల్గొండలో నీలగిరి పత్రిక సంపాదకులు షబ్నవీసు వేంకట రామనరసింహారావు కార్యాలయ ఆవరణలో జరిగింది. ఈ సభకు కూడా వెంకట రామారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ రెండు సమావేశాల్లోనూ తెలుగువారి విద్యావికాసాలు, వారి భాషాభివృద్ధికి తోడ్పడే కార్యక్రమాలనే నిర్ణయించారు.
    మూడో సమావేశం 1925 ఫిబ్రవరి 21న మధిరలో జరిగింది. దీనికొక విశిష్టత ఉంది. ఆంధ్ర జనసంఘంతోపాటు గ్రంథాలయ మహాసభ కూడా ఫిబ్రవరి 22న జరిగింది. బొంబాయి ఆంధ్రులు కూడా దీనికి సానుభూతి తెలిపారు. గ్రంథాలయాలను నిజాం సహించలేక.. రాజ్యపు అవతలివారి సంబంధాలను ఓర్వలేక.. 1925లో జరగాల్సిన నాలుగో మహాసభకు అంతరాయం కలిగించారు. వాయిదాపడిన ఈ సభలు సూర్యాపేటలో 1928, మే 28, 29, 30 తేదీల్లో అత్యంత విజయవంతంగా జరిగాయి. వీటితోపాటు గ్రంథాలయ మహాసభలు, వర్తక సంఘం సమావేశాలు కూడా జరిగాయి.
    ఈ సభలతో నిజాం రాష్ట్ర ఆంధ్రోద్యమంలో తొలిదశ విజయవంతంగా ముగిసింది. ఈ కొద్దికాలంలో తెలుగువారికి ఒక సంస్థ ఉందన్న విశ్వాసం ఏర్పడింది. వర్తకుల్లో మంచి ప్రాబల్యం సంపాదించింది. వారికి సంఘం వల్ల కొన్ని ప్రయోజనాలు కలిగాయి. దొరలు, అధికారుల బెడద కొంత తగ్గింది. ఈ దశలో ఆంధ్ర జనసంఘం వివిధ సంఘాల సంధానుకార్యాన్ని నిర్వహించింది. అందువల్ల తెలంగాణ అంతటికీ ప్రాతినిధ్యం వహించే సంస్థ అవసరమైంది. బ్రిటిష్ ఆంధ్ర నుంచి సుసర్ల శ్రీ రామనరసింహం విస్తృత ఆంధ్ర సంస్థ అవసరాన్ని సంఘానికి తెలియజేశారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని 'ఆంధ్ర మహాసభ' అవతరించింది.
    మహాసభలు
    ఒకటో ఆంధ్ర మహాసభ: మెదక్ జిల్లా జోగిపేటలో 1930 మార్చి 3, 4, 5 తేదీల్లో మొదటి సభ జరిగింది. దీనికి సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షత వహించారు. ప్రభుత్వం ఎన్నో షరతులతో సభ జరపడానికి అనుమతినిచ్చింది. ఈ సభాసమావేశాల్లో 32 తీర్మానాలను ఆమోదించారు. వీటిలో ఎక్కువగా విద్య, సంఘ సంస్కరణలకు సంబంధించినవే ఉన్నాయి. వీటితోపాటు బాల్యవివాహాల నిషేధం, వితంతు వివాహం లాంటి తీర్మానాలను కూడా చేశారు. అయితే సభలో ఉన్న సనాతన సంప్రదాయవాదులను ఈ తీర్మానాలు బాధించాయి.
    రెండో ఆంధ్రమహాసభ: ఈ సభ 1931 మార్చి 3, 4, 5 తేదీల్లో దేవరకొండలో జరిగింది. ఈ సభకు బూర్గుల రామకృష్ణారావు అధ్యక్షత వహించారు. రావి నారాయణరెడ్డి నాయకత్వాన రెడ్డి హాస్టల్ విద్యార్థులు కాలినడకన బయలుదేరి, ప్రతి గ్రామంలో ప్రచారం చేస్తూ దేవరకొండ చేరుకున్నారు. గస్తినిషాన్ తిర్పన్ - సర్క్యులర్ నం.53ను ఉపసంహరించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేయడం ఈ సభలో ప్రధాన విషయం.
    మూడో ఆంధ్రమహాసభ: రెండు మహాసభల తర్వాత సమావేశాలకు కొంత అంతరాయం వచ్చింది. ఆంధ్ర మహాసభ రాజకీయ సభ కాదని నాయకులు చెబుతున్నా, దాని తీర్మానాలు ప్రభుత్వ షరతులకు వ్యతిరేకంగా ఉన్నాయన్న నెపంతో మూడు సంవత్సరాలపాటు ప్రభుత్వం సమావేశాలు నిర్వహించడానికి అనుమతి ఇవ్వలేదు. అనేక అడ్డంకులను సృష్టించింది. వీటిని ఎదుర్కొంటూ మూడో మహాసభలు 1934 డిసెంబరు 13, 14, 15 తేదీల్లో ఖమ్మంలో జరిగాయి. ఈ సభలకు పులిజాల వెంకట రంగారావు అధ్యక్షత వహించారు.
    నాలుగో ఆంధ్ర మహాసభ: మాడపాటి హనుమంతరావు అధ్యక్షతన 1935 డిసెంబరు 26, 27, 28 తేదీల్లో సిరిసిల్లలో జరిగాయి. ఈ సమావేశాల్లో ఆంధ్ర మహాసభ వ్యవహారాలన్నీ తెలుగులోనే జరగాలని, ఉపస్యాసాలు తెలుగులోనే ఉండాలని నిర్ణయించారు. ఈ సభల్లో సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించారు.
    అయిదో ఆంధ్ర మహాసభ: షాద్‌నగర్‌లో 1936 డిసెంబరు 15, 16, 17 తేదీల్లో కొండా వెంకటరంగారెడ్డి అధ్యక్షతన జరిగింది. దీనికి దాదాపు 10వేల మంది హాజరయ్యారు.
    ఆరో ఆంధ్ర మహాసభ: నిజామాబాద్‌లో 1937 డిసెంబరు 6, 7, 8 తేదీల్లో జరిగింది. మందుముల నరసింగరావు అధ్యక్షత వహించారు. అప్పటివరకు ఆంధ్ర మహాసభను రాజకీయేతర సంస్థగా పరిగణించేవారు. కానీ ఈ సమావేశాల్లో అది రాజకీయ కార్యాచరణ దిశగా అడుగులు వేసింది. బ్రిటిష్ ప్రభుత్వం దేశంలో 'భారత ప్రభుత్వ చట్టం - 1935'ను అమలు చేయాలని నిర్ణయించింది. 1937 ఫిబ్రవరి 13న నిజాం ఉల్ ముల్క్ ఉస్మాన్ అలీఖాన్ 25 సంవత్సరాల రాజ్యపాలన (సిల్వర్ జుబ్లీ) వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ ఆనంద సమయంలో నిజాం ప్రభువు తన పరిపాలనలో కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా ప్రజాప్రతినిధుల మండలిని ఏర్పాటు చేయడం కోసం, రాజ్యాంగ సవరణలు సూచించడానికి 1937 సెప్టెంబరు 22న ప్రముఖ న్యాయవాది అరవముద అయ్యంగార్ అధ్యక్షతన ఒక కమిటీని ప్రకటించారు. ఈ సమావేశాల్లో పలు రాజకీయ తీర్మానాలు చేశారు. అంతకుముందు అంతర్లీనంగా ఉన్న అతివాద, మితవాద భావాలను బహిరంగంగా ప్రకటించడం ప్రారంభమైంది.
    ఏడో ఆంధ్ర మహాసభ: హైదరాబాద్ జిల్లా మల్కాపురంలో 1940లో జరిగింది. మందుముల రామచంద్రరావు అధ్యక్షత వహించారు. ఈ సమావేశాలు అంతకుముందు వాటి కంటే భిన్నంగా జరిగాయి. ఈ సభలోనే కమ్యూనిస్టులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సభ నుంచే మితవాదులు, అతివాదులనే రెండు గ్రూపులు ఏర్పడ్డాయి. నిజాం రాష్ట్రంలో జరిగిన ప్రథమ సత్యాగ్రహంలో మందుముల రామచంద్రరావు, రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి పాల్గొన్నారు. సత్యాగ్రహం ద్వారా రాజకీయ చైతన్యాన్ని పొందిన యువకులు మహాసభల్లో మరింత చురుగ్గా పాల్గొన్నారు.
    ఎనిమిదో ఆంధ్ర మహాసభ: నల్లగొండ జిల్లా చిలుకూరులో 1941లో జరిగింది. కమ్యూనిస్టు ఉద్యమ నేత రావి నారాయణరెడ్డి అధ్యక్షత వహించారు. నాయకులు మితవాదులు, అతివాదులుగా చీలిపోవడంతో చిలుకూరు సభలకు ప్రాధాన్యం ఏర్పడింది. అధ్యక్ష ఉపన్యాసంలో ప్రపంచ యుద్ధాలు, అంతర్జాతీయ అంశాలు, పెట్టుబడిదారీ ఆర్థిక విధానాల వల్ల కలిగే నష్టాలు వంటి అంశాలు చోటుచేసుకున్నాయి. కౌలు సమస్య, వెట్టిచాకిరి, రైతుల సమస్యలు, స్త్రీలసమస్యలు లాంటి అంశాలు చర్చకు వచ్చాయి. సభ్యత్వ రుసుమును రూపాయి నుంచి నాలుగు అణాలకు తగ్గించారు. ఈ నిర్ణయం మహాసభను ప్రజలకు మరింత చేరువ చేసింది. రావి నారాయణరెడ్డి అధ్యక్ష కాలంలో ఆంధ్ర మహాసభ తరఫున విద్యా వారం (1941 అక్టోబరు 19-25), బేగారి వారం (1941 డిసెంబరు 25 - 1942 జనవరి 1), రాజకీయ బాధితుల దినం (1941 డిసెంబరు 25) జరిపారు. గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ప్రచారం నిర్వహించి రైతులు, కూలీల్లో చైతన్యం తేగలిగారు.
    తొమ్మిదో ఆంధ్ర మహాసభ: వరంగల్ జిల్లా ధర్మవరంలో 1942 మేలో జరిగింది. మాదిరాజు రామకోటేశ్వరరావు అధ్యక్షత వహించారు. మితవాదుల్లో మితవాది మాదిరాజు. పరిస్థితులు అతివాదులకు అనుకూలంగా ఉన్నప్పటికీ సంఘ నిర్మాణ బలహీనతల వల్ల నాయకత్వం తిరిగి మితవాదుల చేతుల్లోకి మారింది. యువ నాయకుల సహాయ సహకారాలు ఈ సభకు లభించలేదు.
    పదో ఆంధ్ర మహాసభ: ఈ సభ 1943 మే 23, 24, 25 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగింది. జాతీయవాది కొండా వెంకట రంగారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సభలో మొదటిసారి అధ్యక్షుడి ఎన్నికకు పోటీ జరిగింది. అతివాద నాయకులు బద్దం ఎల్లారెడ్డి, మితవాద నాయకుడు కొండా వెంకట రంగారెడ్డి మధ్య జరిగిన పోటీలో రంగారెడ్డి విజయం సాధించారు. దీంతో మితవాదులు, అతివాదుల మధ్య అంతరం తారాస్థాయికి చేరింది.
    11వ ఆంధ్ర మహాసభ: భువనగిరిలో 1944 మార్చిలో జరిగింది. దీనికి రావి నారాయణరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సమావేశాల్లో మితవాదుల జోక్యం లేదు. విజయవాడ ప్రాంతం నుంచి సుమారు వంద మంది కమ్యూనిస్టు నాయకులు, కార్యకర్తలు సభలో పాల్గొన్నారు. ఈ మహాసభ వామపక్ష వాతావరణంలో ఒక బలీయమైన ప్రజాఉద్యమ రూపాన్ని సంతరించుకుంది. ఈ సభలకు 10వేల మంది హాజరయ్యారు. సభలో సభ్యత్వ రుసుమును నాలుగు అణాల నుంచి ఒక అణాకు తగ్గించి మహాసభను ప్రజలకు మరింత చేరువ చేశారు. అయితే, ఆంధ్ర మహాసభలో తమకిక స్థానం లేదనుకున్న మితవాదులు కొండా వెంకట రంగారెడ్డి ప్రోద్బలంతో మందుముల నరసింగరావు అధ్యక్షతన పోటీ మహాసభ పెట్టారు. తమదే నిజమైన ఆంధ్ర మహాసభ అని పేర్కొంటూ.. 1945లో మడికొండలో ఆంధ్ర మహాసభలను నిర్వహించారు.
    12వ ఆంధ్ర మహాసభ: ఖమ్మంలో 1945 ఏప్రిల్ 26, 27 తేదీల్లో రావి నారాయణరెడ్డి అధ్యక్షతన జరిగింది. దాదాపు 40 వేల మంది ప్రజలు హాజరయ్యారు. ఈ సభలో రైతులకు సంబంధించి అనేక తీర్మానాలు చేశారు. వెట్టిచాకిరిని వెంటనే రద్దు చేయాలని సభ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. నిజాం రాజ్యాన్ని ఎదిరించి, ప్రజారాజ్యాన్ని స్థాపించాలని ఆంధ్ర మహాసభ పిలుపునిచ్చింది. ఈ మహాసభల తర్వాత రాజకీయ పోరాటాలు తెలంగాణ అంతటా వ్యాపించాయి. ప్రజా పోరాటమే సమస్యల పరిష్కారానికి పరమావధిగా ప్రజలు గ్రహించారు. ఆంధ్ర మహాసభపై 1946 జులైలో ప్రభుత్వం నిషేధం విధించింది. మితవాద నాయకుల ఆంధ్ర మహాసభ 1946లో కందిలో జమలాపురం కేశవరావు అధ్యక్షతన జరిగింది. దీని తర్వాత స్టేట్ కాంగ్రెస్‌పై నిషేధం ఎత్తివేయడంతో మితవాదుల ఆంధ్ర మహాసభ కాంగ్రెస్ పార్టీలో విలీనమైంది.
    మహిళా సభలకూ చోటు 
    ఆంధ్ర మహాసభలతోపాటు మహిళా సభలను కూడా నిర్వహించారు. ఈ సంప్రదాయం పదో ఆంధ్ర మహాసభ వరకు కొనసాగింది. సభలకు నడింపల్లి సుందరమ్మ, టి.వరలక్ష్మమ్మ, ఎల్లాప్రగడ సీతాకుమారి, మాడపాటి మాణిక్యమ్మ, బూర్గుల అనంత లక్ష్మీదేవి, నందగిరి ఇందిరాదేవి, యోగ్యశీలాదేవి, రంగమ్మ ఓబులరెడ్డి వంటివారు అధ్యక్షులుగా వ్యవహరించారు.